వినాయకచవితి
చిన్నతనంలోనే
నాయకత్వ లక్షణాలు
ఱంపపు కోత భరించలేక
చెక్కదిమ్మ యేడుస్తోంది
పొట్టుపొట్టుగా..
చందమామను చూస్తే
మల్లెచెట్టుకు యెంత సిగ్గో..
పూలకొంగు మొహాన కప్పుకుంది.
స్కూల్ బస్
యెన్ని సీతాకోకచిలుకల్ని
మోసుకెళ్తుందో..
గ్రంధాలయం
అడుగు పెట్టగానే
మస్తిష్కమంతా
విజ్ఞాన పరిమళం
మల్లెతీగ మనీప్లాంట్ తో
ఏం గొడవ పెట్టుకుందో
యాంటెనాతో కమిటయింది.
దర్వాజ బండమీద
పావలా బిళ్లలు..
దొంగతనం చేసినప్పుడల్లా
మా తాత చేతి కర్రే సాక్ష్యం.
ఱంపపు కోత భరించలేక
ReplyDeleteచెక్కదిమ్మ యేడుస్తోంది
పొట్టుపొట్టుగా..
nice one, keep writing.
sreeni lu ante.
నానీలను శ్రీనివాస్ రాశాడు కాబట్టి శ్రీనీలు. చిన్న పదప్రయోగం. శ్రీనివాస్ అంటే నేనే.....
Deleteవినాయకచవితి
ReplyDeleteచిన్నతనంలోనే
నాయకత్వ లక్షణాలు
ఱంపపు కోత భరించలేక
చెక్కదిమ్మ యేడుస్తోంది
పొట్టుపొట్టుగా..
బాగున్నాయి. ఏంటి కొత్త ప్రయోగమా? శ్రీనీలు
శ్రీనీలు అంటే శ్రీనివాస్ రాసిన నానీలు అని అర్ధం. ఏమీ లేదు. చిన్న పదప్రయోగం!!(మళ్లీ ఈ శ్రీనివాస్ ఎవరా అని అనుకోకండి. నాపేరు!!
ReplyDelete