Wednesday 30 January 2013

కర్నూలు రాజధానిగా అప్పటి ఆంధ్ర రాష్ట్ర వైభవం....!!







గుడారాలు! షామియానాలు! టెంట్ల కింద జీవితాలు! నీళ్లు లేవు! నిప్పుల్లేవు! కనీసం ఫైళ్లు పెట్టుకోడానికి అల్మరాల్లేవు! ఎండొస్తే గలగల! వానొస్తే జలజల! ఇదీ కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర వైభవం! మూడేళ్లపాటు నరకయాతన! అది భరించలేకే హైదరాబాద్ మీద కన్నేశారు! ఉడుముల్లా చొరబడి తీరా ఇప్పుడు రాజధాని మాది అంటూ పుండాకోర్‌ మాట్లాడుతున్నారు

మద్రాసు నుంచి వేరుపడ్డ తర్వాత ఆంధ్రోళ్లకు రాజధాని నగరమే లేదు! అప్పటికే ఆంధ్ర వారితో కలవడానికి రాయలసీమ వారు ఇష్టపడలేదు. దానికన్నా తమిళులతో కలిసి ఉండటమే మేలని సీమ నాయకులు అభిప్రాయపడ్డారు. చివరికి కర్నూలుని రాజధానిగా చేస్తామని ప్రామిస్ చేస్తే సీమవాళ్లు ఒప్పుకున్నారు.  

అప్పటికి కర్నూల్ ఒక చిన్న టౌన్‌ మాత్రమే. ఎలాంటి మౌలిక వసతులు లేవు. అన్ని ముఖ్య ఆఫీసులు, ఉద్యోగులు గుడారాలలోనే ఉండేవారు. ఆ ప్రాంతాన్ని డేరా నగర్అని పిలిచేవారు. అప్పటి దినపత్రికల్లో ఈ డేరానగర్ దుస్థితి గురించి కార్టూన్లు కూడా వేసేవారు!

ఫైళ్లు పెట్టుకోడానికి అల్మరాలు లేవు. ఏ క్లాస్, బి క్లాస్ ఎంప్లాయీస్ కోసం 217 గుడారాలు వేశారు. అన్నీ 20X16, 16X14 టెంట్లు! పక్కనే మిలటరీ గుడారాలుక్యాంటీన్‌ సదుపాయం లేదుతిందామంటే తిండి లేదు. మరుగుదొడ్ల సదుపాయం లేదు. టాయిలెట్ వస్తే పక్కన పొలాల్లోకి వెళ్లేవారు. స్నానం చేయడానికి చాటు లేదు. మొత్తం నల్లరేగడి నేల. వానొస్తే బురద బురద. ఫ్లోరింగ్ లేదు. అప్పటికప్పుడు చప్దా తెచ్చి అమర్చారు.  

ఎండకాలం ఉక్కపోత! భరించలేక పోయేవారు. ఫ్యాన్లు పెట్టే అవకాశం లేదు. గంటకోసారి టెంటు మీద పైప్‌తో నీళ్లు చల్లేవారు! రాత్రయితే పాములు తేళ్ల బాధ! ఉద్యోగులు భార్యా పిల్లలతో వచ్చే పరిస్థితి లేదు! ఇద్దరు ముగ్గురు మాత్రమే ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యారు. అప్పటి ఆంధ్రా గవర్నర్‌ చందూలాల్ త్రివేది భార్యతో కలిసి రోజుకోసారి ఈ డేరానగర్‌ని సందర్శించేవారు. వసతుల మీద ఆరా తీసేవారు

అప్పటి కర్నూలు టౌన్లో పెద్దగా ఇళ్లు ఉండేవి కాదు. అద్దె కొంప దొరకాలంటే అదో ప్రహసనం. మహా అంటే ఓ 25మందికి రూంలు దొరికాయంతే. శిబిరాల నుంచి కార్యాలయాలకు వెళ్లాలంటే ట్రాన్స్ పోర్ట్‌ సిస్టం లేదు. మైళ్ల దూరం నడవాలి. గతిలేక బియ్యం బస్తాలు సప్లయ్ చేసే లారీల్లో ఉద్యోగుల్ని తోలుకుపోయేవారు!
అప్పటికే ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉంది! కర్నూల్ లో భవంతులు, వసతులు సమకూర్చుకునే పరిస్థితిలో లేదు!

ఆంధ్ర రాష్ట్ర ఆర్ధిక స్థితి ఏమాత్రం బాగాలేదు. మున్ముందు బాగుపడే పరిస్థితి కూడా లేదు! ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి! ఆంధ్ర రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై డిసెంబర్3 -1954న ఆంధ్ర పత్రిక సంపాదకీయం రాసింది!  
అప్పటికే ఆంధ్రావాళ్లు 18 కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్నారు. కేంద్రం ఆదుకుంటే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి. ఇదే విషయంపై 1953 నవంబర్ 5న నీలం సంజీవరెడ్డి ఆంధ్రా అసెంబ్లీలో నెత్తీనోరు మొత్తుకున్నాడు.

ఎక్కడికి వెళ్లినా ప్రజలు సాగునీరు, కరెంటు అడుగుతున్నారు.. ఎక్కడి నుంచి తేగలమని  నీలం సంజీవరెడ్డి 1954 ఫిబ్రవరి 25న అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

హైదరాబాద్ వస్తే మన బాధలన్నీ తీరుతాయి. అయితే అది ఎట్లా వస్తుందో ఎక్కడి నుంచి ప్రయత్నించాలో మనం ఆలోచించుకోవాలని 1953, జూన్2న టంగుటూరి ప్రకాశం అన్న మాటల్ని ఆంధ్ర పత్రిక ప్రచురించింది.  

కర్నూలు వాళ్లు ఎప్పుడు హైదరాబాద్ పోదామా అని ఉత్సాహం చూపుతున్నారు. ఫజల్ అలీ  సిఫారసుల ప్రకారం మరో ఐదేళ్లు ఆగితే ఆంధ్రాకు కష్టాలు తప్పవని 1954న ఆగస్ట్ 9న నీలం సంజీవరెడ్డి అన్నారుఅన్నట్టే చివరికి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారు. తెలంగాణను బలవంతంగా విలీనం చేసుకుని హైదరాబాదును చేజిక్కించుకున్నారు.

ఉడుముల్లా చొరబడి తీరా ఇప్పుడు హైదరాబాద్ మాది మేం డెవలప్ చేశామంటూ ఉండవల్లి లాంటి వాళ్లు పుండాకోర్‌ మాటలు మాట్లాడుతున్నారు. దిక్కుదివాణం లేకుండా హైదరాబాద్ వచ్చిన లగడపాటి లాంటి వాళ్లు ఇప్పుడు తెలంగాణ ప్రజల్నే దిక్కున్న చోటికి వెళ్లమంటున్నాడు...

తెలంగాణ ప్రజలారా ఒక్కసారి   ఆలోచించండి! రాజధాని ఎవరిది అనే విషయంలో చిన్న లాజిక్‌ అర్ధం చేసుకోండి!
ఆంధ్రా విలీనం అయినప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్! వచ్చేటప్పుడు వాళ్లేం హైదరాబాద్‌ని వెంటబెట్టుకుని రాలేదు. కాబట్టి భాగ్యనగరంతో ఆంధ్రోళ్లకు సంబంధం లేదు! దాని మీద ఇష్యూ చేసే హక్కు లేదు. కనీసం మాట్లాడే అర్హత కూడా లేదు! 56కు ముందు ఏదైతే తెలంగాణ ఉందో అదే తెలంగాణ అడుగుతున్నాం. అయినా అడుక్కోవాల్సిన ఖర్మేం పట్టలేదు. బాజాప్తా హైదరాబాద్‌ తెలంగాణది!

(ఇవన్నీ అబద్ధాలు అని చెప్పే దమ్ము ఒక్క ఆంధ్రోడికైనా ఉందా....??)


1 comment: