అల్ఫ్స్ పర్వతాల అంచుల్లో
లార్జ్ స్కేల్ షూటవుట్
ఫ్లెష్ ఆర్కిటెక్చర్
బాడీ ఆఫ్ ఇన్‌స్టాలేషన్
ఎస్కిమోల నరాల్లో ఉక్కపోత
ఏయ్.. నీపేరు
స్పెన్సర్ ట్యూనిక్ కదా!
న్యూడిజం అంటే...
నువ్వనుకున్నది కాదు తమ్మీ!?
Please use it sensibly!
బాడీ స్కల్‌ప్చర్‌లో
సోషల్ కాన్షియస్
మెక్సికో వీధుల్లో
నథింగ్ టు సీక్రెట్
కొన్ని కొలరాడోలు
ఇంకొన్ని కిలిమంజారోలు
ఇన్నర్ ఫ్రేగ్రెన్స్
వీచికలో
సింగిల్ లైన్ యవ్వన గీతం
ఇన్‌బిల్ట్ మెమొరీలో
పక్కకు జారిన పైటకొంగు
మౌంటెయిన్ మీద షిఫాన్ పరికిణి
కేన్స్ ఫెస్టివల్‌లో క్రష్డ్ ఫ్యాబ్రిక్
నయాగరా కింద బికినీ బాత్
లోటస్సరస్సు వొడ్డున
న్యూడ్ పిక్స్ గ్యాలరీ
వింటావా?
ద ఎటెర్నల్ నేక్‌డ్ ట్రూథ్
-----------------
మైండు దొబ్బిందా !
మూతికి మూడు కుట్లేసుకో
లేకుంటే,
నడ్డిమీద ముద్దెర్లేసి
పిరమిడ్ మధ్యలో నిలబెడతారు
అప్పుడు పాడుకుందువుగానీ-
నల్లాచీర నల్లారైక
నాలుగ్గొంటగా తానమా అని!!
No comments:
Post a Comment