విద్యానగర్ టు ఛే నంబర్! బండి రైట్‌కి వెళ్లదు. ఆటోమేటిగ్గా స్ట్రయిట్ తీస్కొని, లెఫ్ట్ లో ఆగిపోద్ది! మామా మన కేఫ్ లేదూ.. ఫోన్‌లో అవతలివాడికి ఇదే అడ్రస్. ఇదే బండ గురుతు. ఇదే కొండ గురుతు. హిల్టన్ కేఫ్. అవును.. ఎవరికి వారు మన అని పిలుచుకునే కేఫ్ . పాతబస్తీకి చార్మినార్. సికింద్రాబాకి క్లాక్‌టవర్. ఉస్మానియా క్యాంపస్‌కి హిల్టన్ కేఫ్. మనసు చెమ్మగిల్లినప్పుడో.. లైబ్రరీలో మేనేజ్‌మెంట్ కోర్సులు రొద చేస్తున్నప్పుడో .. బుర్రలో గ్రూప్ సిలబస్ బుసలు కొడుతున్నప్పుడో.. ఆంత్రోపాలజీ అంతుపట్టకుండా పోయినప్పుడో.. హిల్టన్ కేఫ్ గుర్తొస్తుంది. తెలుగుని తురకంలో మాట్లాడేపోరగాడు గుర్తొస్తాడు. జలీల్‌భాయ్ పాన్‌షాప్ గుర్తొస్తుంది. పొగలుగక్కే ఇరానీ చాయ్. వేళ్లమధ్య గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజ్. ఇంతకంటే ఏం కావాలి బోర్‌డమ్ వదిలించడానికి. ఇంతకంటే ఏం కావాలి గుండెబరువు దించుకోడానికి. కట్ చేయకుండానేఇప్పుడా కలల బెంచీల మీద కాఫీ డే మొలిచింది. ఇంపోర్టెడ్ ప్యాకింగ్‌తో. గ్లాస్ విత్ కేర్. .వోన్లీ ఫర్ లవర్స్. లోపలికెళ్తే గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే.. నేనొక దిక్కుమాలిన కాఫీషాప్ కడ నిల్చి చివాలున అటువేపు చూస్తే తలుపులు మూసుకుపోయాయి. మూర్ఛనలు పోతూ అడిగితే .. ఏంటదీ అదేదో కల్చరన్నారు. ఎలాట్ కెన్ హాపెన్ ఓవర్ కాఫీ అన్నారు. హితుడా.. నా మనసింకా గూడు దొరకని పిట్టలా అక్కడే తిరగాడుతోంది. పోరగాడి కేక కోసమో.. వాడి పిలుపుతో చిక్కబడే చాయ్ కోసమో.. సమోసాలో పచ్చిమిరపకాయ కోసమో.. గొంతులో సర్రున జారిపోయే టై బిస్కెట్ కోసమో..ఇంకా దేని కోసమో.. దేనికోసమో. నా మనసింకా అక్కడే పెనుగులాడుతోంది. మిత్రులారా.. దయచేసి ఇటువేపు ఎవరూ రాకండి. రాకండి.. రాకండి. వస్తే మనసుని కుదిపి కుదిపి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వొరే తమ్మీ నీకే చెప్పేటిది. వస్తే సెప్టిక్కయిన పుండుపై ఇనుపకచ్చడంపై గుద్దినట్టుంటుంది. కుట్లు తెగిన గాయంపై కారప్పొడి చల్లినట్టుంటుంది. రక్తం ఉడికిపోతుంది. కడుపు మసిలిపోతుంది. గుండె మండిపోతుంది. ఏంటీ..
Thursday, 1 March 2012
హిల్టన్ కేఫ్
విద్యానగర్ టు ఛే నంబర్! బండి రైట్‌కి వెళ్లదు. ఆటోమేటిగ్గా స్ట్రయిట్ తీస్కొని, లెఫ్ట్ లో ఆగిపోద్ది! మామా మన కేఫ్ లేదూ.. ఫోన్‌లో అవతలివాడికి ఇదే అడ్రస్. ఇదే బండ గురుతు. ఇదే కొండ గురుతు. హిల్టన్ కేఫ్. అవును.. ఎవరికి వారు మన అని పిలుచుకునే కేఫ్ . పాతబస్తీకి చార్మినార్. సికింద్రాబాకి క్లాక్‌టవర్. ఉస్మానియా క్యాంపస్‌కి హిల్టన్ కేఫ్. మనసు చెమ్మగిల్లినప్పుడో.. లైబ్రరీలో మేనేజ్‌మెంట్ కోర్సులు రొద చేస్తున్నప్పుడో .. బుర్రలో గ్రూప్ సిలబస్ బుసలు కొడుతున్నప్పుడో.. ఆంత్రోపాలజీ అంతుపట్టకుండా పోయినప్పుడో.. హిల్టన్ కేఫ్ గుర్తొస్తుంది. తెలుగుని తురకంలో మాట్లాడేపోరగాడు గుర్తొస్తాడు. జలీల్‌భాయ్ పాన్‌షాప్ గుర్తొస్తుంది. పొగలుగక్కే ఇరానీ చాయ్. వేళ్లమధ్య గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజ్. ఇంతకంటే ఏం కావాలి బోర్‌డమ్ వదిలించడానికి. ఇంతకంటే ఏం కావాలి గుండెబరువు దించుకోడానికి. కట్ చేయకుండానేఇప్పుడా కలల బెంచీల మీద కాఫీ డే మొలిచింది. ఇంపోర్టెడ్ ప్యాకింగ్‌తో. గ్లాస్ విత్ కేర్. .వోన్లీ ఫర్ లవర్స్. లోపలికెళ్తే గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే.. నేనొక దిక్కుమాలిన కాఫీషాప్ కడ నిల్చి చివాలున అటువేపు చూస్తే తలుపులు మూసుకుపోయాయి. మూర్ఛనలు పోతూ అడిగితే .. ఏంటదీ అదేదో కల్చరన్నారు. ఎలాట్ కెన్ హాపెన్ ఓవర్ కాఫీ అన్నారు. హితుడా.. నా మనసింకా గూడు దొరకని పిట్టలా అక్కడే తిరగాడుతోంది. పోరగాడి కేక కోసమో.. వాడి పిలుపుతో చిక్కబడే చాయ్ కోసమో.. సమోసాలో పచ్చిమిరపకాయ కోసమో.. గొంతులో సర్రున జారిపోయే టై బిస్కెట్ కోసమో..ఇంకా దేని కోసమో.. దేనికోసమో. నా మనసింకా అక్కడే పెనుగులాడుతోంది. మిత్రులారా.. దయచేసి ఇటువేపు ఎవరూ రాకండి. రాకండి.. రాకండి. వస్తే మనసుని కుదిపి కుదిపి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వొరే తమ్మీ నీకే చెప్పేటిది. వస్తే సెప్టిక్కయిన పుండుపై ఇనుపకచ్చడంపై గుద్దినట్టుంటుంది. కుట్లు తెగిన గాయంపై కారప్పొడి చల్లినట్టుంటుంది. రక్తం ఉడికిపోతుంది. కడుపు మసిలిపోతుంది. గుండె మండిపోతుంది. ఏంటీ..
మైదానం- 2
మిసిసిపి నది వొడ్డున
ఇసుక తిన్నెల్లో
ఒరుసుక్కూర్చుని
వెన్నెల రాత్రి
నక్షత్రాలన్నీ గంపకెత్తుదామా
ఎరేజర్ పట్రావా
చందమామలో మచ్చని డిలీట్ చేద్దాం
మబ్బుల్ని కోసివ్వనా
తలగడలాగా పెట్టుకుంటావా
దాహమేస్తోంది
కళ్లతో నిను తాగేయనా
వద్దులేః
రుషులు వాయుభక్షణ చేసినట్టు
నేనూ అలా కృషి చేస్తా
ఈ ఈదురుగాలిలో
కాసిని చితుకులు రాజేయనా
నీ సోమరి చూపుల మీద
ఒడ్డుకు కొట్టుకొచ్చిన నురగ అద్దనా
ఏరుకున్న శంఖాలతో
నీ మెడ అలంకరించనా
కాపీరైట్స్ కోసం
స్వర్గం సీఈవోకి టెలీగ్రాం పంపిద్దామా
క్షీరసాగరమథనమా..
నన్నడిగితే అదో రిస్కీ ఫీట్
ప్రియురాలి అధరాల్ని క్రషించి చూడు
కురిసేదంతా అమృతధారే కదా!
ఔనూ..
మీకు శరత్కాలాల్నీ శిశిర రుతువుల్నీ
కలిపి కుట్టడం వచ్చునా
వెన్నెల జలపాతాల్నీ సెలయేటి పాయల్నీ
కలిపి పుక్కిలించి ఉమ్మేయడం తెలుసునా
కొండగాలికి నగ్న దేహాల్ని
ఆరబెట్టుకోవడం వచ్చా
అంతఃపురంలో సుఖపడని రాణుల
ఆత్మల్ని వెంటేసుకు తిరగడం తెలుసా
సిపాయి సిక్స్ ప్యాక్ మడతల్ని చూసి
మెహించిన రాచకన్య విరహవేదనని
తీర్చడం వచ్చా
మరి ఏకాంత మందిరంలో
యువరాణితో రహస్యాలింగనం
అరెస్ట్రా కలిగ్యులా
అన్‌సెన్సార్డ్ ఫిలింలా మారిపోవాలనుందా
ఏథేను వనం
ఒక ఆడం ఒక ఈవ్
ఒక రాజేశ్వరి ఒక అమీర్
ఒక నేను ఒక ఆమె
నమస్కారం చలంగారూ
దయచేసి మా లవ్ స్టోరీని
మైదానం సీక్వెల్‌గా రాస్తారా
అమ్మాయిలూ ఆల్కాహాలికులూ !
అదో వీకెండ్. వేదిక బ్లూ ఐస్ బార్ అండ్ రెస్టారెంట్. సెక్టార్ సెవెంటీన్. టైమ్ పదకొండు. రాక్ మ్యూజిక్ హోరెత్తుతోంది. చుట్టూ గ్లేజింగ్ లైట్స్. అప్పుడప్పుడూ స్మోక్ లాంప్ ఎఫెక్ట్. ఓ చేతిలో సిగార్. మరో చేతిలో పెగ్. అందులో విస్కీ. ఒలికిపోకుండా స్టెప్స్. అలుపూ సొలుపూ లేకుండా ఆడుతునే ఉన్నారు. 12 అయింది. ఒంటిగంటైంది. సిగరెట్లు కాలిపోతునే ఉన్నాయి. బాటిల్స్ ఖాళీ అవుతునే ఉన్నాయి. అయినా జోరు తగ్గలేదు. పబ్ కల్చర్ పెరిగిన తర్వాత ఇది మరీ కామన్ అయింది. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడ ఒంకో విషయం ఏంటంటే.. ఇలాంటి పార్టీల్లో ఎక్కువగా అమ్మాయిలే డ్రింక్ చేస్తున్నారట. ఇదేదో గుడ్డిగా చెప్తున్న మాట కాదు. సర్వేలో తేలిన విషయం.
టేస్ట్ తో కథ మొదలు. జస్ట్ యాడ్ సోడా నీళ్లు. ఒకానొక వీక్ మూమెంట్.
స్కాచ్ బాటి్ వారిని లొంగదీసుకుంటుది. ఐటీ బూమ్ పెరిగిన దగ్గర్నుంచి ఈ టైపాఫ్
కల్చర్ మరీ హల్‌చల్ చేస్తున్నది. లక్షల్లో జీతం.. వారాంతపు దినాలు.. పైసలు ఎలా
ఖర్చు పెట్టాల్నో తెలియని సందిగ్ధం. వెరసి ఆల్కాహాలిజం.
డ్రగ్స్.. డ్రింక్స్.. అండ్ సిగరెట్స్. ఓన్లీ ఫర్ మెన్ ఐటెమ్స్.
అది ఒకప్పటి మాట. కాలం మారింది గురూ అంటూ అమ్మాయిలు అబ్బాయిల్ని ఓవర్ టేక్
చేస్తున్నారు. మెట్రో సిటీస్‌లో ఈ కల్చర్ వల్చర్‌లా వాలిపోయింది. మల్టీ నేషన్
కంపెనీల పుణ్యామా అని ఎంటర్‌టైన్‌మెంట్ స్పాట్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. ఐటీ, ఐటీ
ఎనేబుల్డ్ సర్వీసెస్ వచ్చిన దగ్గర్నుంచి యూత్ లైఫ్ స్టయిల్‌లో పెద్ద మార్పే
వచ్చిందని చెప్పొచ్చు. అవసరానికి మించిన సంపాదన.. సమ్‌థింగ్ ఎక్స్ ట్రానే
కోరుకుంటున్నది. వారమంతా పగలూ రాత్రీ తేడా లేకుండా షిఫ్టుల్లో నలిగిపోయిన జీవితాలు
వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కి అలవాటుపడిపోయాయి. ఆ మాత్రం రిలాక్సేషన్ లేకపోతే.. ఈ
గొడ్డు చాకిరీ ఎందుకు చేస్తున్నట్టు అంటూ యూత్ ప్రశ్నిస్తోంది. ఇటు ఎంఎన్‌సీలో
ఉద్యోగం.. అటు ఇంట్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్. నెలకోసారి ఫారిన్ ట్రిప్.
అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంలో అబ్బాయిలకంటే అమ్మాయిలే
ముందుంటున్నారు.
ఈ ప్రపంచంలో కూల్‌నెస్‌కి మించింది లేదంటరు. కూల్‌గా వర్క్ చేయాలని.. కూల్‌గా థింక్ చేయాలనీ.. లైఫంతా కూల్ కూల్‌గా గడిపేయాలనీ.. ఇలా ప్రతీదానికీ కూల్‌ని యాడ్ చేస్తున్నారు. ఆ కూల్‌నెస్ ఎక్కడుందో.. అక్కడికి రెక్కలు గట్టుకుని వాలిపోతున్నారు. అందుకోసం సిగరెట్ తాగుతున్నామా.. మందుకొడుతున్నామా అన్నది డజంట్ మ్యాటర్
ఒకప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచన. ఇంట్లో
చెప్తే ఏమంటారో! అమ్మను కన్విన్స్ చేసినా.. డాడీని ఒప్పించడానికి హెడ్డు ప్రాణం
హెల్మెట్‌లోకి వచ్చేది. అదీ కండీషన్స్ అప్లయ్ అయితేనే! పదింటిలోగా ఇంటికి
రావాలి. తమ్ముణ్ని వెంట తీసుకెళ్లాలి. డ్రైవర్‌నిచ్చి కారు పంపిస్తామని.. ఇలా
సవాలక్ష షరతులు. కానీ ఇప్పుడు ఫ్రేమ్ మారింది. అమ్మాయిలకు లిబర్టీ పెరిగింది. ఏ
పనిచేయాలన్నా కూల్‌గా చేసేస్తున్నారు. రేపటి గురించి దిగుల్లేదు. డబ్బుల గురించి
భయం లేదు. సర్కిల్ పెరిగింది. ఆడామగా పట్టింపుల్లేవ్. పేరెంట్స్ నుంచి పెద్దగా
ఆబ్జెక్షనూ లేదు. మెల్లిగా డే పార్టీల నైట్ పార్టీలకు షిఫ్ట్. మొదట్లో సాఫ్ట్
డ్రింక్.. డాన్స్ లాంటివి మాత్రమే ఇష్టపడేవాళ్లు. క్రమంగా కింగ్ ఫిషర్ కార్క్
ఊడింది. నాలుక కొసన డ్రాప్ పడింది. చేదు చేదుగా.. చప్పచప్పగా చుక్క గొంతు
జారింది. కండ్లు వాటంతట అవే మూతపడ్డాయి. ఒక్కో డ్రాప్ పెరిగింది. వ్యవహారం జగ్గుల
దాకా వచ్చింది. తర్వాత కన్ను జిన్ను మీద పడింది. స్లోగా వైన్ మీదా సైన్ చేశారు.
జగ్గు పోయి పెగ్గొచ్చింది. మరో చేయి ఖాళీగా ఉంది. లోపమేంటో తెలుసుకునేలోపు పొగలు
గక్కుతూ సిగరెట్ వచ్చి పడింది. ఇంకేముంది .. రీమిక్స్ లో రాక్ అండ్ రోల్!
మత్తులో పడి గమ్మత్తుగా చిత్తు. గోల్డ్ ఫ్లేక్ మంటల్లో పడి బూడిద. ఇక్కడ ఇంకో
కొత్త విషయం ఏంటంటే.. పబ్బుల్లో మగాళ్లకంటే ఎక్కువగా మగువలే.. కనిపిస్తున్నారట.
ఊరికే కాదు.. మందు కొడుతూ.. సిగరెట్ తాగుతూ.. తెగ ఎంజాయ్ చేస్తున్నారట. ఓ పత్రిక
సర్వేలో తేలింది. అలాంటి వాళ్లలో చాలామంది పదిహేను పదహారేళ్లలోపు వారేనట. అప్పటికే
ఏ విస్కీ టేస్ట్ ఏంటో.. ఏ బీర్ ఎప్పుడు కిక్ ఎక్కుతుందో తెలిసిపోయిందట. ఇంకొన్ని
సంపన్నవర్గాల్లో అయితే పేరెంట్సే పిల్లలకి మందు ప్రాసన చేయిస్తున్నారని తేలింది.
నాటోన్లీ టీనేజర్స్. పెళ్లయిన వారూ.. వర్కింగ్ విమెన్స్ లోనూ
ఆల్కాహాలిజం పెరిగిపోతున్నది. స్టడీస్ నుంచీ.. స్ట్రెస్ నుంచీ.. ఒంటరితనం
నుంచీ.. పీర్ ప్రెజర్ నుంచీ.. ల్యాక్ ఆఫ్ పేరెంటింగ్ స్కిల్స్ నుంచీ.. ఇలా
ఒక్కోదాన్నుంచి దూరంగా పోవడానికి మందుకి దగ్గరవుతున్నారు.
ఒకప్పుడు ఉత్తరాదిన కనిపించేదీ కల్చర్. ఇప్పడది నార్త్ సౌత్ అన్న
తేడా లేకుండా స్ప్రెడ్డయింది. వీకెండొస్తే చాలు.. హైదరాబాద్‌లో ఉన్నామా.. లేక
ముంబైలో ఉన్నామా అర్ధం కాని పరిస్థితి. నగరాల్లో క్యాచ్ అప్ మీ అంటూ బార్లు
బార్లా తెరుచుకుంటున్నాయి. తైతక్కలాడండి అంటూ డిస్కోథెక్కులు పిలుస్తున్నాయి. డీజే
యాంబియెన్స్ గుండెల్లో బాజాలు మోగిస్తున్నది. నిజాకసలు పబ్ అంటే ఏంటి. అంటే అదో
పబ్లిక్ హౌజ్. తినేవాళ్లు తింటుంటారు. డాన్స్ చేసేవాళ్లు చేస్తుంటారు. కొందరు
స్నేహితులతో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటుంటారు. బట్.. ఇప్పుడా డైనింగ్
కాన్సెప్ట్ బోర్ కొట్టేసింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం.. పబ్బింగ్
రెగ్యులర్ లైఫ్‌లో ఒక భాగం. వీక్లీనో బై వీక్లీనో ఉన్న అలవాటు ఇప్పుడు డైలీ
అయింది. హావ్ యూ బీన్ దేర్.. డన్ దట్.. అనే టాగ్ లైన్ ఔట్ డేటెడ్ అయిపోయింది.
యువరక్తం ఉరకలెత్తడంతో పబ్ రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడవి న్యూ జనరేషన్‌కి ఎంటర్‌టైన్‌మెంట్
స్పేసెస్ అయ్యాయి. డిమ్ లైట్.. రాకింగ్ మ్యూసిక్.. డెలీషియస్ ఫూడ్.. వాల్డ్
క్లాస్ డ్రింక్స్.. డాన్స్ ఫ్లోర్..డీజేస్ లైవ్ ప్రోగ్రాం. టోటల్లీ టోటల్లీ..
కూల్ అండ్ ఫన్. అంతటి స్నాజియెస్ట్ ఎట్మాస్ఫియర్‌లో అలసిన దేహానికి స్వాంతన
చేకూర్చుకుంటున్నారు. జీవితంలో మోహమో అనురాగమో మైనస్సయినప్పుడు.. అట్టి లైఫ్‌కి
రంగూ రుచీ వాసనా లుప్తమగును. అప్పుడే కొత్త రంగు కోసం దేహం నిలువెల్లా నగ్నంగా
నిలబడుతుంది. కొత్త రుచుల కోసం నాలుక నాలుగు దిక్కులా సాగుతుంది. తెలియని
వాసన కోసం ముక్కు పుటాలు ఎగిరెగిరి పడుతుంటాయి. జీవితంలో సమస్యలో.. చికాకులో..
అర్ధం చేసుకోని మనుషులో.. చదువులో.. ప్రేమలో.. పెళ్లిళ్లో.. సెండవ్వని
ఎస్సెమ్మెస్సులో! ఏదో ఒకటి చాలు.. మనల్ని కొత్త లోకంలోకి నెట్టేయడానికి. అలాంటి
ప్రెజరే ఇలాంటి కొత్త బంగారు లోకానికి బాటలు వేస్తుంది.
అమ్మాయిల లైఫ్ స్టయిల్ మారిపోయింది. ఇంకా పాతకాలం అమ్మాయిల్లా నేల
మీద గోటితో బొమ్మలు గీయట్లేరు. తమకంటూ ఓ ట్రెండ్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు.
మగవారితో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పార్టీల్లో పార్టిసిపేట్
చేస్తున్నరు. మందు కొడుతున్నారు. సిగరెట్ తాగుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది.
కానీ ఎటొచ్చీ ఈ బూజింగ్‌తోనే అమ్మాయిలు లైఫ్ లాస్ అవుతున్నారు.
చెడు అలవాట్లున్నంత మాత్రాన చెడ్డవారని కాదు. మనసులో కోరికల్ని
నిగ్రహించుకున్నప్పుడే వాటికి మనం బానిస కాకుండా ఉంటం. అంటే ఇక్కడేదో జాతికి
సందేశం ఇవ్వాలని కాదు ఉద్దేశం. జరిగిన వాస్తవాలు వింటే షాకవుతారు. ఒక పదిహేనేళ్ల
అమ్మాయి తన గోడు ఇలా చెప్పుకుంది. మా పేరెంట్స్ రోజూ డ్రింక్ చేస్తారు. కానీ
నాకది అస్సలిష్టం లేదు. ఓ రోజు బలవంతంగా తాగించారు. అలా రోజూ జరిగేది. క్రమంగా
నేనూ దానికి అడిక్టయ్యాను.. అంటూ గుడ్ల నీరు కుక్కుకుంది. ఇది మరో అమ్మాయి
దీనస్థితి. ఆ పిల్ల ఒకడ్ని ప్రేమించింది. వాడు పెద్ద తాగుబోతు. డ్రగ్స్ కి అలవాటు
పడ్డాడు. ఈ విషయం అమ్మాయికి తెలియదు. ఓసారి పబ్‌లో బలవంతంగా తాగించాడు. మైకం
కమ్మింది. పూర్తిగా కాన్షియస్ కోల్పోయింది. ప్లాన్ ప్రకారం తనని ఎంతమంది
లొంగదీసుకున్నరో.. తెల్లారింతర్వాతగానీ తెలిసిరాలేదు. కానీ ఏం లాభం.. జరగాల్సిన
నష్టం జరిగిపోయింది. ఫ్యామిలీ ఫ్రెండనీ.. ఫ్రెండ్ వాళ్ల ఫ్రెండనీ.. వెళ్లి
జీవితానికి సరిపడా కన్నీళ్లను మిగుల్చుకుంది. ఇలాంటి అమ్మాయిలు హై సొసైటీలో
బోలెడంతమంది. ముందుగా సిగరెట్‌కీ.. ఆ తర్వాత మందుకీ.. ఆపై డ్రగ్స్ కీ బానిసై లైఫ్‌ని
నాశనం చేసుకుంటున్నారు. ఇందులో కొందరు ఎయిడ్స్ బారిన పడి అర్ధాంతరంగా తనువు
చాలించిన వారూ లేకపోలేదు. ఇదంతా సంపన్నవర్గాల్లో కామనే కావొచ్చు. ఎబో మిడిల్
క్లాస్ అమ్మాయిల పరిస్థితేంటి? వారిలా రోజూ కాకపోయినా ఎప్పుడో ఓసారి పబ్‌కి
వెళ్తారు. అప్పుడు ఇలాంటి అమ్మాయిల్ని చూసి ఇన్‌ఫ్లుయెన్స్ కారని గ్యారెంటీ ఏంటి?
బోర్‌డమ్ నుంచి ఫ్రీడమ్ కావాలనుకోవడం తప్పు కాదు. అమ్మాయిలు డ్రింక్
చేయడం.. సిగరెట్ తాగడం నేరమని ఎవరూ అనట్లేదు. అది వారి వారి పర్సనల్. మందు..
సిగరెట్ ఒక్క మగాడి కాపీరైట్ హక్కులేం కావు. హై ఫై సొసైటీలో అంతా టేకిటీజీ. అలా
అని అక్కడుండే అమ్మాయిలంతా తాగుబోతులనీ అనలేం. ఇది కొందరి కాన్సెప్ట్ మాత్రమే.
వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ అనే హాసిని టైప్ అమ్మాయిలూ ఉన్నారు.
ఎటొచ్చీ ఈ బూజింగ్ విషయంలోనే గళ్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే
చెప్పడానికి ఇంకా ఏమీ మిగలదు.
గానుగెద్దు డాడీ
కొడుకు డాక్టర్. క్లోరోఫాం బదులు వేరే మత్తు మందు కనుక్కున్నాడు.మనుషుల మీద ప్రయోగం చేసి విజయవంతమైనట్టు రుజువు చేస్తేనే గాని మార్కెట్లో పేటెంట్ దొరకదు. చూస్తూ చూస్తూ అలాంటి ప్రయోగానికి ఏ మనిషి ఒప్పుకొంటాడు? కానీ అతని తండ్రి అంగీకరించాడు. ఆ ప్రయోగం సక్సెసయింది. ఆపరేషన్ జరుగుతున్నంతసేపూ ఆ తండ్రి చిరునవ్వుతో అలా ఉండిపోయాడు. వచ్చిన వాళ్తంతా ఓకే అని వెళ్లిపోయారు. వెంటనే తండ్రిని కావలించుకుని కొడుకు వలవలా ఏడ్చాడు. కంగారులో డోస్ ఎక్కువిచ్చాను నాన్నా! నువ్వు బాధతో విలవిల్లాడుతుంటే తట్టుకోలేకపోయాను.. అని దీనంగా అన్నాడు. దానికి తండ్రి నవ్వి.. నిజంగా నాకే బాధా అనిపించలేదు కన్నా!నువ్వు సక్సెస్ కావాలని ఓర్చుకున్నానంతే అన్నాడు. అదీ తండ్రి మనసంటే.
ఎప్పుడూ పనీ పనీ పనీ. అస్తమానం గొడ్డుచాకిరీ. గానుగెద్దులా
కష్టపడుతునే ఉంటాడు. తనకోసం ఏమీ దాచుకోడు. బటన్ ఊడిపోయినా బట్టలు ఇస్త్రీ లేకున్నా
చెప్పులు తెగిపోయినా ఆఖరికి అమ్మ లంచ్ బాక్స్ సర్దలేకపోయినా.అన్నిటినీ భరిస్తాడు. అందరి బరువుల్నీ మోస్తాడు. దుఃఖమొస్తే రెప్పల
మాటున గుంభనంగా దాచుకుంటాడు. అతనే నాన్న. అమ్మతనం వెనుక ఎంత పెయిన్ ఉందో.. నాన్న కావడం వెనుకా అంతే బాధుంది.
అమ్మ మనసు బంగారమే. కానీ
నాన్న మనసు కూడా. కన్నీళ్లూ కష్టాలూ ఒక్కసారిగా
ముసిరినప్పుడు, భద్ర గుండె బరువెక్కినప్పుడు, నువ్వే గుర్తొస్తావు నాన్నా. నీ పోరాట పటిమ
గుర్తొస్తుంది. నువు ప్రయాణించిన వేల మైళ్లు
గుర్తొస్తాయి. అమ్మ ఒడిలో తొలిపాఠాలు నేర్చినా నీ
చిటికెన వేలు పట్టుకునే ప్రపంచమంతా తిరిగొచ్చింది. ఏ
కళ్లజోడులోంచి మాకు భవిష్యత్ చూపించాలో అని నువు పడ్డ
తపన ఎప్పటికీ మరిచిపోలేం. మా లేత పాదాలతో నీ గుండెల మీద
తంతూ ఆడుకుంటుంటే నీ కళ్లలో మెరిసిన మెరుపుందీ.. అది
ఎప్పటికీ నన్ను వెంటాడుతుంటుంది. పిల్లల విషయంలో లేని
కాఠిన్యాన్ని ప్రదర్శించి నువ్వొక గుండె లేని బండోనివైనావు. వర్కనో ఉద్యోగమనో ఓటీలనో క్యాంపులనో పొద్దున్నే వెళ్లిపోతావ్. ఏ అర్ధరాత్రో చడీ చప్పడు చేయకుండా ఇంటికొస్తావు.పిల్లలు
నిద్ర లేస్తారని అమ్మతో కూడా పెద్దగా మాట్లాడవు. నువ్వు
గానెగెద్దు డాడీవి. నువ్వొక అరవ చాకిరీచేసే
వెర్రిబాగులోడివి. అవసరం వస్తే అడుక్కోవడం కూడా
చేతగానోడివి. అమ్మ సంతోషం కోసం ఎంత బాధైనా పడేవాడివి. కూతరంటే హడలి చచ్చేవాడు. కొడుకంటే బెదిరి పోయేటోడు. కడుపున పుట్టిన
వాళ్లకు కూడా అణిగిమణిగి వుండేటోడు. అన్నింటికి కలిపి ఒక్కటే పేరు తండ్రి
బుజ్జాయిని మొదటి సారి ఎత్తుకుని తండ్రి
నిశ్శబ్దంగా నవ్విన శబ్దాన్ని మించిన సుస్వరం ఎక్కడైనా ఉందా? అప్పుడే పుట్టిన పసిపాప ఏడుపును హాస్పిటల్ వరండాలో
గోడకానుకుని నిల్చుని విన్న క్షణాల్ని ఎవరైనా మరిచిపోతారా?
ఓదార్పు మాత్ర
కమిట్మెంట్లూ
కన్ఫెషన్ స్టేట్‌మెంట్లూ లేనప్పుడు
లిట్రల్లీ
ప్రేమంటే తోటకూర కట్టే
సాయంకాలానికల్లా వడలిపోయే చెత్తే
హాస్టల్ గేట్ కిర్రు చప్పుళ్లు
పచ్చపూలు పరుచుకున్న క్యాంపస్ పేవ్‌మెంట్లపై
అడుగులో అడుగేస్తూ నడిచిన అనుభూతులు
బండల మీద కూచుకుని
తడిగుండెలు డ్రై బెట్టుకున్న క్షణాలు
నీ కర్చీఫ్ ఆమెదై.. ఆమె స్కార్ఫ్ నీదై
సమూహంలో ఏకాంతమై
చేజారుతుందని తెలిసినా మమేకమై
వద్దురా...
భళ్లున పగలడానికే కలలున్నప్పుడు
ఎర్లీ మాణింగ్ డ్రీమ్ మీద
ఎందుకురా అంత అభిమానం ఎర్రివాడా
నిజమే..
వీడ్కోలు పలకడానికి చాలా కేలరీస్ ఖర్చవుద్ది
మొహం మీద దఢేల్‌మని తలుపులు పడితే
తలపుల వీడ్కోలు స్వేచ్ఛాగీతమెలా పాడుతుంది
గుండెకు గునపాలు కొత్తవి కానప్పుడు
మార్చుకో
ఏ టెన్నిసో వెన్నిసో ఆడు
అక్కడ నీ ఐడియాలజీ తగిలించుకోడానికి
పాత మొహాలకు అహంభావప్రాప్తి కలగకపోతే
లేచిపో
రహస్య స్థావరాలు లేకున్నా పర్లేదు
పెన్నులో ఇంకున్నంత వరకూ
గుండెలోకి ఇంకేదంతా డ్రీమ్ సాంగే
సిరల్లో గుండె పొరల్లో అరల్లో
పిల్లో జాబిల్లో నీ వళ్లో పడ్డా ఎన్నెల్లో
సాంగురే బంగారు రాజా
నీవొక ఆశ్రమవాసివి కాదు
నీ హృదయం పలకనిది కాదు
నీ దాహం తీరనిది
బాధ తీయనిదైనప్పుడు
తరచి తరచి రివైండ్ చేసి ఆస్వాదించొచ్చు
లేదంటే ఏక్ పాజ్ బటన్ దబావో!
కచ్చా రమ్ము గోల్డ్ ఫ్లేక్ దమ్ములో కలిపేసెయ్
యాష్ ట్రేలో నలిపేసెయ్
ఏమో..
ఇవాళ తప్పనుకున్నది
రేపు కరెక్ట్ కావొచ్చేమో!!
కన్ఫెషన్ స్టేట్‌మెంట్లూ లేనప్పుడు
లిట్రల్లీ
ప్రేమంటే తోటకూర కట్టే
సాయంకాలానికల్లా వడలిపోయే చెత్తే
హాస్టల్ గేట్ కిర్రు చప్పుళ్లు
పచ్చపూలు పరుచుకున్న క్యాంపస్ పేవ్‌మెంట్లపై
అడుగులో అడుగేస్తూ నడిచిన అనుభూతులు
బండల మీద కూచుకుని
తడిగుండెలు డ్రై బెట్టుకున్న క్షణాలు
నీ కర్చీఫ్ ఆమెదై.. ఆమె స్కార్ఫ్ నీదై
సమూహంలో ఏకాంతమై
చేజారుతుందని తెలిసినా మమేకమై
వద్దురా...
భళ్లున పగలడానికే కలలున్నప్పుడు
ఎర్లీ మాణింగ్ డ్రీమ్ మీద
ఎందుకురా అంత అభిమానం ఎర్రివాడా
నిజమే..
వీడ్కోలు పలకడానికి చాలా కేలరీస్ ఖర్చవుద్ది
మొహం మీద దఢేల్‌మని తలుపులు పడితే
తలపుల వీడ్కోలు స్వేచ్ఛాగీతమెలా పాడుతుంది
గుండెకు గునపాలు కొత్తవి కానప్పుడు
మార్చుకో
ఏ టెన్నిసో వెన్నిసో ఆడు
అక్కడ నీ ఐడియాలజీ తగిలించుకోడానికి
పాత మొహాలకు అహంభావప్రాప్తి కలగకపోతే
లేచిపో
రహస్య స్థావరాలు లేకున్నా పర్లేదు
పెన్నులో ఇంకున్నంత వరకూ
గుండెలోకి ఇంకేదంతా డ్రీమ్ సాంగే
సిరల్లో గుండె పొరల్లో అరల్లో
పిల్లో జాబిల్లో నీ వళ్లో పడ్డా ఎన్నెల్లో
సాంగురే బంగారు రాజా
నీవొక ఆశ్రమవాసివి కాదు
నీ హృదయం పలకనిది కాదు
నీ దాహం తీరనిది
బాధ తీయనిదైనప్పుడు
తరచి తరచి రివైండ్ చేసి ఆస్వాదించొచ్చు
లేదంటే ఏక్ పాజ్ బటన్ దబావో!
కచ్చా రమ్ము గోల్డ్ ఫ్లేక్ దమ్ములో కలిపేసెయ్
యాష్ ట్రేలో నలిపేసెయ్
ఏమో..
ఇవాళ తప్పనుకున్నది
రేపు కరెక్ట్ కావొచ్చేమో!!
Subscribe to:
Posts (Atom)