Monday, 14 January 2013

సీతమ్మ వాకిట్లో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే..



సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు...
సినిమా బాగానే ఉందనుకోండి !
వాటిలో పాత్రలు, వాటి ఔచిత్యాల జోలికి వెళ్లడం లేదు.
కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని అంతకన్నా లేదు
కాకపోతే సినిమాలో లైన్‌ గురించి కొంత మాట్లాడాలనిపించింది
పద్ధతీ.. విధానమూ.. విజనూ
రావు రమేశ్‌ ఒక సందర్భంలో చెప్తాడు
కానీ ప్రకాశ్‌ రాజ్ పాలసీ అది కాదు
డబ్బు సంపాద కంటే ముఖ్యం.. మాట- చిన్న చిరునవ్వు
ఈ రెండు ఉంటే చాలు సమాజం బాగుపడుతుంది
దేశం అభివృద్ధి చెందుతుంది (ఇది ఇన్నర్‌ మీనింగ్ అనుకోండి)
కరెక్టే.. ఎదుటి వాడిని నవ్వుతూ పలకరించాలి
మంచివాడని నలుగురూ చెప్పుకోవాలి
కీర్తిని శేషంగా మిగిల్చుకుని వెళ్లాలి
చనిపోయన తర్వాత మనం కూడబెట్టింది మనతో రాదు
కట్టెలతో కాకుండా నోట్ల కట్టలతో కాలేయరు
కానీ, అయితే,
అసలు సినిమాలో మూల సిద్ధాంతం ప్రకారం
డబ్బెవడిక్కావాలి.. నలుగురిలో మంచివాడనిపించుకోవాలి
కరెక్టే!
కానీ, చాలా విషయాల్లో అది శుద్ధ దండుగ
సపోజ్.. పర్ సపోజ్‌..
కొంచెం ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం.....
నేను మంచివాణ్ని కదాని నా బండి 
పెట్రోల్ లేకుండా నడుస్తుందా?
నేను నవ్వుతూ మాట్లాడతానిని
 ఇంటి ఓనర్‌ ఒక నెల అద్దె వద్దులే అంటాడా?
నేను నైస్‌ పర్సన్ అని కిరాణాషాపు వాడు
నెల సరుకుల్ని ఫ్రీగా ఇస్తాడా?
నేను డిసిప్లెయిన్‌ అని ఆఫీస్‌కి 15 రోజులు రాకున్నా
లాస్ ఆఫ్‌ పే లేకుండా జీతం లెక్కబెట్టి ఇస్తారా?
లేదు. అస్సలు ఛాన్స్ లేదు.
రాత్రీ పగలూ షిఫ్టుల్లో నలిగిపోయి
ఎండనకా వాననకా గొడ్డు చాకిరీ చేస్తే
నెలజీతం వారం రోజుల్లో మటాష్‌
మళ్లీ 20 రోజుల పాటు ఒకటో తారీఖు కోసం ఎదురుచూపులు
పులిహోర పొట్లాలు విసిరేసి పోయే హెలికాప్టర్‌ కోసం 
ఎదురుచూసే తుఫాను బాధితుడిలా!!!!
గొప్పగొప్పోళ్ల జీవితాలన్నీ 
ఒక సూట్‌కేసు రెండు జతల బట్టలతో మొదలవుతాయి
నా జీవితమూ అలాగే మొదలైంది!
కానీ ఏం లాభం..
గొర్రె తోకా నేనూ అదే పొజిషన్‌లో ఉన్నాం
గుండె మీద చేయేసుకుకి చెప్పండి
మీలో ఎంతంమంది నాలా ఫీల్ అవట్లేదు?
ఎందుకింకా గొప్పవాణ్ని కాలేకపోయాను?
ఎందుకు దాచలేకపోతున్నాను?
అంటే బోలెడు కారణాలు
ఇంటద్దె.. స్కూల్ ఫీజులు...
ఇన్షూరెన్సులు.. ఇన్‌కమ్‌ టాక్స్
నెలలో నాలుగు సార్లు పెట్రోల్ (పెరిగిన ధరల ప్రకారం)
పాలవాడు పేపర్‌ వాడు..
గ్యాస్ మొద్దు..
ఇంటావిడ ముచ్చట పడితే సినిమాలూ
కడుపున పుట్టినోళ్లు మారాం చేస్తే షికార్లు
పండుగలూ పబ్బాలూ పెళ్లిళ్లూ
వాళ్ల తోటికోడలు శ్రీమంతం
అమ్మమ్మగారి షష్టిపూర్తి
చివరాఖరిగా
అట్లీస్ట్ బోడుప్పల్‌లో ఒక డబుల్ బెడ్‌ రూం ఫ్లాట్
నౌకరీ ఊడినా ఆ వచ్చే అద్దెలతో బతికేయొచ్చట!
(అప్పుడు నీ బోడి ఉద్యోగం ఎవడిక్కావాలి? ఛీ..నీ.. మగాడి బతుకు !)
వీటన్నిటికీ డబ్బు అవసరం లేదా?
పుట్టిన అమ్మాయి రేపటి రోజున ఏం సంపాదించావు తండ్రీ అని ప్రశ్నిస్తే
ఏం ఊడబొడిచావురా అని కొడుకు కొడవలి సంధిస్తే..
మొహం ఎక్కడ పెట్టుకోవాలి?
వద్దు బాబోయ్ వద్దు..
ఆ బీభత్స భయానక సిచ్యువేషన్‌ ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు!
నేను నా తండ్రిని అడగకపోవచ్చు ఏం సంపాయించావు బాబూ అని?
అది నా మంచితనమో అమాయకత్వమో నాకే క్లారిటీ లేదు..
నేను మా నాన్నని ఆస్తి అడగలేదు కదాని 
రేపు నా పిల్లలు అడగరని గ్యారెంటీ ఏంటి?
అందుకే ముందు డబ్బు కావాలి?
దాంతోపాటు నవ్వు కూడా కావాలి
రెండూ కావాలని ఆలోచించే ప్రశాంత మనసు కావాలి !
ఇలా రాశానని నేనేదో డబ్బు పిచ్చోణ్నని స్టాంపేయకండి
ఐ హేట్ మనీ ! బట్‌ ఐ వాంట్ మనీ ! !అండ్ ఐ లవ్ మనీ!!!
బతకడానికి కావల్సినంత మాత్రమే కావాలి
మన నోటు మీద మన చెమట వాసనే రావాలి
పక్కోడి చెమట మనకొద్దు
ఏమంటారు.......

7 comments:

  1. I liked this post. But i would like ot tell you that, Money is one of the resources to lead a happy life.
    But Earning money is only not the life.

    ReplyDelete
  2. :-)
    u r practical thinking is gud.

    ReplyDelete
  3. డబ్బు సంపాదించవద్దని ఎవరూ చెప్పరు.
    కేవలం డబ్బే సంపాదించవద్దని చెప్తారు.
    డబ్బుతో పాటు మంచితనం కూడ సంపాదించాలి.
    సరైన పద్ధతిలో డబ్బు సంపాదించాలి.

    ReplyDelete
  4. చాలామంది బయటకి చెప్పుకోడానికి నామోషీ అనుకున్నా, ఉన్నదున్నట్టుగా వ్రాశారు. కానీ డబ్బులు లేవుకదా అని, మీరనుకున్నవన్నీ జరగాలని లేదు.Reverse is also true..
    కానీ సినిమా మీద మీఅభిప్రాయం మాత్రం బావుంది...

    ReplyDelete
  5. Replies
    1. స్పందించిన బ్లాగర్లందరికీ ధన్యవాదాలు.
      ప్రాక్టికాలిటీ చెప్పినందుకు అంతే ప్రాక్టికల్‌గా స్పందించారు.
      మీరంతా చెప్పినట్టు బతకడానికి మాత్రమే డబ్బు కావాలి
      ప్రతీ నోటు వాసన మన చెమటదే అయ్యుండాలి!
      అంతకు మించి మంచితనాన్ని సంపాదించాలి!!

      Delete