శాన్వీ హత్య జరిగిన రోజు ఏం జరిగింది. రఘు ఎందుకు హత్య చేశాడు. అమెరికా పోలీసుల విచారణలో రఘు ఏంచెప్పాడో అతని మాటల్లోనే..
నాపేరు రఘునందన్ యండమూరి. నన్నందరూ రఘు అని పిలుస్తారు. నేనుండేది మార్కీస్ అపార్ట్మెంట్, మా పక్క ఫ్లాట్లోనే శాన్వీ వాళ్లుంటారు. ఫైనాన్షియల్ క్రైసిస్‌లో కొట్టుమిట్టాడుతున్నాను. అప్పులు ఎక్కువయ్యాయి. డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. చిన్నారి శాన్వీని కిడ్నాప్ ప్లాన్ వేశాను. శాన్వీ, సత్యవతిని చంపాలన్నది నా ఉద్దేశం కాదు. స్మూత్గా డీల్ చేద్దామనుకున్నా. కానీ ఇలా జరగుతుందని అనుకోలేదు. ఆ రోజు అక్టోబర్ 22. శాన్వీని కిడ్నాప్ చేసేందుకు వాళ్ల ఫ్లాట్ దగ్గరకు వెళ్లాను. డోర్ లాక్ చేసి ఉంది. బెల్ కొట్టాను. శాన్వీ నాయనమ్మ సత్యవతి డోర్ తెరిచింది. తెలిసిన వ్యక్తిని కావడంతో రా రఘు అంటూ లోపలికి పిలిచి మంచినీళ్లు తెచ్చేందుకు కిచెన్లోకి వెళ్లింది. ఆమెతో పాటే నేను వంటింట్లోకి వెళ్లాను. కత్తి తీశాను. ఆమె ఉలిక్కిపడింది. శాన్వీని కిడ్నాప్ చేస్తున్నానని… అరిచి గోల చేయొద్దని చెప్పాను. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. కానీ శాన్వీని ఏదో చేయబోతున్నానని భయపడింది. నా మీదకొచ్చింది. ఆమె మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ శాన్వీని ఎత్తుకున్నాను. కంగారులో పాప కిందపడిపోయింది. నేనూ తూలిపడ్డాను. బేబీని అందుకోబోయిన సత్యవతి గొంతులో పొడిచాను. ఆమె కిందపడిపోయింది. మైండ్ బ్లాంకైంది. నేనేం చేశానో అర్థంకాలేదు. శాన్వీ ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చాను. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి నోట్లో కర్చీఫ్ కుక్కాను. కౌట్లో పడుకోబెట్టి రక్తపు మడుగులో ఉన్న సత్యవతి దగ్గరకెళ్లాను ఆమె చనిపోయింది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కిచెన్‌లోంటి
బయటకొచ్చాను. బెడ్‌రూంలోకెళ్లి నగలన్నీ సూట్‌కేసులో సర్థాను. శాన్వీని కూడా
అందులోనే పడుకోబెట్టాను. పాప ఏడుపు ఆపలేదు. పక్క ఫ్లాట్ వాళ్లు వస్తే ఏం చేయాలి
అన్న భయం. చమటతో తడిసి ముద్దయ్యాను. పక్కనే ఉన్న టవల్ తీసి పాప ముఖం మీద కప్పాను.
ఏడుపు వినిపించకుండా టైట్‌గా ముడేసి సూట్‌కేస్‌లో పెట్టి లాక్ చేశారు. ఫైర్
ఎగ్జిట్ నుంచి గ్రౌడ్ ఫ్లోర్‌కు వచ్చి బిల్డింగ్ డౌన్ స్టేర్స్ లో ఉన్న జిమ్
విండోలోంచి సూట్‌కేసును లోపల పెట్టి నేనూ ఎంటరయ్యాను. లోపల ఎవరూ లేరని కన్ఫర్మ్
చేసుకున్నాక సూట్‌కేసులోంచి శాన్వీని బయటకు తీశాను. కానీ అప్పటికే చెమటతో
తడిసిపోయిన పాప సృహకోల్పోయింది. మొహం మీద నీళ్లు చల్లాను. ఉలుకు పలుకూలేదు.
నిద్రపోయిందనుకున్నాను. శాన్వీతో పాటు సూట్‌కేసును స్టీమ్ రూంలో పెట్టాను. నా
ఫ్లాట్‌కెళ్లి స్నానం చేసి కాసేపు రిలాక్సయ్యాను. తరువాత సూట్ కేసులో ఉన్న కొన్ని
నగలు, టవల్, కత్తి, ఇతర ఆధారాలు నదిలో పడేశాను. ఇంకొన్ని నగలు కోక్ వెండింగ్
మెషీన్ వెనక దాచాను. తెల్లారింది. శాన్వి నిద్ర లేచి ఉంటుందని మిల్క్ బాటిల్
తీసుకొని స్టీమ్ రూంకు వెళ్లాను. కానీ
అప్పటికే పాప చనిపోయింది. అప్పుడర్థమైంది డబ్బు కోసం క్షణికావేశంలో ఎంత పెద్ద
తప్పుచేశానో. నా కెరీర్‌ను చేజేతులా నాశనం
చేసుకున్నాను. నావాళ్లందరూ దూరమయ్యారు. నేనెవరినీ చంపాలనుకోలేదు. ఆవేశంలో అలా జరిగిపోయింది.
నేను చేసిన తప్పు దిద్దుకోలేనిది. అందుకు పశ్చాత్తాప పడుతున్నాను. శాన్వీ తల్లిదండ్రుల ఎంత బాధపడుతున్నారో తెలుసు. నేను చేసింది చిన్న
తప్పుకాదు. నన్నెవరూ క్షమించరు.
No comments:
Post a Comment