Friday, 30 November 2012

ఈ డిసెంబర్‌ చాలా అరుదైన నెల! ఎందుకంటే...



క్యాలెండర్లో డిసెంబర్  నెల చూశారా? చూశాం అందులో స్పెషాలిటీ ఏముంది? అనుకుంటున్నారా? అయితే ఓసారి మళ్లీ లుక్కేయండి. శని, ఆది, సోమవారాలు ఐదు రోజుల పాటు వస్తున్నాయి. ఇలాంటి అద్భుతం రావడం చాలా రేర్‌. 1, 8,15, 22, 29 తారీఖులు శనివారం వస్తుండగా.. 2, 9, 16, 23, 30 ఆదివారం వస్తోంది. 3, 10, 17, 24, 31 తేదీలు సోమవారం వస్తున్నాయి. ఈ అద్భుతం 824 సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే జరుగుతుందట...
 గతంలో 1188వ సంవత్సరం అక్టోబర్‌లో ఐదు శని, ఆది, సోమవారాలు వచ్చాయి. దాని తర్వాత ఈ ఏడాదే ఇలాంటి అద్భుతం జరుగుతోంది. ఫ్యూచర్‌లో ఇలాంటి అద్బుతం మళ్లీ 2వేల 836లోనే జరుగుతుంది. శని, ఆది, సోమవారాలు ఐదు రోజుల పాటు వస్తున్నందున డిసెంబర్‌  నెల చాలా ప్రత్యేకమైందని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉందట. శనివారం శని భగవానునికి, ఆదివారం సూర్యునికి, సోమవారం చంద్రునికి పూజలు చేయడం పరిపాటి. అలాగే నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో రంగు ఉంటుంది. శనికి నలుపు, సూర్యునికి ఎరుపు, చంద్రునికి తెలుపు రంగు వర్తిస్తుంది. డిసెంబర్‌ ఒకటో తేదీ శనివారం ప్రారంభమై, సోమవారంతో మాసాంతం అవుతుంది. దీనిని నవగ్రహాల గణాంకాల ప్రకారం చూస్తే నలుపుతో ప్రారంభమై తెలుపుతో ముగుస్తుంది. అందువల్ల ఈ నెల వివాహాలు, గృహ ప్రవేశంతో పాటు ఎలాంటి శుభకార్యాలైనా చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు డిసెంబర్‌  నెల నలుపుతో ప్రారంభమై తెలుపుతో ముగుస్తున్నందున కొత్త ఏడాదిలో అంతా శుభమే జరుగుతుందని అంటున్నారు. డిసెంబర్‌లో శని, సూర్య, చంద్ర గ్రహ దోషాలున్న వారు ఆయా గ్రహాలకు పూజలు చేస్తే మంచి ఫలితాలుంటాయట.
అన్నట్టు ఈ ఏడాది డిసెంబర్‌కు మరో ప్రత్యేకత ఉంది. అది 12వ తేదీ 12 నెల 12వ సంవత్సరం. అంకెల్లో రాస్తే 12-12-12. మళ్లీ ఇలాంటి తేదీ రావాలంటే మరో వెయ్యేండ్లు ఎదురు చూడాల్సిందే. 3012 వ సంవత్సరంలోనే మళ్లీ ఇలాంటి డేట్‌ వస్తుంది. 

మరణ మగ్గం



బుటా తర్వాత ఇంకో జరీ బుటా!  సెల్ఫు తర్వాత ఇంకో పూల సెల్ఫు! పడుగు పైన పట్టు పాగళ్లు! పేకలు పేర్చిన బట్ట మీద రంగురంగుల సీతాకోకచిలకలు! సొగసైన వస్త్రం మీద జలతారు పోగులు!! లోకం మానాన్ని రక్షిస్తున్న నిరంతర శ్రామికుడు! కానీ ఏం లాభం?! బట్ట పోగు అతికింది.. కానీ అతని బతుకు పోగు అతకలేదు!! అగ్గిపెట్టెలో ఆరు గజాల చీర నేసినా ఘనకీర్తి గతంగానే మిగిలింది!! మగ్గం మీద మరణమృదంగం ధ్వనిస్తోంది! నరాల్ని దారాలుగా చేసి- రక్తాన్ని రంగుగా మార్చి బట్ట నేసినా -బతుకు మారలేదు!! పేరులో సిరి ఉన్నా బతుకలో సిరిలేదు! అర్ధాకలి! అప్పులు! ఆలుబిడ్డల్ని రోడ్డున పడేసి ఉరికంబాలకు వేలాడుతున్నారు! ఒక్కమాటలో చెప్పాలంటే సిరిసిల్ల ఇప్పుడు అంపశయ్య మీదుంది!! పడుగు పోగుల ఉరితాళ్ల మధ్య వేలాడుతూ మగ్గం గుంతలోనే నేతన్న బతికున్న శవంలా మారిపోతున్నాడు! 



అక్కడ ఒక పావుగంట నిలబడితే తెలుస్తుంది !!



భర్త శవం దుబాయిలో ఉంది. పీనుగు వచ్చే అవకాశం లేదు. ఏడ్చీ ఏడ్చీ భార్య కన్నీళ్లు ఇంకిపోయాయి. చేయని నేరానికి పెనిమిటిని నిష్కారణంగా జైల్లో పెట్టారు. విడిపించే దిక్కు లేదు. అమ్మ గుండె పగిలిపోయింది. అక్కడ ఎవరిని కదిలించినా తీరని వేదనలే. అందరి బతుకులూ ఎండమావులే.  
కరువు కాటేసింది. ఉన్న ఊరు తరిమి కొట్టింది. ఆకలి డొక్కలు చేతపట్టుకుని కాని దేశం వలసపోతే విధి దారుణంగా వంచించింది. కొందరు జైళ్లలో ఉంటే.. ఇంకొందరు ఫుట్‌పాత్‌ మీద శవాలై తేలారు. పొట్ట చేతపట్టుకుని కాని దేశం పోతే బతుకులు చితికిపోయాయి. ఎడారి ఇసుకలో మెతుకులు ఏరుకోలేక నిర్దాక్షిణ్యంగా తనువు చాలించిన వారు కొందరైతే.. చేయని తప్పుకు కటకటాల పాలై విడిపించే దిక్కు లేక దీనంగా బతుకుతున్న వాళ్లు మరికొందరు.
కరీంనగర్ బస్టాండు. ఫ్లాట్ ఫాం నెంబర్‌ త్రీ. శంషాబాద్ ఎయిర్ పోర్టు లగ్జరీ బస్సు. ఇక్కడ ఓ పావుగంట నిలబడితే తెలుస్తుంది. ఆకలి పేగులు కన్నీళ్లుగా మారి ఎలా బయటకొస్తాయో! అమ్మ కొంగునిండా కన్నీటి మూటలు బరువెక్కుతాయి. కొడుకు భుజం మీద చిరుగుల కండువా తడచి ముద్దవుతుంది. తమ్మీ అవ్వ పైలం! బిడ్డా.. పొయినకాడ జాగర్త! శీనయ్యా అమ్మను ఏడిపియ్యకు! నాయనా.. పొయినంక టిలిఫోన్‌ చేయి!! కొన్ని సముదాయింపులు. ఇంకొన్ని జాగర్తలు. కొంత ఓదార్పు. కొద్దిగా ధైర్యం. బాధ.. కష్టం.. దిగులు.. ఏడుపు.. ఆశ.. నిరాశ.. ఏకకాలంలో గుండెను తూట్లు తూట్లుగా పొడుస్తుంటే మనసంతా కలికలి అవుతంది. కళ్లలో వేడి చెమ్మ చిప్పిల్లుతుంది. జానెడు పొట్ట కోసం ఎన్ని పడరాని పాట్లు. కాలే కడుపుల్ని చల్లార్చడానికి ఎన్ని మైళ్ల దూర ప్రయాణం.
తీరా అక్కడికి పోయిన తర్వాత పని దొరకదు. ఏజెంట్ మోసం బయటపడుతుంది. ఉండటానికి నీడ ఉండదు. తినడానికి తిండి దొరకదు. పార్కుల్లో ఫుట్ పాత్‌లపైనా.. రోడ్డు పక్కన తలదాచుకోవాలి. రోగమొచ్చి నిలువునా కుప్పకూలినా పట్టించుకునే వాళ్లుండరు. ఇక్కడ ఎవడి గుండె బరువు వాడే దించుకోవాలి. దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగానే కనిపిస్తాయి. దేశం కాని దేశంలో అడుగు పెట్టడం వరకే వీళ్ల చేతుల్లో. రావడం రాకపోవడమంతా విధి చేతుల్లో! బతికుండే వస్తారో.. శవమై తిరిగొస్తారో అంతా దేవుడికెరుక.  మెతుకుల వేటలో ఎడారి దేశాలకు వెళ్ళిన కరీంనగర్ జిల్లా వాసుల కష్టాలు వర్ణనాతీతం. కొందరు మృత్యువాత పడితే ఇంకొందరు చేయని నేరానికి జైళ్లలో మగ్గుతున్నారు. సరైన సమాచారం ఉండదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. గోడు వినే నాధుడుండడు. ఇలాంటి సమయంలో బాధితులకు బాసటగా నిలువాల్సిన ఎన్నారై సెల్ ఉలుకూ పలుకూ లేకుండా పడివుంది. సమాచారమిచ్చేందుకు ఒక మహిళా కానిస్టేబుల్ తప్ప అధికారులెవరూ అందుబాటులో ఉండటం లేదు.

Thursday, 29 November 2012

శాన్విని రఘు ఎలా చంపాడంటే..



శాన్వీ హత్య జరిగిన రోజు ఏం జరిగింది. రఘు ఎందుకు హత్య   చేశాడు. అమెరికా పోలీసుల విచారణలో రఘు ఏంచెప్పాడో అతని మాటల్లోనే..
నాపేరు రఘునందన్యండమూరి. నన్నందరూ రఘు అని పిలుస్తారు. నేనుండేది మార్కీస్  అపార్ట్మెంట్‌, మా పక్క ఫ్లాట్లోనే శాన్వీ వాళ్లుంటారు. ఫైనాన్షియల్క్రైసిస్లో కొట్టుమిట్టాడుతున్నాను. అప్పులు ఎక్కువయ్యాయి. డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. చిన్నారి శాన్వీని కిడ్నాప్ప్లాన్వేశాను. శాన్వీ, సత్యవతిని చంపాలన్నది నా ఉద్దేశం కాదు.  స్మూత్గా డీల్చేద్దామనుకున్నా. కానీ ఇలా జరగుతుందని అనుకోలేదు. రోజు అక్టోబర్‌ 22. శాన్వీని కిడ్నాప్చేసేందుకు వాళ్ల ఫ్లాట్దగ్గరకు వెళ్లాను. డోర్  లాక్చేసి ఉంది. బెల్కొట్టాను. శాన్వీ నాయనమ్మ సత్యవతి డోర్  తెరిచింది. తెలిసిన వ్యక్తిని కావడంతో రా రఘు అంటూ లోపలికి పిలిచి మంచినీళ్లు తెచ్చేందుకు కిచెన్లోకి వెళ్లింది. ఆమెతో పాటే నేను వంటింట్లోకి వెళ్లాను. కత్తి తీశాను. ఆమె ఉలిక్కిపడింది. శాన్వీని కిడ్నాప్చేస్తున్నానని అరిచి గోల చేయొద్దని చెప్పాను. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. కానీ శాన్వీని ఏదో చేయబోతున్నానని భయపడింది. నా మీదకొచ్చింది. ఆమె మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ శాన్వీని ఎత్తుకున్నాను. కంగారులో పాప కిందపడిపోయింది. నేనూ తూలిపడ్డాను. బేబీని అందుకోబోయిన సత్యవతి గొంతులో పొడిచాను. ఆమె కిందపడిపోయింది. మైండ్బ్లాంకైంది. నేనేం చేశానో అర్థంకాలేదు. శాన్వీ ఏడుపుతో లోకంలోకి వచ్చాను. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి నోట్లో కర్చీఫ్కుక్కాను. కౌట్లో పడుకోబెట్టి రక్తపు మడుగులో ఉన్న సత్యవతి దగ్గరకెళ్లాను ఆమె చనిపోయింది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కిచెన్‌లోంటి బయటకొచ్చాను. బెడ్‌రూంలోకెళ్లి నగలన్నీ సూట్‌కేసులో సర్థాను. శాన్వీని కూడా అందులోనే పడుకోబెట్టాను. పాప ఏడుపు ఆపలేదు. పక్క ఫ్లాట్‌ వాళ్లు వస్తే ఏం చేయాలి అన్న భయం. చమటతో తడిసి ముద్దయ్యాను. పక్కనే ఉన్న టవల్‌ తీసి పాప ముఖం మీద కప్పాను. ఏడుపు వినిపించకుండా టైట్‌గా ముడేసి సూట్‌కేస్‌లో పెట్టి లాక్‌ చేశారు. ఫైర్‌ ఎగ్జిట్‌ నుంచి గ్రౌడ్‌ ఫ్లోర్‌కు వచ్చి బిల్డింగ్‌ డౌన్‌ స్టేర్స్‌ లో ఉన్న జిమ్‌ విండోలోంచి సూట్‌కేసును లోపల పెట్టి నేనూ ఎంటరయ్యాను. లోపల ఎవరూ లేరని కన్ఫర్మ్‌ చేసుకున్నాక సూట్‌కేసులోంచి శాన్వీని బయటకు తీశాను. కానీ అప్పటికే చెమటతో తడిసిపోయిన పాప సృహకోల్పోయింది. మొహం మీద నీళ్లు చల్లాను. ఉలుకు పలుకూలేదు. నిద్రపోయిందనుకున్నాను. శాన్వీతో పాటు సూట్‌కేసును స్టీమ్‌ రూంలో పెట్టాను. నా ఫ్లాట్‌కెళ్లి స్నానం చేసి కాసేపు రిలాక్సయ్యాను. తరువాత సూట్‌ కేసులో ఉన్న కొన్ని నగలు, టవల్‌, కత్తి, ఇతర ఆధారాలు నదిలో పడేశాను. ఇంకొన్ని నగలు కోక్‌ వెండింగ్‌ మెషీన్‌ వెనక దాచాను. తెల్లారింది. శాన్వి నిద్ర లేచి ఉంటుందని మిల్క్‌ బాటిల్‌ తీసుకొని స్టీమ్‌  రూంకు వెళ్లాను. కానీ అప్పటికే పాప చనిపోయింది. అప్పుడర్థమైంది డబ్బు కోసం క్షణికావేశంలో ఎంత పెద్ద తప్పుచేశానో. నా  కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాను. నావాళ్లందరూ దూరమయ్యారు. నేనెవరినీ చంపాలనుకోలేదు. ఆవేశంలో అలా జరిగిపోయింది. నేను చేసిన తప్పు దిద్దుకోలేనిది. అందుకు పశ్చాత్తాప పడుతున్నాను. శాన్వీ తల్లిదండ్రుల ఎంత  బాధపడుతున్నారో తెలుసు. నేను చేసింది చిన్న తప్పుకాదు. నన్నెవరూ క్షమించరు.