హైదరాబాద్ కల్చర్ గురించి
నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లందరికో చిన్న విన్నపం!! ఒక్కసారి మీమీ
చెప్పులొదిలేసి నిలబడ్డ చోట కళ్లు మూసుకుని నిర్మల మనసుతో ఆలకించండి! భాగ్యనగరం
మెరిసిపోతున్న ఓ పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది! నయాపూల్ మీద నిలబడి చూడు
ఆకాశానికి ప్రేమ బాహువులు చాపిన చార్మినార్ కనిపిస్తుంది! కళ్లల్లో బరాత్ వెన్నెల
వెలుగుల లార్డ్ బజార్ కనిపిస్తుంది! ఆ గాజుల చప్పుడు విను! సెలయేటి అలల్లా
చెవికెంత ఇంపుగా ఉంటయో!! కొంచెం పాదాలెత్తి చూడు! అరబ్బీ అప్సరసలా ఫలక్‌నూమా
కనిపిస్తుంది! గర్వంగా నిలబడ్డ గోలకొండను చూడు! అంబారీ ఎనుగునెక్కినంత సంబరపడుతావ్!
ఒక్కసారి నీ చుట్టూ నువు తిరిగి చూడు! పూలకొంగు మొఖాన కప్పుకున్న ఆకాశం నీమీద
పరుచుకుంటుంది! ఆ సౌందర్యానికి దండంపెట్టు! ఆ చక్కదనానికి ముచ్చటపడు! వన్నెతరగని
సంస్కృతి ముందు సాష్టాంగపడు! టైం దొరికితే షహనాయ్ రాగంలో కరిగిపో! వెన్నెల రాత్రుల
ముషాయిరాలో తడిసిపో! బతుకుపో!!
That might be the past.But ask any Indian about Hyderabadis.Only thing that majority opine is 'most selfish rude people'
ReplyDeleteమన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది
ReplyDelete