Monday 17 September 2012

ఈ సమాధిని ఎవరూ తాకకండి!


కవిత్వం ఇప్పుడిప్పుడే తగలబడుతోంది
అక్షరాలన్నీ అర్ధ నిమీళిత నేత్రాలతో
నిశ్‌చల సరోవరంలో వయోలిన్‌ విషాదం
బాధాతప్త తంత్రుల్లో గాథాసప్తశతి(1)
దేహమంతా కమ్మరి కొలిమి
జ్వరాన పడి వళ్లంతా కాలిపోయింది
గుండెను ఎవడో పీలర్‌తో లాగేశాడు 
ఈసారి కవిత్వం పూర్తిగా దగ్ధమైంది
అక్షరాలన్నీ సైకత శిల్ప సమాధిలోకి
వాడిపోయిన సన్నజాజుల మీద సోఫియా విమెన్‌ (2)
లంగ్స్‌ నిండా ఇన్నర్‌ ఫ్రాగ్రెన్స్‌
పక్కకి తొలగిన పైటకొంగు  
వక్షస్థలంమీద ఎప్పటిదో గాయం  
వళ్లంతా వరంగల్‌లా వుంది
కృశించిన పక్కబొక్కల నిండా
కమ్మేసిన దుఃఖ తెరచాప
ప్రాచీన స్మృతుల సలపరింత
ప్లీజ్‌.. ఈ సమాధిని ఎవరూ తాకకండి!     
-------------------
(1)- శాతవాహన రాజు హాలుడు రాసిన ప్రేమకథల సంపుటి 
(2) ఇంపోర్టెడ్‌ బాడీ స్ర్పే

3 comments: