స్నానం చేసి చాలా రోజులైంది
తాగీ, కాగీ, దేహం
దిగాలుపడింది
యూనివర్శిటీ లేడీస్ హాస్టల్ బస్‌స్టాప్
మూలకు
రాత్రి 10-40కి ఆమె చివరి
కరచాలనం
Burberry Touch
ఫ్లోరల్ అండ్ ఫ్రూటీ
ఫ్రాగ్రెన్స్
ఇంకా పరిమళిస్తూనే ఉంది
కడిగేసుకోవడం అంత ఈజీ
కాదురా నీ యయ్య
గుర్తుందా కాఫీ డేలోఆమెతో కలిసి
శుద్ధమధ్యమంలో పాడిన పాట
శుద్ధమధ్యమంలో పాడిన పాట
బీటలు వారిన గుండె పక్కన
ఎప్పటిదో యుద్ధ స్థావరం
నెమలీక ఇంకా నెత్తుటి మడుగులోనే
ఉంది
ఎగశ్వాస దిగశ్వాస
కవిత్వం ఇప్పుడొక శైథిల శిల్పం
పోనీలే జహాపనా
గ్రీటింగ్ కార్డొక
నోస్టాల్జియా
ఇప్పుడా జోకుడు పుల్ల
ఇసుక రేణువుల్లో
ఇరుక్కుపోయింది
ఇనుప దడి వెనుక నుంచి
నువ్వెంత మాట్టాడినా
ఆమెకు వినిపించదులే శీనయా
లే.. లేచి స్నానం చేయ్!!
baaga raasaru.meeru inkonchem baaga rayagalaru all the best.good one man
ReplyDeleteట్రై చేస్తాను. స్పందనకు ధన్యవాదాలు
Delete