Wednesday 15 May 2013

ఇంకెందుకు రోజాపూలు



  
                                   
గుండే నిజమే
కత్తీ నిజమే
నెత్తురూ నిజమే
అయినా ఈ హత్యాకాండని
ప్రేమేనంటావా తమ్ముడూ..
తూనీగ తూనీగ పాటలోకి
లాటిన్‌ పదాలెలా దూరాయి
సుతిమెత్తని ఆమె కరచాలనం
ఊర్వశీ బార్‌ గిలాసలోకి
ఐసు ముక్కలా జారిందేమిటి?
చంద్రుడిలో ఉండే కుందేలు
ఎందుకిలా మట్టి దిబ్బలో పొర్లాడుతోంది!
లోకులు పలు కాకులు తమ్ముడూ
కేకుల్లా పొడుచుకు తిన్నారు!
ఆ నికృష్ఠుడొకడు..
జీవ పరిణామక్రమాన్ని తెలుసుకోమని
తీసుకెళ్లి రుష్యాశ్రమంలో
వదిలేసి వెళ్లాడు
దూరాన కొండమీద
ఉండుండీ మెరుపు  
అర్జునా ఫల్గుణా!!
ఎవడి దారిన వాడు వెళ్లిపోయాడు
ఇంకెందుకీ రోజాపూలు
ఆమె పొడవాటి జడపాయలు
ఎప్పుడో విడిపోయాయి
ఇప్పుడు చెప్పు తమ్ముడూ
దీన్నీ ప్రేమేనంటారా?
                                                      

2 comments:

  1. అంత విడమరచి చెప్పాక ఎలా అంటాను " ప్రేమని ", చెప్పు అన్నయ్యా ... :) చాలా బావుందండి ,


    తరుణ్ ,
    http://techwaves4u.blogspot.in/
    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సుధీర్‌

      Delete