Tuesday 14 May 2013

//నా మరణవార్త //


కంటి కొసన నిప్పు రాజుకుంది
మంటల్లో కొన్ని స్వప్నాలు 
రెండు గ్లిజరిన్ చుక్కలుంటే 
ఒంపవా..
నా మరణవార్త నేనే చెప్పుకుని 
దుఃఖిస్తాను
స్వరపేటికలో 
నెత్తుటిపూల పాట 
నింపుకుంటాను
మృత్యోర్మా అమృతంగమయా!
నీ ఉంగరాల జుట్టుమీద
నాకింకా పిచ్చి పోలేదే..
మరిచిపోయావా..
హిమాయత్‌నగర్
స్ట్రీట్ నెంబర్ 5
పిక్ ఎన్ మూవ్ దగ్గర
వెనక్కి వెనక్కి తిరిగిన చూసిన
దృశ్యాలనేకనేకాలు
అప్పుడు నీ కళ్లలో పూసిన
డిసెంబర్ పూలు
ఇంకా పొరలు పొరలుగా 
నా గుండెలో నవ్వుతునే ఉన్నాయి
వెళ్లేవాళ్లు ఎంత నిర్దయగా పోతారో కదా
మంగళసూత్రాలు కళ్లకద్దుకుని
అందుకే:
మోహావేశ 
ప్రేమాక్రోశ 
దృక్కుల్లోంచి
బయటపడని పద్యాన్ని 
దోసెడు కాయితాలేసి 
తగలబెట్టాను
సమాధికింద 
బుట్టదాఖలైన 
ప్రేమలేఖలు
కొంచెం పక్కకి జరగవా
ముక్కు చీదుకుంటాను..

4 comments:

  1. మీ పోస్ట్ చాలా బావుంది ,మంచి బ్లాగు , చాలా బావుంది , ఇలాంటి కవితలు అందించినందుకు ధన్యవాదాలు ,

    మీకు వీలుచూసుకొని మా బ్లాగును కూడా చూడండి ,

    మీకు ధన్యవాదాలు ,

    http://techwaves4u.blogspot.in/
    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    ReplyDelete
  2. wow...heart touching expressions.

    ReplyDelete