Saturday 14 July 2012

నాకు ఫీలింగ్స్ ఎక్కువ!


నాకు ఫీలింగ్స్ ఎక్కువ!
నాలుగ్గోడ మధ్య చిమ్మచీకట్లో ఉండి కూడా
ఆకాశాన్ని చూస్తాను!
నాకు పాజిటివ్‌నెస్ ఎక్కువ
కత్తులు వంతెన మీద
కనకాంబరాల్ని స్పృశిస్తాను!
నాకు ఈస్థటిక్‌సెన్స్‌ ఎక్కువ
మండుగ్రీష్మంలో
కుంభవృష్టిని కలగంటాను!
నాకు ధైర్యమెక్కువ
గాయాల్ని మెడలో వేసుకుని
పోజులు కొడతాను!
నాకు ఆవేశమెక్కువ
ఖండిత శిరస్సులు వేలాడే కోటగుమ్మాన్ని
ఫుట్‌బాల్‌లా తన్నిపడేస్తాను!
నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ
చినుకుల మధ్యనుంచి తడవకుండా
సర్రున బాణంలా దూసుకెళ్తాను!
నాకు దురాశ ఎక్కువ
ఎప్పటికైనా రహస్య జీవితాన్ని నిర్మించుకుంటాను
కానీ ప్రస్తుతానికి నేను
బానిసకొక బానికసకొక బానిసను!

3 comments:

  1. అన్నీ ఎక్కువే అని మురిసి భానిసైనారే:-)
    బాగుందండి.....Keep writing!!

    ReplyDelete
    Replies
    1. ఏం చేస్తాం చెప్పండి పద్మార్పిత గారు.. కొన్ని జీవితాలు అంతే..
      ఈ ప్రపంచంలో అందిరికీ అందరూ ఏదో రూపంలో బానిసలే..
      కాదనుకుని బతికేవాళ్లంతా భ్రమానిసలు

      Delete
  2. ప్చ్ ఈ ప్రపంచంలో బానిస కనిదేవరున్నారు చెప్పండి. కొందరు బానిసకు బానిస, ఇంకొందరు బానిస బానిసకు బానిస, మరికొందరు బానిస బానిస బానిసకు బానిస, ఇంకా ఇలా ఎందఱో.... ప్చ్ ఎదవ జీవితం కదండీ!

    ReplyDelete