Tuesday, 9 July 2013

హలో.. దిసీజ్ మై విజిటింగ్ కార్డ్‌!


కొత్త పాస్‌వర్డ్
కొత్త డిక్షన్‌
వస్తువు చిత్రణలో 
స్పానిష్‌ పెయిటింగ్‌ 
అక్షాంశ రేఖాంశాల చట్రంలోంచి 
బయటపడ్డ సాల్వెడార్‌ శిల్పం
నడకల చుట్టూ ఆధీన రేఖలు మాయం
అయినా
జెండాలెత్తిన జెండర్లంతా
డిసెక్షన్‌ బాక్సులతో తయార్‌
ఆ సెక్షన్‌ వాళ్లంతా
సామూహిక దుఃఖితులేనంటావా
అయితే కానీ,
అర్ధ జాగృత విహంగులంతా
నిష్ఠూరపు సంస్మరణ సభలుపెట్టి
గుంపులు గుంపులుగా రోదించనీ
ఉర్రూతలూగించే
ప్రత్యామ్నాయ పరవళ్లను ఆపకు
పాండురోగుల కోసం
ప్రాచీన వాక్యాలెందుకు
పిడికిలి సడలితే
రాత్రిని ఏలుకోవడం కష్టం
సర్రయలిజం అంటేనే పచ్చి నిజమ్
అధివాస్తవికతలో జరా మరణ జమ్
కత్తిదూస్తే సిరాచుక్కలో
సునామీ చెలరేగాలి
హలో ..
దిసీజ్ మై విజిటింగ్ కార్డ్‌!


3 comments:

  1. https://www.youtube.com/watch?v=SVO2HrBB9nU

    lyrics post chesta..

    ReplyDelete
  2. కొత్త డిక్షన్...సిరాచుక్కలో సునామి ....ఆధీన రేఖలు మాయం ...సామూహిక దుఖితులు ....అధివాస్తవికత ....

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయం చాలా షార్ప్‌ గా ఉంది సూర్య ప్రకాశ్‌ గారూ..

      Delete