విద్యానగర్ టు ఛే నంబర్! బండి రైట్‌కి వెళ్లదు. ఆటోమేటిగ్గా స్ట్రయిట్ తీస్కొని, లెఫ్ట్ లో ఆగిపోద్ది! మామా మన కేఫ్ లేదూ.. ఫోన్‌లో అవతలివాడికి ఇదే అడ్రస్. ఇదే బండ గురుతు. ఇదే కొండ గురుతు. హిల్టన్ కేఫ్. అవును.. ఎవరికి వారు మన అని పిలుచుకునే కేఫ్ . పాతబస్తీకి చార్మినార్. సికింద్రాబాకి క్లాక్‌టవర్. ఉస్మానియా క్యాంపస్‌కి హిల్టన్ కేఫ్. మనసు చెమ్మగిల్లినప్పుడో.. లైబ్రరీలో మేనేజ్‌మెంట్ కోర్సులు రొద చేస్తున్నప్పుడో .. బుర్రలో గ్రూప్ సిలబస్ బుసలు కొడుతున్నప్పుడో.. ఆంత్రోపాలజీ అంతుపట్టకుండా పోయినప్పుడో.. హిల్టన్ కేఫ్ గుర్తొస్తుంది. తెలుగుని తురకంలో మాట్లాడేపోరగాడు గుర్తొస్తాడు. జలీల్‌భాయ్ పాన్‌షాప్ గుర్తొస్తుంది. పొగలుగక్కే ఇరానీ చాయ్. వేళ్లమధ్య గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజ్. ఇంతకంటే ఏం కావాలి బోర్‌డమ్ వదిలించడానికి. ఇంతకంటే ఏం కావాలి గుండెబరువు దించుకోడానికి. కట్ చేయకుండానేఇప్పుడా కలల బెంచీల మీద కాఫీ డే మొలిచింది. ఇంపోర్టెడ్ ప్యాకింగ్‌తో. గ్లాస్ విత్ కేర్. .వోన్లీ ఫర్ లవర్స్. లోపలికెళ్తే గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే.. నేనొక దిక్కుమాలిన కాఫీషాప్ కడ నిల్చి చివాలున అటువేపు చూస్తే తలుపులు మూసుకుపోయాయి. మూర్ఛనలు పోతూ అడిగితే .. ఏంటదీ అదేదో కల్చరన్నారు. ఎలాట్ కెన్ హాపెన్ ఓవర్ కాఫీ అన్నారు. హితుడా.. నా మనసింకా గూడు దొరకని పిట్టలా అక్కడే తిరగాడుతోంది. పోరగాడి కేక కోసమో.. వాడి పిలుపుతో చిక్కబడే చాయ్ కోసమో.. సమోసాలో పచ్చిమిరపకాయ కోసమో.. గొంతులో సర్రున జారిపోయే టై బిస్కెట్ కోసమో..ఇంకా దేని కోసమో.. దేనికోసమో. నా మనసింకా అక్కడే పెనుగులాడుతోంది. మిత్రులారా.. దయచేసి ఇటువేపు ఎవరూ రాకండి. రాకండి.. రాకండి. వస్తే మనసుని కుదిపి కుదిపి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వొరే తమ్మీ నీకే చెప్పేటిది. వస్తే సెప్టిక్కయిన పుండుపై ఇనుపకచ్చడంపై గుద్దినట్టుంటుంది. కుట్లు తెగిన గాయంపై కారప్పొడి చల్లినట్టుంటుంది. రక్తం ఉడికిపోతుంది. కడుపు మసిలిపోతుంది. గుండె మండిపోతుంది. ఏంటీ..
Thursday, 1 March 2012
హిల్టన్ కేఫ్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment