Saturday 14 July 2012

వాడెబ్బ జీవితం

బతుకే విధ్వంసమైతే
జీవించడం ఎంత పానిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌
భరించేవాడు భర్తని ఎవడన్నాడోగానీ:
వాడెబ్బ జీవితం.. ఎంత కంపల్షన్‌!
భరిస్తూ మళ్ళీ అందులోకే ప్రయాణం
కొన్ని కన్నీటి నిల్వలు పోగుచేసుకోరా కుటుంబరావు
ఎవరైనా వచ్చి ఆపమనేదాకా ఏడ్చేయ్‌
చిక్కటి బాధనంతా తెమడలు తెమడలుగా కక్కు
వీలైతే దర్జాగా బతికిన క్షణాల్ని దోసిళ్లలోకి తీసుకో
టైం దొరికితే ఒంటరి ప్రపంచంలోకి రివ్వున ఎగిరిపో
ఇంకా బోర్‌ కొడితే క్యాంపస్‌ హాస్టల్ టెర్రస్‌ మీద
టవల్ కట్టుకుని తిరుగు 
ఇన్నాళ్లూ పరుగులు పెట్టిన జీవితంలోంచి
ఏం రాలిపడ్డాయో ఏరుకో  
నీ కలల్ని ఎవరు పొడుచుకుతిన్నారో గుర్తు చేసుకో
నిరక్షరమై పడివున్న హృదయంలోంచి
వ్యక్తానువ్యక్తభావాల్ని గాలమేసి లాగు
నెత్తరు కారితే కారింది..
తొక్కలోది మనకు భావప్రాప్తి ఇంపార్టెంట్ !!              

5 comments:

  1. ఇంతకాలం మీ బ్లాగును ఎలా మిస్ అయినానా అనిపిస్తుంది మీ అన్ని పొస్టులూ భగున్నాయి. ముఖ్యంగా మీ పల్లె అనుభవాలు భాగున్నాయి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రామమోహన్‌ గారూ.........

      Delete
  2. థాంక్యూ బాస్‌

    ReplyDelete
  3. A good one. Does campus terrace suits the flow? However interesting.

    ReplyDelete