ఇక్కడ స్త్రీ ఆకాశంలో సగంకాదు! పురుషుడి కన్నా కొంచెం తక్కువ సమానమూ కాదు! జస్ట్.. ఫీమేల్ జెండర్! కాసుల ప్రేమిక! సౌందర్య నాయిక! అంతిమంగా ఒక సెక్స్ స్కాండల్! మాతృస్వామ్యం ఏనాడైతే కూలిపోయిందో.. బహుశా! ఇలాంటి సంఘనీతి అప్పుడే అవతరించి ఉంటుంది! పవిత్రతా స్వచ్ఛతా శీలమూ- ఈ మూడు ఎలిమెంట్స్ స్త్రీ మర్మాంగాల చుట్టూ ఇనుప కవచాలవలె ఆనాడే పురుడు పోసుకున్నాయి. మరి మహిళకు పుస్తె మెట్టెలు ఐదోతనంతో కలిపి ప్యాకేజీగా ప్రసాదించిన మగసమాజం- ఆమె శీలాన్ని మాత్రం ఎందుకు సార్వజనీనం చేసింది? దాన్నొక సామాజిక నీతిగా ఎందుకు చిత్రీకరించింది?
పతివ్రతలైన
మహిళలు నాలుగ్గోడల మధ్య ఉత్తమోత్తమ జీవితాన్ని అనుభవించారనీ- మనీ కోసం మర్మాంగాల్ని అంగట్లో పెట్టిన అభాగినులు కడుహీనజీవితం గడిపారనీ- ఎవరైనా క్లాసిఫికేషన్ చేయగలరా? ఈ ప్రశ్న అడిగితే- ఇనుపతెర చాటున ఎర్రబారిన కళ్లతో ఉన్న మధురవాణి
పగలబడి నవ్వుతుంది! ఏమగాడికైనా దమ్ముంటే ఆ నవ్వుకు అర్ధం చెప్పమను?!
అందానికో అమ్మతనానికో అగ్గిపెట్టెల్లాంటి ఇరుకు గదుల్లో ఒరుసుకుని పడుకోలేదు! ఒత్తుగా లిప్‌స్టిక్ పూసుకుని- లూజ్ నైటీ వేసుకుని -ఆరుమూరల మల్లెపూలు జడలో తురుముకుని -వయ్యారానికో విలాసానికో రెడ్ లైట్ ఏరియా వీధుల్లో మసకమసక చీకట్లో నిలబడలేదు! బంగారంలాగే, ఎకరం భూమిలాగే, ఇక్కడ స్త్రీ కూడా ఒక సంపద! ధ్వంసం చేయకుండా ఖజానాలో కలుపుకునే రాజనీతికి ఇక్కడ చోటులేదు. ఇక్కడి స్త్రీలు తమను తాము వెలిగించుకోలేరు. తమను తాము పలికించుకోలేరు. తమను తాము పెళ్లగించుకోనూ లేరు. గీసిన గిరుల మధ్యనే- ఇచ్చిన డ్రస్సుల మధ్యనే విటులను రంజించేయాలి. మగతనాన్ని ఆవాహనం చేసుకుని నిత్య సలపరాన్ని భరించాలి! ప్రజాస్వామిక పరిభాషలో చెప్పాలంటే ఇక్కడ ఆడది శృంగార కార్మికురాలు! వేశ్యావాటికలో రాత్రీపగలూ తేడా లేకుండా నలిగిపోయే బానిసరాలు. ఎంత అన్యాయం అంటే- రుతువు వెక్కిరించి కడుపొస్తే కనీసం ప్రసవానికి ఒకరోజు మెటర్నిటీ సెలవూ ఉండదు.

ఉంటారు!! ఆ
దయనీయస్థితిలో ఆడవాళ్లను బలవంతంగా కట్టేసి దోచుకునే దుర్మార్గులూ ఉంటారు. తోటిస్త్రీల
శరీరాలతో వ్యాపారం చేసేవాళ్లూ కామటిపురాలోనో సోనాగచ్చిలోనో ఖారాకిళ్లీ నములుతూ అజమాయిషీ
చేస్తూ సీరియళ్లలో కనిపించే ఆడవిలన్లలా కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు.
అవును! వ్యభిచారాలు చేసేవాళ్లను సమాజం పరిహసిస్తుంది. వారంతా బాధితులని తెలిసినా లోకం వారినే తప్పుపడుతుంది! మీడియా కూడా అంతే!! లేడీస్ ఎలిమెంట్ ఉందంటే చాలు ఎక్కడలేని ఆసక్తి. స్క్రీన్ మీద అదొక మానవీయ విషాద దృశ్యకావ్యం. ఇలాంటి వార్తలు వస్తున్నంత సేపు కొందరి కళ్లలో
ఆకలి కొట్టుకులాడుతుంది. ఇంకొందరి కళ్లలో కన్నీరు చిప్పిల్లుతుంది.
No comments:
Post a Comment