Sunday 23 September 2012

వరంగల్‌లో గూగుల్!!


వరంగల్. శిలాసదృశమైన భూమి పొరల్లో దక్కన్  పీఠభూమికి ప్రతినిధిలా కనిపిస్తుంది. కార్పొరేట్‌ పోకడలను ప్రోది చేసుకుని తనకు తాను ముస్తాబుచేసుకున్న నగరం.  తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల తర్వాత స్థానం వరంగల్‌దే!  ప్రపంచీకరణలో ఆర్ధిక పరిణామాలు కనిపించినట్టే.. వరంగల్ అభివృద్ధిలో కూడా భిన్న అంశాలు మేళవిస్తాయి. చరిత్ర తవ్వడానికి ఇదొక సాహిత్య వనరు. గతించిన కాలానికి ఇదొక చారిత్ర సాక్ష్యం. ఇలా చరిత్ర సంస్కృతి భాషా సాహిత్యంలో తనదైన ముద్రని వేసుకుని ముందుకు కదులుతున్న వరంగల్ నగరం.. ఇప్పుడు గూగుల్ చేయి పట్టుకుని టెక్నాలజీ పులుముకుంటోంది. అవును.. సమాచార సాంకేతిక విప్లవం సామాన్యుడికి ఉఫయోగపడే అపూర్వ ప్రాజెక్టు వరంగల్లో ప్రారంభమవుతోంది. అమెరికా, బ్రిటన్ లాంటి  దేశాల్లోని కొన్ని నగరాల్లో, మనదేశంలో కొంత మేర ఢిల్లీలో.. అంతంతమాత్రంగా హైదరాబాద్‌లో అమలవుతున్న  ప్రాజెక్టు కోసం గూగుల్ ఇప్పుడు కొత్తగా వరంగల్ నగరాన్ని ఎంపిక చేసుకుంది. 

No comments:

Post a Comment