క్షణాల్లో మారిపోతుంటే
నిమిషాల్లో ఎందుకు
డూ ద న్యూ ఫర్ లైఫ్
జీవితమే ఓ గాలిబుడగ
ఈ లైఫ్ టైం ఫ్రీలూ
లాంగ్ టర్మ్ ప్రీమియంలూ
ఈ హిడెన్ చార్జీలూ
హిపోక్రసీలూ ఈగోలూ
ఎందుకు బాస్
సిర్ఫ్ ఏక్ రూపీ మే
కబ్ చాహియే జబ్ లేలియే
కిత్నా హోనా ఉత్నా లేనా
అయ్ వాంట్ ఇన్‌స్టంట్
డైరెక్టుగా తేయాకు తోట నుంచే
న ప్రిజర్వేటివ్ - న యాడెడ్
కలర్స్
తరుగూ వద్దు మేకింగ్ చార్జీలూ
వద్దు:
కిడ్డీ బ్యాంకుల నుంచీ
టెడ్డీబేర్‌ల నుంచీ
ఈ టెక్నోల నుంచీ
ఈ సేవాల నుంచీ
ఇంటద్దె నుంచీ
ఇన్షూరెన్స్ పాలసీల నుంచీ
ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచీ
ఏటీఎం సెంటర్ల నుంచీ
కార్యాలయాల నుంచీ
కరెన్సీ ఫెళఫెళల్నుంచీ
దూరంగా
దూరం దూరంగా
ఏంటదీ..
అంతరిక్షం అంత లాంగ్
లైఫ్‌లాంగ్
ఇన్‌స్టంట్ లైఫ్‌లోకి
సెకన్ పల్స్ రేటులోకి
ఏ ప్యాకేజీల్లేని ప్రపంచంలోకి
ఏ గ్యారెంటీ వారంటీల్లేని
ఏ అష్యూరెన్స్ భరోసా
ప్రకటనల్లేని లోకంలోకి
ఏ కండీషన్స్ అప్లయ్ కాని
జీవితంలోకి
నేరుగా ఏ రిసెప్షనిస్టూ
అడ్డుకోకుండా
ఎవరి అప్పాయింట్‌మెంట్ కోసమూ
చూడకుండా
భూతమేదీ వెంటాడకుండా
భవిష్యత్ భయపెట్టకుండా
చారిత్రక తప్పిదాలేవీ
చెర్నాకోల్‌తో చెళ్లుమనిపించకుండా
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
సర్ ఉఠాకే
విదౌట్ రోమింగ్ చార్జెస్
ఒరేయ్ కొలంబస్ ఎక్కడున్నావురా
బాబూ..
No comments:
Post a Comment