సన్నాయిలో కల్యాణి రాగం
సలలిత రాగ సుధారస సారం
దుఃఖం ఆపుకోలేక
జ్ఞాపకాల వాంతులు
ఒడ్డున కెరటం
భళ్లుమంది
పొన్నచెట్టు మీద
సందె వాలింది
చీకటి మీద వెన్నెల
నిశ్శబ్దంగా పాకింది
నాలుగు స్లీపింగ్ పిల్స్
జోలపాటకు కోరస్
వెండి దారాల
యాంబియెన్స్ లో
రెల్లుపూల వనం
మల్లెపూల వాసనొచ్చినా
నిద్ర మాత్రం లేదు
అయ్ వాంట్ సమ్ విస్కీ
అట్లీస్ట్ నైన్టీ ఎంఎల్
కొండంత బరువు
గుండె మీదుంది సారూ..
డాక్టర్ గారేమో ఏడ్వద్దన్నారు..!!
దూరంగా టూరింగ్ టాకీస్ మైకులో
కాశ్మీరీ లోయలో...:
అప్పడు సమయం సెకండ్ షో
మూయని రెప్పల మీద
రిపీటెడ్ కట్ అవే షాట్స్#
ఒంటిచుట్టూ పొగరాని కుంపట్లు
కొంచెం అత్తరుంటే జల్లవా...
ప్లీజ్ నాకు అగరొత్తుల వాసన పడదు
అబే.. ఎవడ్రా అది!!
గోడపక్కన ఉచ్చ పోసేది....??
(ఇక్కడ కొంచెం కోపంగా అడగవలెను!)
No comments:
Post a Comment