క్యాలెండర్లో డిసెంబర్
నెల చూశారా? చూశాం అందులో స్పెషాలిటీ ఏముంది? అనుకుంటున్నారా? అయితే ఓసారి
మళ్లీ లుక్కేయండి. శని, ఆది, సోమవారాలు ఐదు రోజుల పాటు వస్తున్నాయి. ఇలాంటి
అద్భుతం రావడం చాలా రేర్. 1, 8,15, 22, 29 తారీఖులు శనివారం వస్తుండగా.. 2, 9,
16, 23, 30 ఆదివారం వస్తోంది. 3, 10, 17, 24, 31 తేదీలు సోమవారం వస్తున్నాయి. ఈ
అద్భుతం 824 సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే జరుగుతుందట...
గతంలో 1188వ
సంవత్సరం అక్టోబర్‌లో ఐదు శని, ఆది, సోమవారాలు వచ్చాయి. దాని తర్వాత ఈ ఏడాదే
ఇలాంటి అద్భుతం జరుగుతోంది. ఫ్యూచర్‌లో ఇలాంటి అద్బుతం మళ్లీ 2వేల 836లోనే
జరుగుతుంది. శని, ఆది, సోమవారాలు ఐదు రోజుల పాటు వస్తున్నందున డిసెంబర్ నెల చాలా ప్రత్యేకమైందని సంఖ్యాశాస్త్ర
నిపుణులు అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత
ఉందట. శనివారం శని భగవానునికి, ఆదివారం సూర్యునికి, సోమవారం చంద్రునికి పూజలు
చేయడం పరిపాటి. అలాగే నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో రంగు ఉంటుంది. శనికి
నలుపు, సూర్యునికి ఎరుపు, చంద్రునికి తెలుపు రంగు వర్తిస్తుంది. డిసెంబర్ ఒకటో
తేదీ శనివారం ప్రారంభమై, సోమవారంతో మాసాంతం అవుతుంది. దీనిని నవగ్రహాల గణాంకాల
ప్రకారం చూస్తే నలుపుతో ప్రారంభమై తెలుపుతో ముగుస్తుంది. అందువల్ల ఈ నెల వివాహాలు,
గృహ ప్రవేశంతో పాటు ఎలాంటి శుభకార్యాలైనా చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు
చెబుతున్నారు. అంతేకాదు డిసెంబర్ నెల
నలుపుతో ప్రారంభమై తెలుపుతో ముగుస్తున్నందున కొత్త ఏడాదిలో అంతా శుభమే జరుగుతుందని
అంటున్నారు. డిసెంబర్‌లో శని, సూర్య, చంద్ర గ్రహ దోషాలున్న వారు ఆయా గ్రహాలకు
పూజలు చేస్తే మంచి ఫలితాలుంటాయట.
అన్నట్టు ఈ ఏడాది డిసెంబర్‌కు మరో ప్రత్యేకత ఉంది. అది 12వ తేదీ 12
నెల 12వ సంవత్సరం. అంకెల్లో రాస్తే 12-12-12. మళ్లీ ఇలాంటి తేదీ రావాలంటే మరో
వెయ్యేండ్లు ఎదురు చూడాల్సిందే. 3012 వ సంవత్సరంలోనే మళ్లీ ఇలాంటి డేట్
వస్తుంది.
Informative. Thanks for sharing.
ReplyDelete