అమ్మ
అమృతమైతే, దాన్ని నింపుకున్న కలశం నాన్న! అమ్మ వెలిగే దీపమైతే దాన్ని వెలిగించే
వత్తి నాన్న! ఒక్కమాటలో చెప్పాలంటే తండ్రి త్యాగాల గుర్తు! అమ్మప్రేమ కంటి ముందుంటే.. నాన్న
ప్రేమ గుండెలో ఉంటుంది! అమ్మంటే మెరిసే మేఘం! నాన్నంటే నీలాకాశం! ! మమతల పందిరి కింద తండ్రికి ఒక
చిన్న ప్రశంసాపత్రం! !
జీవితం
దారి మరిచిపోయిన మార్గదర్శి! నో క్యాష్ బోర్డ్
లేని ఏటీఎం! అస్తమానం పని చేసే గానుగెద్దు! అవసరం వస్తే అడుక్కోవడం కూడా చేతగానోడు! భార్య సంతోషం కోసం తపనపడేవాడు!
పిల్లల ఆనందం కోసం తాపత్రయపడేవాడు!
కూతరంటే హడలి చచ్చేవాడు! కొడుకంటే బెదిరిపోయేటోడు!
అన్నింటికి కలిపి ఒక్కటే పేరు తండ్రి! మనకందరికీ
నాణానికి ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు! మరోవైపు అర్ధం చేసుకోవాలంటే కొంచెం మనసు
కూడా కావాలి!
ప్రకృతి
అమ్మైతే, దానికి జీవం పోసే విధాత నాన్న! అమ్మకు నిర్వచనాన్ని గుండెనడిగితే తెలిసిపోతుంది! కానీ నాన్నకు అర్ధం వెతకాలంటే విశ్వం మొత్తాన్ని శోధించాలి! ఆయన మనసు
అర్ధంకాని అంతరిక్షం! ఆయన హృదయం తేల్చుకోలేని పాతాళం! విషాన్ని, అమృతాన్ని తాగిన
సర్వేశ్వరుడు! ! చూడలేనికి వారికి అణుమాత్రంగా గోచరిస్తే.. చూడగలిగినవారికి
అండపిండ బ్రహ్మాండాలను దాటి పోయే విశ్వరూపం సాక్షాత్కరిస్తుంది! !
నాన్న అర్ధంకాని
జీవి!. కష్టాన్ని కళ్లకింద దాచి పెడతాడు!. సంతోషాన్ని చేతులతో పంచుతాడు!. షర్టు లేకుండా
నాన్నని చూడు!. ఆయన ఛాతీ ఎండిపోయిన నాగార్జున సాగర్ డామ్‌లా కనిపిస్తుంది!. ఎంత
ఒత్తిడిని తట్టుకోవాలి!. ఎంతెంత నీటిని కాచుకోవాలి. అందుకే ఆయన్ని చూస్తే అట్టగుడుకు జారిపోయిన
ధైర్యం గుండెలోకి ఎగదన్నుకొస్తుంది! ఆయన
స్పర్శ కరుకుగానే ఉండొచ్చు! కానీ తాకిచూడు! ఎదో సాధించాలన్న కసి నరనరాల్లోకి
సర్రున పాకుతుంది!
నాన్న
ఒక వెన్నెల రేడు! భగభగమండే ఎండలను దాచుకుని మలయ మారుతాల్ని పంచేవాడు!. విషం తాగి
అమృతం ఇచ్చేవాడు!. తనకోసం ఏమీ దాచుకోనివాడు! అందరి బరువుల్నీ మోసేవాడు!. దుఃఖమొస్తే
రెప్పల మాటున గుంభనంగా దాచుకునేవాడు! అమ్మతనం వెనుక ఎంత పెయిన్ ఉందో.. నాన్న కావడం వెనుకా అంతే బాధుంది! అమ్మ మనసు బంగారమే! కానీ
నాన్న మనసు కూడా!! కన్నీళ్లూ కష్టాలూ ఒక్కసారిగా ముసిరినప్పుడు, భద్ర
గుండె బరువెక్కినప్పుడు నాన్న గుర్తొస్తాడు! ఆయన పోరాట పటిమ గుర్తొస్తుంది!. తండ్రి
ప్రయాణించిన వేల మైళ్లు గుర్తొస్తాయి! ఆ త్యాగాల ప్రతిరూపానికి ఏమిచ్చినా రుణం
తీర్చుకోలేం! ! రెక్కలు ముక్కలు చేసి బతుకునంతా ధారవోసి బిడ్డల్ని పెంచే నాన్నలంతా
వర్ధిల్లాలి! ! !
avvunandi, nijam.
ReplyDelete