Thursday 6 December 2012

కాకతి రాణి రుద్రమ- శిల్పి రామప్ప మధ్య ప్రేమాయణం?!



కాకతీయుల పౌరుషాగ్ని రాణిరుద్రమ రామప్పను ప్రేమించిందా? అంత గొప్ప పరాక్రమశాలి ఒక శిల్పకారుడిని ఎందుకు ఆరాధించింది? యువరాణి మనసు దోచిన రామప్పతో వివాహం ఎందుకు జరగలేదు!  
1260. రాణి రుద్రమ వివాహం, పట్టాభిషేకం జరిగిన సంవత్సరం! అంతకుముందే రాణి రుద్రమ ఒక యువరాజుగానే చలామణి అయ్యేది! మగ వేషధారణలోనే తిరిగేది! ఆమెను జనం కూడా రుద్రమ మహారాజువారు అనే పిలిచేవారు! యువరాజు హోదాలోనే అనేక రాజ్యాలు తిరుగుతున్న సందర్భంలో బేలూరు చెన్నకేశవలాయాన్ని చూసి ముచ్చట పడుతుంది! తన రాజ్యంలో కూడా అలాంటి గుడి కట్టాలని తండ్రి గణపతికి చెబుతుంది! కాకపోతే ఆ గుడిపై శిల్ప భంగిమలు తనవే ఉండాలని కోరుకుంటుంది! సరేనన్న తండ్రి రామప్ప అనే శిల్పిని పిలిపించి గుడి గురించి వివరిస్తాడు! కాకపోతే స్తంభాల మీద, గోడల మీద చెక్కే శిల్పాలు తన కూతురు రుద్రమవే ఉండాలని ఆజ్ఞాపిస్తాడు! అప్పుడే రామప్పకు సందేహం వచ్చింది! చూస్తే మగరాయుడిలా ఉంది.. ఈమెకు నాట్యం కూడా తెలుసా అని!?  అయితే రామప్ప సందేహం పటాపంచలు కావడానికి ఎంతో సమయం పట్టలేదు. రుద్రమ బాడీ లాంగ్వేజీలో ఎంత రౌద్రరసం తొణికిసలాడినా.. నాట్యం చేసే సమయంలో ఆమె రూపం ముగ్ద మనోహరంగా మారిపోతుంది. అలా మగవేషాన్ని వీడి సహజ సౌందర్యంతో నాట్యం ఆడుతుంటే రామప్ప కనురెప్ప వాల్చలేదు. ఆమె ఆడుతున్నంత సేపు స్థాణువులా నిలిచిపోయాడు. రుద్రమ భంగిమలన్నీ ఒక్కొక్కటిగా రామప్ప మస్థిష్కంలో స్నాప్‌షాట్ లాగా మిగిలిపోయాయి. వాటినే రామప్ప శిల్పాలుగా మార్చాడనే జానపద గాథ ఒకటి ప్రచారంలో ఉంది! ఈ సందర్భంలోనే రామప్పకు, రాణి రుద్రమకు మధ్య ప్రేమ చిగురించినట్లు చాలా కథలు, నవలలు, పుస్తకాలు వచ్చాయి. మల్లాది వసుంధర లాంటి ప్రముఖ కవయిత్రులు కూడా ఇదే ఇతివృత్తంతో నవలలు రాశారు. ఈ కథలో చివరికి రామప్ప నుంచి రాణి రుద్రమను వేరుచేస్తారు. తర్వాత రామప్ప వేదనతో చనిపోతాడు. దీంతో ఆ రుద్రేశ్వరాలయానికి రామప్ప పేరు పెడతారు. అయితే ఈ కథకు చారిత్రక ఆధారాలు లేవు. రాణి రుద్రమను వీర వనితగానే చూడడానికి జనం ఇష్టపడతారు. కాపోతే కథకు బలం చేకూర్చడం కోసం చేసిన ప్రయోగం ఇది. అయితే ఆ కథల్లో రుద్రమ వ్యక్తిత్వం కంటే రామప్ప వ్యక్తిత్వమే ప్రకాశిస్తుంది. ఇదంతా అవునని అనలేం. అలాగని కాదనీ చెప్పలేం!  కాకపోతే రాణిరుద్రమ ప్రేమలో పడిందంటే వినడానికి కొంత ఆశ్చర్యంగా ఇంకొంత యాంగ్జయిటీగా ఉంది.   
 

9 comments:

  1. Interesting ..:)
    మీ బ్లాగ్ పేరు చాలా బాగుంది..:)

    ReplyDelete
  2. థాంక్యూ.. ధాంక్యూ వెరీమచ్‌.. విత్‌ ప్లెజర్‌!!!!!

    ReplyDelete
  3. మళ్ళీ అదే ప్రశ్న. మీకు బుద్ధి ఉందా ? ఇది తిట్టు కాదు.

    జరిగి పోయిన కాలానికి సంబంధించి జరిగిపోయిన వ్యక్తుల వ్యక్తి గత జీవితాల గురించి ఇలా వ్రాయడం ఎంతవరకు సమంజసం ? పుకారు వంటి విషయాలకు అక్షర రూపంగా ప్రచారాన్ని ఇవ్వడం ఏమి ధీరత్వం ?

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. నీకు తలకాయ ఉందా? ఉంటే అందులో మెదడు ఉందా? ఇవి ప్రశ్నలు కాదు.. తిట్లు! అయినా అది నీకు అనవసరం.. నోరు మూసుకో!! ఇది నా బ్లాగు. నా ఇష్టం వచ్చింది రాసుకుంటాను. కాదనడానికి నువ్వెవరు? నీకు నచ్చకుంటే చదవకు. అంతేగానీ వాగకు. ఇంకోసారి ఇలాంటి చెత్త పుచ్చు దిక్కుమాలిన పనికిమాలిన కమెంట్లు పెడితే తర్వాత వచ్చే రిప్లయ్‌ ఘాటుగా ఉంటుంది. బీ కేర్‌ ఫుల్!

      Delete
  4. తిట్టే వాడెవడూ ఇది తిట్టు కాదు అని నోట్ వ్రాయడు. సింపుల్ గా ఈ టపా వ్రాసేటపుడు బుద్ధి (అంటే మీ విచక్షణ జ్ఞానం) పని చేయలేదా అని అడుగుతున్నాను.

    మీకు నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు వ్రాయవచ్చు. చరిత్ర దేముంది చించేస్తే చిరిగి పోతుంది. వ్రాసేద్దాం, అంతేనా ? ఇంకేమీ లేదా ? నిద్రలో వ్రాసే వ్రాతలు నీళ్ళపై గీతలే.

    ఈ ప్రశ్నలకి ఘాటుగా, మోటుగా సమాధానం మీరివ్వచ్చు. నేను తీస్కోను. మీ బ్లాగు లో అలా పడి ఉంటాయి.

    ReplyDelete
    Replies
    1. ఫర్‌ యువర్‌ కైండ్ ఇన్ఫమేషన్‌!!
      అవి తిట్లో కాదో తెలుసుకోలేని అజ్ఞానాంధకారంలో ఉన్నావనే
      తిడుతున్నాను అని నోట్ పెట్టాను.
      ((ఈ కథకు చారిత్రక ఆధారాలు లేవు. రాణి రుద్రమను వీర వనితగానే చూడడానికి జనం ఇష్టపడతారు. కాపోతే కథకు బలం చేకూర్చడం కోసం చేసిన ప్రయోగం ఇది.ఇదంతా అవునని అనలేం. అలాగని కాదనీ చెప్పలేం!))
      బాటమ్‌ లైన్లో ఇది చదివినవారెవరూ మీలా దిక్కుమాలిన వితండవాదం చేయరు!
      అయినా అలాంటి ఇలాంటి పుచ్చు వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు.
      ఎందుకంటే మీ రాతలన్నీ పిచ్చిగీతలతో సమానం!
      ఒక్కటి గుర్తుంచుకోండి. చరిత్ర మీద మీద మీకొక్కరికే పేటెంట్ రైట్ అన్నట్టు మాట్లాడుతున్నారు.
      మేమూ చరిత్రను చదువుకున్నవాళ్లమే. మాకూ మీకంటే రెండాకులు ఎక్కువే తెలుసు!
      చరిత్రను నేను చింపేస్తే చిరిగి పోవడానికి.. మీరు అతికిస్తే అతకడానికి
      అదేం పేపర్‌ ముక్క కాదు..అరటి తొక్కా కాదు!



      Delete
  5. నేను చరిత్ర గురించి ఎక్కడ మాట్లాడాను బాబూ, నాకసలు దేని పైనా కాపీ రైట్ లేదు. నాకు తెలిసినవి మాత్రమే నేను మాట్లాడుతా. ఎక్కడో విన్నది నిజమని నేను గుడ్డిగా నమ్మి ప్రచారం చేయను. నా వ్యాఖ్యల్లో రాగ ద్వేషాలు లేవు. ఉట్టి తెలుగు వాక్యాలు గా మాత్రమే చూడు. అవి విమర్శలే కానీ తిట్లు కావు. విమర్శ దిశ సరి వైపే ఉంది.

    ReplyDelete
    Replies
    1. నేను కూడా నాకు తెలిసింది మాత్రమే రాశాను. అదే నిజమని ప్రచారం చేయాలని కంకణమేదీ కట్టుకోలేదు. బలవంతంగా నమ్మించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఫిక్షన్‌ని ఫిక్షన్‌లాగే చూడాలి. దానిమీద ఫ్యాక్షనిజం చేయడం సరికాదు. విమర్శిండచమే పనిగా పెట్టుకునే మీలాంటివాళ్లకు ఇంతకు మించి ఎక్కువగా స్పందిచాల్సిన పనిలేదు!! ఆల్ ద బెస్ట్!!

      Delete