Tuesday 15 January 2013

భగ్నప్రేమ లేఖ

రాతి పుప్పొడి రాతల
ఆఫ్రికన్‌ పోయెట్రీ
పారిస్‌ నగర వీధుల్లో అమ్మకం
బై వన్‌ గెట్ వన్‌
అయినా
ఐ హేట్ యువర్ ఫేక్ స్మయిల్
ఒకే రెక్కతో పుట్టిన ప్రేమ
ఎవరికీ పట్టని నట్టనడి ఎడారిలో
తడారిన గొంతుతో ఎర్రెర్రగా ల్యాండైంది
అలాంటప్పుడు నవ్వు
సమశీతోష్ణమండలంలో
మాంటేజ్‌ సాంగ్ ఎలా పాడుతుంది?
పోగొట్టుకున్న కాలం రూఫ్‌ కింద
a poem for beloved
స్మృతి మరకల్ని సిరాతో బరబరా
తాజ్‌మహల్ అల్మరాల్లోంచి
భగ్న ప్రేమలేఖలన్నీ
వేడి వెన్నెల జ్వాలల్లోకి
నీ చెత్త భౌతిక భావజాలాన్ని
గతితప్పిన తార్కికవాదాన్ని
నెత్తినేసి కొట్టుకుంటే
ఐదో పెగ్గు దగ్గర నిద్రొచ్చింది
లేచి చూస్తే శిశిరం ప్రసవించింది
వసంతంలో స్వీయసౌఖ్యానంద సిద్ధాంతం
అంచేత భక్తజనులారా..
సౌందర్యం నుంచి సౌఖ్యాన్ని కోరుకుంటే
అట్టి ప్రతిపాదన దుఃఖానికి మూలహేతువగును
(please note above mentioned bottom lines)              

4 comments:

  1. సౌందర్యం నుంచి సౌఖ్యాన్ని కోరుకుంటే
    అట్టి ప్రతిపాదన దుఃఖానికి మూలహేతువగును
    really? :)
    just kidding, i like the ending. baagundandi.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రమేశ్‌గారూ....

      Delete