Thursday, 1 March 2012

గానుగెద్దు డాడీ



కొడుకు డాక్టర్‌.  క్లోరోఫాం బదులు వేరే మత్తు మందు కనుక్కున్నాడు.మనుషుల మీద ప్రయోగం చేసి విజయవంతమైనట్టు రుజువు చేస్తేనే గాని మార్కెట్లో పేటెంట్ దొరకదుచూస్తూ చూస్తూ అలాంటి ప్రయోగానికి ఏ మనిషి ఒప్పుకొంటాడుకానీ అతని తండ్రి అంగీకరించాడుఆ ప్రయోగం సక్సెసయిందిఆపరేషన్   జరుగుతున్నంతసేపూ ఆ తండ్రి చిరునవ్వుతో అలా ఉండిపోయాడువచ్చిన వాళ్తంతా ఓకే అని వెళ్లిపోయారువెంటనే తండ్రిని కావలించుకుని కొడుకు వలవలా ఏడ్చాడుకంగారులో డోస్‌ ఎక్కువిచ్చాను నాన్నానువ్వు బాధతో విలవిల్లాడుతుంటే తట్టుకోలేకపోయాను..  అని దీనంగా అన్నాడుదానికి తండ్రి నవ్వి.. నిజంగా నాకే బాధా అనిపించలేదు కన్నా!నువ్వు సక్సెస్‌   కావాలని ఓర్చుకున్నానంతే అన్నాడుఅదీ తండ్రి మనసంటే.   
ఎప్పుడూ పనీ పనీ పనీఅస్తమానం గొడ్డుచాకిరీగానుగెద్దులా కష్టపడుతునే ఉంటాడుతనకోసం ఏమీ దాచుకోడుబటన్‌ ఊడిపోయినా బట్టలు ఇస్త్రీ లేకున్నా చెప్పులు తెగిపోయినా ఆఖరికి అమ్మ లంచ్‌  బాక్స్‌ సర్దలేకపోయినా.అన్నిటినీ భరిస్తాడుఅందరి బరువుల్నీ మోస్తాడుదుఃఖమొస్తే రెప్పల మాటున గుంభనంగా దాచుకుంటాడుఅతనే నాన్నఅమ్మతనం వెనుక ఎంత పెయిన్‌  ఉందో.. నాన్న కావడం వెనుకా అంతే బాధుంది.
అమ్మ మనసు బంగారమేకానీ నాన్న మనసు కూడాకన్నీళ్లూ కష్టాలూ ఒక్కసారిగా ముసిరినప్పుడు, భద్ర గుండె బరువెక్కినప్పుడు, నువ్వే గుర్తొస్తావు నాన్నానీ పోరాట పటిమ గుర్తొస్తుందినువు ప్రయాణించిన వేల మైళ్లు గుర్తొస్తాయిఅమ్మ ఒడిలో తొలిపాఠాలు నేర్చినా నీ చిటికెన వేలు పట్టుకునే ప్రపంచమంతా తిరిగొచ్చిందిఏ కళ్లజోడులోంచి మాకు భవిష్యత్‌ చూపించాలో అని నువు పడ్డ తపన ఎప్పటికీ మరిచిపోలేంమా లేత పాదాలతో నీ గుండెల మీద తంతూ ఆడుకుంటుంటే నీ కళ్లలో మెరిసిన మెరుపుందీ.. అది ఎప్పటికీ నన్ను వెంటాడుతుంటుందిపిల్లల విషయంలో లేని కాఠిన్యాన్ని ప్రదర్శించి నువ్వొక గుండె లేని బండోనివైనావువర్కనో ఉద్యోగమనో ఓటీలనో క్యాంపులనో పొద్దున్నే వెళ్లిపోతావ్‌. ఏ అర్ధరాత్రో చడీ చప్పడు చేయకుండా ఇంటికొస్తావు.పిల్లలు నిద్ర లేస్తారని అమ్మతో కూడా పెద్దగా మాట్లాడవునువ్వు గానెగెద్దు డాడీవినువ్వొక అరవ చాకిరీచేసే వెర్రిబాగులోడివిఅవసరం వస్తే అడుక్కోవడం కూడా చేతగానోడివి. అమ్మ సంతోషం కోసం ఎంత బాధైనా పడేవాడివి.  కూతరంటే హడలి చచ్చేవాడు. కొడుకంటే బెదిరి పోయేటోడు. కడుపున పుట్టిన వాళ్లకు కూడా అణిగిమణిగి వుండేటోడు. అన్నింటికి కలిపి ఒక్కటే పేరు తండ్రి
బుజ్జాయిని మొదటి సారి ఎత్తుకుని తండ్రి నిశ్శబ్దంగా నవ్విన శబ్దాన్ని మించిన సుస్వరం ఎక్కడైనా ఉందా? అప్పుడే పుట్టిన పసిపాప ఏడుపును హాస్పిటల్‌ వరండాలో గోడకానుకుని నిల్చుని విన్న క్షణాల్ని ఎవరైనా మరిచిపోతారా?

1 comment:

  1. నిజమే నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే........
    తనే ధైర్యం, సంతోషం, అలోచన.. అన్నీ.
    నాన్న లేని జీవితం అసలు ఊహించుకోలేం.
    నాన్న గురించి ఎవరు రాసినా లేదా మాట్లాడినా ప్రతి బిడ్డకు తండ్రి గుర్తుకు రాకతప్పదు.ఆకాశంతోగాని,సముద్రంతోగాని పోల్చబడే నాన్న గంభీరతకన్నా వెన్నతో పోల్చబడే నాన్న మనసే మిన్న.నాన్న కఠిన వాక్కుల వెనుక ఉన్న కర్తవ్యదీక్ష నేటి పిల్లలకు అవగతమైతే నాన్న ప్రేమ కరుణామృతమే...సర్‌..

    ReplyDelete