బుటా
తర్వాత ఇంకో జరీ బుటా! సెల్ఫు తర్వాత ఇంకో పూల సెల్ఫు! పడుగు పైన పట్టు
పాగళ్లు! పేకలు పేర్చిన బట్ట మీద రంగురంగుల సీతాకోకచిలకలు! సొగసైన వస్త్రం మీద
జలతారు పోగులు!! లోకం మానాన్ని రక్షిస్తున్న నిరంతర శ్రామికుడు! కానీ ఏం లాభం?! బట్ట
పోగు అతికింది.. కానీ అతని బతుకు పోగు అతకలేదు!! అగ్గిపెట్టెలో ఆరు గజాల చీర
నేసినా ఘనకీర్తి గతంగానే మిగిలింది!! మగ్గం మీద మరణమృదంగం ధ్వనిస్తోంది! నరాల్ని
దారాలుగా చేసి- రక్తాన్ని రంగుగా మార్చి బట్ట నేసినా -బతుకు మారలేదు!! పేరులో సిరి
ఉన్నా బతుకలో సిరిలేదు! అర్ధాకలి! అప్పులు! ఆలుబిడ్డల్ని రోడ్డున పడేసి ఉరికంబాలకు
వేలాడుతున్నారు! ఒక్కమాటలో చెప్పాలంటే సిరిసిల్ల ఇప్పుడు అంపశయ్య మీదుంది!! పడుగు
పోగుల ఉరితాళ్ల మధ్య వేలాడుతూ మగ్గం గుంతలోనే నేతన్న బతికున్న శవంలా మారిపోతున్నాడు!
No comments:
Post a Comment