Saturday 5 October 2013

తాటివైన్‌ తాగిన తాజా అనుభూతి

తాటివైన్‌ తాగిన తాజా అనుభూతి
ఆత్మ ఎప్పటికప్పుడు రిఫ్రెషింగ్
పాటల క్రూరత్వంలో ఇంద్రియాల ఉపశమనం
మిర్రర్‌ క్లౌడ్ మీద సిల్వర్‌ పూత
రిలెంట్‌లెస్‌ డాన్స్ విత్ డాఫొడిల్స్
మెట్టతామర పూలతో గాఢాలింగన చుంబనం
చుట్టూ కొండగాలుల ఘాటు పరిమళం
ఎక్స్ బ్లాస్ట్‌ స్కోర్‌ 1157 అయితే ఏంటి

చీకటి సముద్రంలో తప్పిపోయిన నావికుడి సాహిత్యం
ఆండీస్‌ పర్వత శ్రేణుల్లో ఎకోలై ప్రకంపిస్తోంది
ఒంటరి మేఘమై తీరం పక్కన తచ్చాడుతుంటే
ఒక భయంకరమైన 21వ శతాబ్దపు అర్ధరాత్రి
వాడిపోయిన గులాబీ పువ్వై ఏడ్చింది

ముసురు పట్టిన అసుర సంధ్యవేళ
బ్రాందీ సీసాల మూతలు తీసే టైం
ఎవ్రీ లైన్‌ విల్ బీ కంపోజ్డ్‌ ఇన్‌ సింఫొనీ
ఒక ఇన్‌ఫీరియర్ పోయెట్‌గాడెవడో
నా పద్యాన్ని పదేపదే కెలుకుతున్నాడు

పిచ్చినా మై డియర్‌ కవీ..
ఇంక్‌ నెవర్‌ లైస్‌ రా!
ఎప్పుడైనా విన్నవా
దట్టమైన అడవిలో భీకరమైన వర్షం సౌండ్‌ని.... (XVIII-IX-XIII)

2 comments: