Friday, 21 December 2012

కాకతీయ కళాతోరణం నిర్మాణం వెనుక ఆసక్తికర విషయాలు


కాకతీయుల పేరు వినగానే ముందుగా మన మనోఫలకం మీద మెదిలేదని కాకతీయ కీర్తితోరణం. చూడ్డానికి ఓ అలంకారపు ద్వారంలా కనిపించినా అందులో తెలుసుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి... . . కాకతీయ ఉత్సవాలు జరుగుతున్ననేపథ్యంలో కీర్తి తోరణం వెనుక కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..



కాకతీయుల కళాతోరణం కేవలం అలంకారం కోసం చేసిన డిజైన్‌ కాదు. దాని మీద కాకతీయుల పాలనా వైభవమంతా పూసగుచ్చినట్టుగా ఉంటుంది. వాళ్ల ఏలుబడిలో ఏఏ అంశాలకు ప్రాధాన్యమిచ్చారో తెలియజేస్తుంది. నిలబడ్డ నాలుగు పిల్లర్లు వాళ్ల పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనేదానికి నిదర్శనం. చివరి రెండు పిల్లర్ల మీద ఇరుపక్కల గర్జించిన సింహాలు కాకతీయుల ఎదురులేని నాయకత్వానికి చిహ్నం. దానిపక్కన తల పైకెత్తిన మొసలి జలకళకు ప్రతీతి. ఎందుకంటే కాకతీయుల కాలంలో చెరువుల కుంటలు కాలువల్లో పుష్కలంగా నీళ్లుండేవి. నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మొసళ్లు మెండుగా ఉంటాయి. ఇకపోతే తోరణం నిండా లతలు, తీగలు పారే గొలుసుకట్టు చెరువుల్ని, కుంటల్నీ సూచిస్తాయి. అపార జలరాశి పరవళ్లు తొక్కడంతో ఆ కాలంలో ముక్కారు పంటలు పండేవి. కాకతీయుల కాలంలో ప్రజలకు ఆకలి బాధ ఎలావుంటుందో తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే టాప్‌లో ఇరుపక్కల రెండు హంసలు కాకతీయుల పారదర్శక పాలనకు నిదర్శనం. హంస కింద ఇరుపక్కల చేతులు పైకెత్తిన కుబేరుల విగ్రహాలు ఆర్ధిక పరిపుష్టికి సంకేతం. మొసలి కింది భాగంలో వజ్ర వైఢూర్యాల దండలు కాకతీయుల వైభవానికి చిహ్నం. అప్పట్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మకున్నా ఆర్ధికపురోగతి అద్భుతంగా ఉండేదని సంకేతం. కిందిభాగాన బోర్లించిన ఏడు పూర్ణకుంభాలు గ్రామదేవతల ప్రతిబింబాలు. వాటినే సప్త మాతృకలు అని కూడా పిలుస్తారు.  పిల్లర్ మధ్యభాగంలో చేపల బొమ్మలు ఓ వెలుగు వెలిగిన మత్య్స పరిశ్రమకు సంకేతం. ఇవీ కాకతీయ కళాతోరణం వెనక ఇంట్రస్టింగ్ విషయాలు!!!

No comments:

Post a Comment