Sunday, 3 February 2013

గుండె నిలువుకోత పటం కూడా కవిత్వమే..!


11
రాత్రి పదకొండున్నరకి
క్యాంపస్ టెర్రస్ మీద
సోమరిగాలి వీస్తోంది
మధ్యాహ్నం కెఫెటేరియాలో
ఆ అమ్మాయి కళ్లు
పోర్ట్రెయిట్‌ ఆఫ్‌ ఏంజిల్
కట్టేసి కొట్టినట్టుగా
మనసంతా అప్రకటిత కర్ఫ్యూ
భావధారలో అచంచల సౌందర్యం
విద్యుత్ వాహకంలో ప్రాచీన కవిత్వం
సిగ్మండ్‌ ఫ్రాయిడ్
అన్‌వాంటెడ్ ఇంటర్‌ప్రిటేషన్‌
12
చూడు చూడు
ప్రకృతి పోతపోసినట్టు
నదీ నీరవంలో
పాలరాయి తేలింది
గూటిపడవలో గంధపుచెక్క
సిరామిక్ ననుపులో మోనికా సెలెస్
హిమగిరుల మీదుగా పాదరసం  
జాలువారిన ఆమె శిరోజాలు 
వానలో తడిసి మెరుస్తున్న కొబ్బరాకులు
ముక్కుపుడక మీద ముద్దుపెట్టనా
ముజ్జెగములూ ఆగిపోతాయ్‌
తొక్కలో అలారం ఆపెహె..
విద్యానగర్ చౌరస్తా వెన్నెల్లో
తిలక్ ఆడుకుంటున్నాడు
కవిత్వమంటే.,
అరఠావు అక్షరాలే కాదన్నయా..
గుండె నిలువుకోత పటం కూడా!!!  

2 comments:

  1. గుండెకి నిలువేంటి అడ్డమేంటండి.....ఎద ఊసులన్నీ కవిత్వమే:-)

    ReplyDelete
  2. ఎద ఊసులు కవిత్వం కాదని నేను అనలేదు పద్మార్పిత గారూ....
    నేనన్నది గుండె నిలువుకోత పటం కూడా కవిత్వమే అన్నాను.....
    నా అభిప్రాయం నేను చెప్పాను...
    ఎవరినో గాయపరచాలని కాదు...!!
    నా కోణంలో మాత్రమే రాశాను...

    ReplyDelete