Saturday, 29 December 2012

హైదరాబాద్‌ని ఎవరు అభివృద్ధి చేశారు....??



హైదరాబాద్. నాలుగువందల యేళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం ప్రేమ పునాదుల మీద నిర్మించబడింది. చరిత్ర తెలియకుండా మాట్లాడే సూడో ఇంటలెక్చువల్స్ అందరికి చిన్న విన్నపం. ఒక్కసారి మీ చెప్పులు పక్కనపెట్టి నిర్మలంగా కళ్లు తెరిసి చూడండి. షెహనాయ్ రాగంలో మీ దేహం పింఛంలా పురి విప్పుతుంది. గల్లిగల్లీలో పాన్ సుగంధం అలుముకుంటది. దట్ ఈజ్ హైదరాబాద్.
అవును హైదరాబాదీలు నవాబులే. సంస్కృతిలో నవాబులు. సాంప్రదాయంలో నవాబులు. ప్రేమను పంచడంలో నవాబులు. స్నేహహస్తాన్ని చాటటంలో నవాబులు. హైదరాబాదీలకు రెండు నాల్కలుండవు. హైదరాబాదీలకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు. పొద్దున లేస్తే ఎవరికి గోతులు తవ్వుదామా అని ఆలోచించరు. కబ్జాలు తెలియవు. కల్లిబొల్లి కబుర్లు తెలియవు. మొసలి కన్నీళ్లు కార్చడం చేతకాదు. సాఫ్ సీదా మాట్లాడుతారు. దోస్తానా చేస్తే ప్రాణమిస్తారు. కష్టం వస్తే..కడుపున పెట్టుకుంటారు. పక్కోడికి కన్నీళ్లొస్తే.. తుడిచే వేలవుతారు. ఆనందమొస్తే  పంచుకునే తోడవుతారు. ఆకలైతే కంచంలో పిడికెడు మెతుకులవుతారు. అన్నింటికి మించి తోడబుట్టిన వాళ్లవుతారు.
హైదరాబాదీలు శ్రమైక జీవులు. శ్రమలో ఆనందాన్ని వెతుక్కునే వట్టి వెర్రి బాగులోళ్లు. హైదరాబాదీలు అమాయకులు. బతుకడానికి వచ్చినోళ్లకు దారిపొడవునా దివిటీలవుతారు. హైదరాబాదీలు సోమరిపోతులు కాదు. కష్టజీవులు. సౌందర్యారాధకులు. వాళ్లు శ్రమిస్తేనే భాగ్యనగరం అందంగా ప్రాణం పోసుకుంది. వాళ్లు అహోరాత్రులు కష్టపడితేనే.. ఇవాళ సోకాల్డ్‌ వలసవాదులు నగరం నీడన సేదతీరుతున్నది. వాళ్ల చెమటచుక్కల ఫలితంగానే ఇవాళ ప్రపంచ పటంమీద హైదరాబాద్‌ సగర్వంగా చేతులు చాపి నిలబడింది.  

1507 గోల్కొండ స్వతంత్ర రాజ్యంగ అవతరణ
1562
హుస్సేన్ సాగర్ నిర్మాణం
1578
పురానాపుల్ నిర్మాణం
1578
నగరం గోల్కొండ కోట నుండి ముసీకి దక్షిణంగా విస్తరణ
1580
నూతన నగరానికి ఆవిష్కరణ
1589 -91
చార్మినార్, గుల్జార్ హౌజ్, చార్ కమాన్ల నిర్మాణం
1793
సరూర్ నగర్ లో జనావాసాలు   
1803
సుల్తాన్ శాహీలో టంకశాల  
1805
మీరాలం మండీ  
1806
మీరాలం చెరువు  
1808
బ్రిటిష్ రెసిడెన్సీ భవన నిర్మాణం
1828
చందూలాల్ బారాదరీ నిర్మాణం
1831
చాదర్ ఘాట్ వంతెన నిర్మాణం
1859 -66
అఫ్జల్ గంజ్ వంతెన నిర్మాణం (నయాపుల్)
1862
పోస్టాఫీసులు  నిర్మాణం
1873
బాగే ఆం పబ్లిక్ గార్డెన్ నిర్మాణం
1873
బొంబాయి సికిందరాబాదు రైల్వే లైన్ల నిర్మాణం
1874
నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
1884
ఫలక్ నుమా ప్యాలెస్ నిర్మాణం
1882
చంచల్ గూడా జైలు నిర్మాణం
1883
నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం
1884
ముస్లిం జంగ్ వంతెన నిర్మాణం
1885
టెలిఫోన్ ఏర్పాటు
1890
నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు ఏర్పాటు
1893
హనుమాన్ వ్యాయమాశాల ప్రారంభం
1910
హైదరాబాద్ స్టేట్ విద్యుత్ సంస్థ ఏర్పాటు
1920
హైకోర్టు నిర్మాణం
1920
ఉస్మాన్ సాగర్ (గండిపేట) నిర్మాణం
1927
హిమాయత్ సాగర్ ఆనకట్ట నిర్మాణం
1927
చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి నిర్మాణం
1930
హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల నిర్మాణం
1935
బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు
1945
నిజాం టాటాల ఉమ్మడి భాగస్వామ్యంలో డక్కన్ ఎయిర్ వేస్ ప్రారంభం
కారల్ మార్క్స్ చెప్పినట్లు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో విలీనం కాకపోతే తెలంగాణాలోని పరిశ్రమలన్నీ ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేవన్నది నగ్న సత్యం.
తెలంగాణలో పారిశ్రామిక పురోగతి
1871 సింగరేణి బొగ్గు గనులు
1873
మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876
ఫిరంగుల ఫ్యాక్టరి
1910
ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్
1910
ఐరన్ ఫ్యాక్టరీ
1916
దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1919
వి.ఎస్.టి. ఫ్యాక్టరీ
1921
కెమికల్ లాబొరేటరి
1927
దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929
డీబీఆర్ మిల్ల్స్
1931
ఆజంజాహి మిల్ల్స్, వరంగల్
1932
ఆర్టీసీ స్థాపన
1937
నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939
సిర్పూర్ పేపర్ మిల్
1941
గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
1942
హైదరాబాద్ స్టేట్ బ్యాంక్
1942
హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
1943
ప్రాగా టూల్స్
1946
హైదరాబాద్ ఆస్బెస్టాస్
1947
హైదరాబాద్ లామినేషన్ ప్రోడక్స్

సర్ సాలార్ జంగ్ కాలంలో  
1864 రెవెన్యు శాఖ
1866
కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)
1866
జిల్లాల ఏర్పాటు
1866
వైద్య శాఖ
1866
మొదటి రైల్వే లైను
1867
ప్రింటింగు మరియు స్టేషనరీ
1867
ఎండోమెంట్ శాఖ
1867
అటవీ శాఖ (జంగ్లత్)
1869
మున్సిపల్ శాఖ
1869
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్
1870
విద్యా శాఖ
1870
హైకోర్టు ఏర్పాటు
1875
సర్వే, సెటిల్మెంట్ శాఖ
1876
ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ
1881
జనాభా లెక్కల సేకరణ
1882
ఎక్సైజ్‌ శాఖ (ఆబ్కారీ)
1883
పోలీసు శాఖ
1892
గనుల శాఖ
1892
పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
1893
లోకల్ ఫండ్ శాఖ
1896
నీటిపారుదల శాఖ
1911
స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్
1912
సిటి ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా)
1913
వ్యవసాయ శాఖ
1913
హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి A.P.P.S.C.)
1914
ఆర్కియాలజీ శాఖ
1932
ఆకాశవాణి హైదరాబాద్
1945
కార్మిక శాఖ

తెలంగాణ వారికి తెలివి లేదు.. తెలుగు రాదు.. చదువు రాదు.. అసలు అక్షరాభ్యాసం  చేసిందే మేమేనని సీమాంధ్రలు పోజులు కొడుతుంటారు. అలాంటి వాళ్లంతా ఒకసారి కళ్లు తెరిచి చూస్తే... హైదరాబాద్ లో వెల్లివిరిసిన విద్యాలయాలు సాక్షాత్కరిస్తాయి...
1856 దారుల్ ఉల్ ఉలుమ్ స్కూలు
1872
చాదర్ ఘాట్ స్కూలు
1879
ముఫీడుల్ అనం హైస్కూల్
1879
ఆలియా స్కూల్
1884
సికిందరాబాద్ మహబూబ్ కాలేజి
1884
నిజాం కాలేజి
1887
నాంపల్లి బాలికల స్కూలు
1890
వరంగల్ లో మొదటి తెలుగు స్కూలు
1894
ఆసఫియా స్కూలు
1894
మెడికల్ కాలేజి
1904
వివేక వర్ధిని స్కూలు
1910
మహాబుబియా బాలికల స్కూల్
1918
ఉస్మానియా యునివర్సిటీ
1920
సిటీ కాలేజీ
1923
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
1924
మార్వాడి హిందీ విద్యాలయ
1926
హిందీ విద్యాలయ
1930
ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ
1946
కాలేజి ఆఫ్ వెటర్నరీ సైన్స్
 పవిత్రమైన వైద్యాన్ని బిజినెస్ చేసి, పేషెంట్ల రక్తమాంసాలతో గల్లాపెట్టెలు నింపుకుంటున్న సీమాంధ్ర బడాబాబులకు.. ఒకప్పటి హైదరాబాద్ దవఖానాల చరిత్ర తెలియదు. రోగికి నయం చేయడమొక్కటే కాదు. వాళ్లను అడ్మిట్ చేసుకుని ఉచితంగా మందులు మాకులతో పాటు అన్నం, పాలు, డబుల్ రొట్టె ఇచ్చి ఆరోగ్యం బాగు చేసి పేషెంట్ ఇంటికి వెళ్తానని అంటే తప్ప డిశ్చార్జ్ చేసేవాళ్లు కాదు. ఏవీ ఆ గోల్డెన్ డేస్?
పేద రోగుల్ని ప్రేమించిన అప్పటి ఆసుపత్రులు

1890
ఆయుర్వేద, యునాని వైద్యశాల  
1894
మెడికల్ కాలేజి
1897
మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
1905
జిజ్గిఖాన (విక్టోరియా మెమోరియల్ ప్రసూతి దవాఖానా)
1916
హోమియోపతి కాలేజి
1927
చార్మినార్ యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
1925
ఉస్మానియా జనరల్ హాస్పిటల్
1945
నీలోఫర్ చిన్నపిల్లలా దవాఖానా
గాంధి దవాఖానా
టి. బి. దవాఖానా, ఎర్రగడ్డ
క్యాన్సర్ దవాఖానా
ఇ. ఎన్. టి. హాస్పిటల్
నిజాం ఆర్దోపెడిక్ హాస్పిటల్(నిమ్స్)
కోరంటి దవాఖానా

హైదరాబాద్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లందరికి చిన్న విన్నపం. ఒక్కసారి మీమీ చెప్పులొదిలేసి..కళ్లు తెరుచుకుని హైదరాబాద్‌ని నిర్మల మనసుతో ఆలకించండి. భాగ్యనగరం వజ్రంలా మెరిసిపోతున్న ఓ పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది. హైదరాబాద్ ఒక సుందర స్వప్నలోకం. నయాపూల్ మీద నిలబడి చూడు ఆకాశానికి ప్రేమ బాహువులు చాపిన చార్మినార్ కనిపిస్తుంది. కళ్లల్లో బారాత్ వెన్నెల వెలుగుల లాడ్ బజార్ కనిపిస్తుంది. ఆ గాజుల చప్పుడు విను. సెలయేటి అలల్లా చెవికెంత ఇంపుగా ఉంటాయో. కొంచెం పాదాలెత్తి చూడు. అరబ్బీ అప్సరసలా ఫలక్‌నామా కనిపిస్తుంది. గర్వంగా నిలబడ్డ గోలకొండను చూడు. అంబారీ ఎనుగును ఎక్కినంత సంబరపడుతావ్. ఒక్కసారి నీ చుట్టూ తిరిగి చూడు. పూలకొంగును మొఖాన కప్పుకున్న ఆకాశం నీమీద పరుకున్నట్లు అనిపిస్తుంది. మీనార్ బురుజుల్లో కువకువలాడుతున్న శాంతికపోతాల్లా జంట నగరాలు కనిపిస్తాయ్. ఆ సౌందర్యానికి దండంపెట్టు. ఆ చక్కదనానికి ముచ్చట పడు. ఆ వన్నె తరగని సంస్కృతి ముందు సాష్టాంగపడు. టైం దొరికితే షహనాయ్ రాగంలో కరిగిపో. వెన్నెల రాత్రుల్లో ముషాయిరాలో తడిసిపో.  

3 comments:

  1. I think everyone who lives in Hyderabad has some part in this. It is just like working in a company. You work hard to get good name for you and promotion for you, but that also helps in developing the company.

    ReplyDelete
  2. I too agree with mannam gari comment. Informative post.

    ReplyDelete
  3. Hi,

    Burgula wrote Telanganites aren't well educated. Education is development i think.
    Ref: http://ourtelangana.com/files/brk_debhar_4.jpg

    Burgula wrote Telanganites were poor people although Nizam is rich.
    Ref: http://ourtelangana.com/files/brk_debhar_5.jpg

    If average telangana improved in these two its after merger.

    Regarding natural resources like Coal, Andhra is giving lot of OIL and Natural gas to the entire INDIA.

    ReplyDelete