రాతి పుప్పొడి రాతల
ఆఫ్రికన్ పోయెట్రీ
పారిస్ నగర వీధుల్లో
అమ్మకం
బై వన్ గెట్ వన్
అయినా
ఐ హేట్ యువర్ ఫేక్ స్మయిల్
ఒకే రెక్కతో పుట్టిన ప్రేమ
ఎవరికీ పట్టని నట్టనడి
ఎడారిలో
తడారిన గొంతుతో ఎర్రెర్రగా
ల్యాండైంది
అలాంటప్పుడు నవ్వు
సమశీతోష్ణమండలంలో
మాంటేజ్ సాంగ్ ఎలా
పాడుతుంది?
పోగొట్టుకున్న కాలం రూఫ్
కింద
a poem for beloved
స్మృతి మరకల్ని సిరాతో
బరబరా
తాజ్‌మహల్ అల్మరాల్లోంచి
భగ్న ప్రేమలేఖలన్నీ
వేడి వెన్నెల జ్వాలల్లోకి
నీ చెత్త భౌతిక భావజాలాన్ని
గతితప్పిన తార్కికవాదాన్ని
నెత్తినేసి కొట్టుకుంటే
ఐదో పెగ్గు దగ్గర
నిద్రొచ్చింది
లేచి చూస్తే శిశిరం
ప్రసవించింది
వసంతంలో స్వీయసౌఖ్యానంద
సిద్ధాంతం
అంచేత భక్తజనులారా..
సౌందర్యం నుంచి సౌఖ్యాన్ని
కోరుకుంటే
అట్టి ప్రతిపాదన దుఃఖానికి
మూలహేతువగును
(please
note above mentioned bottom lines)
good one:-)
ReplyDeletethanq v.much padmarpitha garu.......
Deleteసౌందర్యం నుంచి సౌఖ్యాన్ని కోరుకుంటే
ReplyDeleteఅట్టి ప్రతిపాదన దుఃఖానికి మూలహేతువగును
really? :)
just kidding, i like the ending. baagundandi.
ధన్యవాదాలు రమేశ్‌గారూ....
Delete