Wednesday, 21 November 2012

కసబ్‌ని ఎవరు ఉరి తీశారు..?



ఇంతకూ ఉగ్రవాది కసబ్‌ని ఉరి తీసిందెవరు? దేశంలో తలారులెవరూ బతికిలేరు. మరి  శిక్ష అమలు ఎలా సాధ్యమైంది! ప్రస్తుతం కేంద్ర కారాగారాల్లో ఎన్ని తలారి పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కసబ్‌కి ఉరేసే బాధ్యత ఎవరు తీసుకున్నారు?  

చాలా రోజుల తర్వాత ఉరికంబానికి పనిపడింది. మొహాన కప్పే నల్లబట్ట దుమ్మ దులపాల్సి వచ్చింది. ఇంతకూ కసబ్‌ని ఎవరు ఉరి తీశారు? దేశంలో ఇంకా తలారీ పోస్టులున్నాయా? ఆఖరిసారిగా 2004లో కోల్‌కతాలో ధనుంజయ్ చటర్జీని తలారి నాటా ముల్లిక్‌ ఉరితీశాడు. 2009లో ముల్లిక్‌ చనిపోయాడు. మహారాష్ట్రలో చిట్టచివరి తలారీ 1996లో రిటైర్‌ అయ్యాడు. ప్రస్తుతం ఎరువాడ, నాగ్‌పూర్‌  సెంట్రల్ జైళ్లలో మాత్రమే ఉరిశిక్షఅమలు చేస్తున్నారు. ఉరితాడును బీహార్‌లోని బక్సర్ జైలులో తయారుచేస్తారు.  సో.. ప్రస్తుతం ఉరి తీసేందుకు మనుషుల్లేరు. ఇలాంటి పరిస్థితుల్లో కసబ్‌ మెడకు తాడేసి లాగింది ఎవరు? దీనికి సంబంధించి వివరాలు తెలియకపోయినా, ఉరిశిక్ష అమలు చేయాలంటే తలారీయే అవసరమా? చట్టాలేమంటున్నాయి? అసలు ఉరి తీయాలంటే తలారే ఎందుకు? ఓ సాధారణ కానిస్టేబుల్ సరిపోడా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎవరూ ముందుకు రాకపోతే సూపరింటిండెంట్ కూడా ఆ పని చేయొచ్చని ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ స్వాతిసాథే అన్నారు. ఉరితీయడానికి తలారి అవసరమన్నది అపోహ మాత్రమేననేది ఆమె వాదన. జైలు మాన్యువల్ ప్రకారం చివరి అంకం సూపరింటెండెంట్ చేతుల మీదుగానే పూర్తవుతుంది. ఉరి తీసే ముందు అధికారులు జైలు మాన్యువల్ పక్కాగా అనుసరించారు. కసబ్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాతే ఉరికి సిద్ధం చేశారు. ఉదయం నాలుగింటి ప్రాంతంలో కసబ్‌ని నిద్రలేపారు. ఉరి తీస్తున్నామని ముందే సమాచారమివ్వడంతో కసబ్‌ ఆ రాత్రి నిద్రపోలేదట. బాడీ లాంగ్వేజీని బట్టి చూస్తే చాలా నర్వెస్‌గా కనిపించాడని జైలు అధికారులు తెలిపారు. చలాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత ప్రేయర్ చేసుకోడానికి అనుమతి కావాలని అడిగాడు. వెంటనే కసబ్‌ని జైలు గదింనుంచి బయటకు తీసుకెళ్లారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసేసరికి ఉదయం ఏడుంపావు అయింది. చివరి కోరికేంటని అడిగితే సమాధానం లేదు. మౌనంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఉరితీసిన సంగతి మా అమ్మకు చెప్పండని కోరాడు. సంతకాలు పూర్తయిన తర్వాత, సరిగ్గా ఉదయం ఏడున్నరకు మొహాన నల్లబట్ట కప్పారు. చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. కాళ్లకు తాడు బిగించారు. ఉరితాడు మెడకు తగిలించి కట్క లాగారు. అరగంటపాటు కసబ్‌ని ఉరికంబానికే వేలాడదీశారు. తర్వాత డాక్టర్లొచ్చి చనిపోయాడాని నిర్ధారించారు. 14 ఏళ్ల తర్వాత  ఎరువాడ జైల్లో ఓ దోషిని ఉరి తీయడం ఇదే మొదటి సారి.


6 comments:

  1. రొటీన్ కి భిన్నమైన సమాచారాన్నిచ్చారు.

    ReplyDelete
  2. మరీ ఏడున్నరకు వురి తీయడం, సూర్యోదయానికి ముందు వురి తీస్తారనేసినిమా చట్టాలకు విరుద్ధం. :) 100రూలకు, బీడీ కట్టకు, సారాపాకెట్‌కు ప్రాణాలు తీసేవాళ్ళున్న ఈరోజుల్లో తలారీలే కావాలా! :))

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు.. వాస్తవానికి కసబ్‌ని ఉరితీయడానికి చాలా మందే స్వచ్ఛందంగా ముందుకొచ్చారట..! అయినా జాతి గర్వించే కార్యాన్ని ఎవరు కాదంటారు చెప్పండి. కాకపోతే చిన్న అసంతృప్తి. ఎలాంటి ఆయుధమూ లేకుండా కసబ్‌ని ప్రాణాలకు తెగించి పట్టుకున్న కానిస్టేబుల్ తుకారం కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి చేత ఉరి తీయిస్తే ఇంకా గుండె మంట చల్లారేది కాబోలు.

      Delete