Friday 4 January 2013

నేనూ.. మా ఆవిడ.. ఓ కాసుల పేరు !!!!



రోజూ రాత్రి పదకొండున్నరకు ఇద్దరం కూచుని భోం చేశాక.. సింకులో సాయంత్రానికి పోగైన వంటపాత్రలు గట్రా శుబ్బరంగా తోమి, ఎక్కడివక్కడ నీట్గా సర్ది, బయట లైట్ ఆఫ్ చేసి, డోర్కర్టెన్లాగుతూ మెల్లగా మొదలెడుతుంది. ఏవండీ ఒక రవ్వల నెక్లెస్! ఏవండీ ఒక పచ్చల హారం! ఓనర్ ఆంటీవాళ్లు ఇవాళ కెంపుల హారం కొన్నారట తెలుసా? కళ్యాణ్జివెల్రీస్లో మేకింగ్ చార్జీలు లేవట! మలబార్గోల్డ్వాళ్లు ఇస్తున్న యాడ్ ఈసారి డిఫరెంట్ గా ఉంది కదా! మధ్యలో మలబార్గోల్డ్ఎందుకొచ్చిందో అర్ధంకాదు.జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టయిల్ మార్చాడు దరిద్రంగా ఉంది! దానికో ఎదవ ఫీడ్బ్యాక్ఒకటి! ఎంతైనా ఖజానా జివెల్రీ గోల్డే గోల్డ్కదాండి! చిన్నదాని చెవిదిద్దులు కొని మూడేళ్లయినా అదే మెరుపు. అన్నట్టు ఇవాళ పేపర్లో చదవాను.. చిదంబరం బంగారం మీద ఏదో కుట్ర చేస్తున్నట్టున్నాడు. వన్ బై వన్నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఒకేసారి ఎత్తేసినట్టు.. ఇలా ఒకదానికొకటి ఎన్ని లింకుల్లేని సంగతులు చెప్పినా అందులో లీడ్ మాత్రం ఒకటే. వాంట్ నెక్లెస్. ఎక్కువ అడగటం లేదు. ఒక రెండు లకారాలివ్వండి నేనేమైనా తక్కువా? సోది రోజూ ఉండేదే! అని పట్టించుకోకుండా పొద్దున మిగిలిన పేపర్తాలుకు మధ్య పేజీల్లో అర్ధం కాని బిజినెస్ పదాలు చదువుతూ భార్యామణి మాటలు చెవిలో వేసుకుని చెవి నుంచి తీసేస్తుంటాను..

అయినా తీర్మానం ఇప్పటిది కాదు. మూడేళ్లుగా ఏకాభిప్రాయం లేదు. ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టింది. వాళ్ల వాళ్లు- మా వాళ్లు. నెక్లెస్ కోసం నెక్లెస్రోడ్డులో పెద్ద ఉద్యమమే నడిపిందినేను మాత్రం తెలంగాణపై చంద్రబాబులా తప్పించుకుని ఆఫీస్ యాత్ర చేస్తునే ఉన్నాను. గతంలో నేను మీ ఇంటికి లేఖ కూడా రాశాను. ఇప్పుడూ అదే చెప్తున్నాను అంటూ పూటకి పూట వాయిదా వేసుకుంటూ వచ్చాను.
చివరికి సమయం రానే వచ్చింది. షిండే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత నెల రోజుల గడువులా నేనూ డెడ్లైన్బ్యాంగ్ వేశాను30రోజుల కౌంట్ డౌన్మొదలైంది. నాలో గుండెదడ మొదలైంది. హామీ అయితే ఇచ్చాను... డిసెంబర్ 9లాంటి ప్రకటన చేశానుమరి పైసలెట్టా? పదా ఇరవయ్యా? రెండులక్షల వరహాలు కావాలట! నేనేమైనా తానీషా రాజ్యంలో రామదాసులా తహశీల్దారునా? సాయంత్రాలు ఫణంగా పెట్టి ఉద్యోగం వెలగబెడుతున్న జర్నలిస్టుని. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇంకా గుర్తింపు రాని (ఇంకా మందుకొట్టని) విలేకరిని! 

మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే రోజు నేను లీవ్ కూడా పెట్టాలటముందురోజు రాత్రి నాకు నిద్ర లేదు. డబ్బులు పోతున్నాయని ఒకటే కలత నిద్రమా ఆవిడకీ నిద్ర లేదు. ఎప్పుడెప్పుడు కొందామా.. ఎప్పుడెప్పుడు మెడలో వేసుకుందామా.. పిన్ని వాళ్ల ముందు సంక్రాంతికి బడాయి పోవాలా అని! మొత్తానికి వెళ్లాం. ముందు ఖజానాకి. అక్కడ నాలుగైదు డిజైన్లు చూశారు. నచ్చలేదు!! ఒకదానికి రాళ్లెక్కువున్నాయట! ఒకదానికి మువ్వలు లేవట!! ఒకదానికి కటింగ్ కరెక్టుగా లేదట!!! అన్నీ బావున్న దానికి బ్యాక్ చైన్లేదటబాప్రే.. గంటలో నాకు ఎంత జ్ఞానం సమకూరిందో!! 
ఇక లాభం లేదనుకుని కాళ్లీడ్చుకుంటూ కల్యాణ్లోకి అడుగుపెట్టాం. నన్ను చూడగానే వాడు గుర్తుపట్టాడు. ఎందుకంటే అప్పుడెప్పుడో దిక్కుమాలిన స్కీం పేరుతో వాడు నెలకు వెయ్యి రూపాయల టోపీ పెట్టాడు. ఇక రోజునుంచి నేను రెగ్యులర్గా  నెలకోసారి కౌంటర్ దగ్గరికి వెళ్లడం.. స్కీంలో డబ్బులు కట్టడం!!  అలా గుర్తుపట్టాడన్నమాట నన్ను వాడు. నిర్వేదపు నవ్వు వాడి మొహాన విసిరేసి.. హారాలు కొలువుదీరిన చోటికి వెళ్లి కూలబడ్డాం. మళ్లీ ఖజానా కథే రిపీటవుతోంది. ఈసారి నాకు తిక్కరేగిందికొంటే కొనండి లేదంటే నేను జంప్ అని అల్టిమేటం జారీ చేశాను. ఎట్టకేలకు కాసులపేరు దగ్గర మా ఆవిడ ఫిక్సయింది. దాని ఎస్టిమేషన్ వేయడం మొదలెట్టాడు సేల్స్ మేన్. తరుగు.. మేకింగ్ చార్జీలు.. ఇన్షూరెన్స్, వ్యాట్, ఆ రోజు రేట్.. షాప్‌ ఖర్చులు, సిబ్బంది జీతాలు, కరెంటు, ఏసీ బిల్లు, హౌజ్ కీపింగ్, సెక్యూరిటీ, పార్కింగ్, తొక్కా తోలు అన్నీ కలిపి లక్షా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర దగ్గర వచ్చి ఆగాడు. నాకు గుండె ఆగినంత పనైంది.. బాటా చెప్పుతో నాకు నేను కొట్టుకోవాలనిపించింది...
 
అప్పటికే నా రెండు క్రెడిట్ కార్డులకు గజ్జిలేచింది! (ఐ మీన్‌ గీకీగీకీ..) ఉన్నది ఒకే ఒక డెబిట్ కార్డు. దానికీ ఆల్రెడీ ఒళ్లంతా పచ్చిపుండులా ఉందిఎందుకంటే నెలలో పదిహేను రోజులు ఏ ఏటీఎంలో పడితే ఏటీఎంలో గోకుడే గోకుడాయెమళ్లీ వాటికి పనిపడింది. బిల్రెడీ అయింది. భారంగా కౌంటర్ దగ్గరికి నడిచాను. మూడు కార్డులు వాడిచేతిలో పెట్టాను. కాసుల పేరు మా ఆవిడ చేతిలో పెట్టాను.  ఆమెను, వాళ్ల నాన్నను ఆటో మాట్లాడి ఇంటికి పంపించాను. 
ఐదు గంటల హడావిడి తర్వాత, తల పట్టేసినట్టయింది. కళ్లు బైర్లు కమ్మాయి. మైకం వచ్చినట్టుగా ఉంది. ఒళ్లంతా తిమ్మిరి పట్టింది. నాలుక పిడుచగట్టుకు పోయింది. కడుపులో దేవేసినట్టు.. రకరకాల ఫీలింగ్స్. తూలుతూ తూలుతూ నడిచాను. గుండెల నిండా సిగరెట్  తాగాలనుకుని పాన్ షాప్ ముందుకు వెళ్లాను. జేబులు తడుముకుని చూద్దునుగదా.. ఆరు రూపాయలకి ఒక రూపాయి తక్కువుంది! థూ.. నా బతుకు చెడా!! అని తిట్టుకుంటూ పంజాగుట్ట చౌరస్తాలో దిక్కుతోచని బాటసారిలా సిగ్నల్వంక పిచ్చిపిచ్చిగా చూస్తూ ఉండిపోయాను.

13 comments:

  1. model superundandi.naku innala kaslu peru model nachedi kaadu mee post valla mayaniki kuda bumperoffer ivvalnukuntunna.thanku

    ReplyDelete
    Replies
    1. పాపం మీ ఆయనకి నా తరుపున చెంచాడు కన్నీళ్లు....(బ్లాగ్‌కి స్వాగతం)

      Delete
  2. నేను మీరు ఒక్క సిగరెట్ట్

    ReplyDelete
  3. కంగ్రాట్స్....మొత్తానికి కాసులపేరు అమిరింది
    మీకు బోలెడంత నాలెర్జ్ వచ్చింది...:-)

    ReplyDelete
    Replies
    1. ఏం చేస్తామండీ.. అదొక్కటే నాకు దక్కింది..

      Delete
  4. "ఈ సోది రోజూ ఉండేదే! అని పట్టించుకోకుండా పొద్దున మిగిలిన పేపర్‌ తాలుకు మధ్య పేజీల్లో అర్ధం కాని బిజినెస్ పదాలు చదువుతూ భార్యామణి మాటలు ఈ చెవిలో వేసుకుని ఆ చెవి నుంచి తీసేస్తుంటాను.."--- ఈ పధ్ధతి ఏదో బావున్నట్టుందే... ఏమిటో ఇన్నేళ్ళొచ్చినా తట్టనే లెదూ...

    ReplyDelete
    Replies
    1. అయితే మీరు గురు దక్షిణ ఇచ్చుకోవాల్సిందే!!
      అలాంటిదేమీ లేదు.. జస్ట్ జోకానంతే....!
      (బ్లాగ్‌కి స్వాగతం)

      Delete
    2. కాసుల పేరు.. రెండు లక్షలు. పోతే పోయాయి( అంతకంటే చేయగలిగిందేమీ లేదు కాబట్టి).. కనీసం ఐటీ రిటర్న్స్‌ లో కూడా చూపించుకోలేం అన్నా. ఇది దారుణం. ఇలాంటప్పుడే శుభలగ్నం సినిమాలో.. ఎదురింటి పిన్నిగారి కాసుల పేరు పాటలో జగపతిబాబులో మనల్నిమనం ఐడెంటిఫై చేసుకుని .. సెల్ఫ్‌ సానుభూతి చూపించుకోవడం తప్ప మరేం చేయలేం. సర్వకాల సర్వాస్థలయందు.. చట్టం, చుట్టం( అందరూనూ) వాళ్లకే అనుకూలం కాబట్టి.. మరీ ఎక్కువ మాట్లాడితే. సాధింపులు, వేధింపులు..ఆ పై 498ఏలు.. అవసరమా మనకి. అందుకే భర్తగా..భార్య కోరింది ఇవ్వడమనే విధిని( నా బొంద.. ) నిర్వర్తించి.. ఖాళీ జేబులను తడుముకుంటూ.. ఎవరూ చూడనప్పుడు బావురుమనడమే బెస్ట్‌.

      Delete
  5. అయ్యా మీరిలా బ్లాగ్ లో నగల ఫొటోలు పెడితే మాకు ఇంట్లో టాక్స్ పడుద్ది...మీ దగ్గరకే అప్పుకు రావాల్సిన పరిస్థితి...గమనించగలరూ...:)

    ReplyDelete
    Replies
    1. వస్తే మాత్రం ఏంలాభం గురుగారూ...
      నా దగ్గర బూడిద మాత్రమే ఉంది!

      Delete
  6. కాసులపేరు అమరినందుకు మీ ఆవిడగారికి, బోలెడు నాలెడ్జ్ వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు :)
    మరి మాకు ట్రీట్ ఏది?????? (సరదాకే అన్నాలెండి, మీ కార్డులని ఇంకా గీకకండి, పాపం వాటికి నొప్పెడుతుంది)

    ReplyDelete
    Replies
    1. ఈట్ స్ట్రీట్‌లో ట్రీట్‌ ఇస్తా లెండి!(ఇంకా కార్డులా.. నా బొంద.. వాటన్నిటినీ ఎప్పుడో విరిచేశాగా...)

      Delete