Saturday 14 July 2012

అహం"భావప్రాప్తి" కలగకపోతే లేచిపో..!!


కమిట్మెంట్లూ
కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్లూ లేనప్పుడు
లిట్రల్లీ
ప్రేమంటే తోటకూర కట్టే
సాయంకాలానికల్లా వడలిపోయే చెత్తే
హాస్టల్‌ గేట్‌ కిర్రు చప్పుళ్లు
పచ్చపూలు పరుచుకున్న క్యాంపస్‌ పేవ్‌మెంట్లపై
అడుగులో అడుగేస్తూ నడిచిన అనుభూతులు
బండల మీద కూచుకుని
తడిగుండెలు డ్రై బెట్టుకున్న క్షణాలు
నీ కర్చీఫ్‌ ఆమెదై.. ఆమె స్కార్ఫ్‌ నీదై
సమూహంలో ఏకాంతమై
చేజారుతుందని తెలిసినా మమేకమై
వద్దురా...
భళ్లున పగలడానికే కలలున్నప్పుడు
ఎర్లీ మాణింగ్‌ డ్రీమ్‌ మీద
ఎందుకురా అంత అభిమానం ఎర్రివాడా
నిజమే..
వీడ్కోలు పలకడానికి చాలా కేలరీస్‌ ఖర్చవుద్ది
మొహం మీద దఢేల్‌మని తలుపులు పడితే
తలపుల వీడ్కోలు స్వేచ్ఛాగీతమెలా పాడుతుంది
గుండెకు గునపాలు కొత్తవి కానప్పుడు
మార్చుకో
ఏ టెన్నిసో వెన్నిసో ఆడు
అక్కడ నీ ఐడియాలజీ తగిలించుకోడానికి
పాత మొహాలకు అహంభావప్రాప్తి కలగకపోతే
లేచిపో
రహస్య స్థావరాలు లేకున్నా పర్లేదు
పెన్నులో ఇంకున్నంత వరకూ
గుండెలోకి ఇంకేదంతా డ్రీమ్‌ సాంగే
సిరల్లో గుండె పొరల్లో అరల్లో
పిల్లో జాబిల్లో నీ వళ్లో పడ్డా ఎన్నెల్లో
సాంగురే బంగారు రాజా
నీవొక ఆశ్రమవాసివి కాదు
నీ హృదయం పలకనిది కాదు
నీ దాహం తీరనిది
బాధ తీయనిదైనప్పుడు
తరచి తరచి రివైండ్‌ చేసి ఆస్వాదించొచ్చు
లేదంటే ఏక్‌ పాజ్‌ బటన్‌ దబావో!
కచ్చా రమ్ము గోల్డ్‌ ఫ్లేక్‌ దమ్ములో కలిపేసెయ్‌
యాష్‌ ట్రేలో నలిపేసెయ్‌
ఏమో..
ఇవాళ తప్పనుకున్నది
రేపు కరెక్ట్‌ కావొచ్చేమో!!

No comments:

Post a Comment