Monday 31 December 2012

వరంగల్ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?



వరంగల్ పేరును ఓరుగల్లుగా ఎందుకు మార్చాలి? ఇప్పటికిప్పుడు అంత అవసరమేంటి? వరంగల్ అని అంటే వచ్చిన నొప్పేంటి? వరంగల్ పేరు పలకడానికి భయమా? వరంగల్ పేరు మార్చాలని అడిగిందెవరు? ఎవరూ అడక్కుండానే వరంగల్ పేరు ఓరుగల్లుగా మార్చడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడుతోంది? ఇప్పటికే హన్మకొండను నాశనం చేశారు. ఇప్పుడు వరంగల్‌కి స్పాట్ పెట్టారా?

వరంగల్. ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. ఆ పేరులో పౌరుషం తొంగిచూస్తుంది. పలుకులోనే రాజసం ఉట్టిపడుతుంది. ఆ గడ్డమీద అడుగుపెడితే చాలు ఎక్కడ లేని రోషం వస్తుంది. వరంగల్ పేరు ఉచ్ఛరిస్తే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వరంగల్ ఒక హిస్టారికల్ నేమ్. కాదుకాదు.. ఇట్స్ ఏ బ్రాండ్.  

వరంగల్‌ని గ్రేటర్ గా మార్చాలని జనం ఎప్పటినుంచో కోరుతున్నా రాజకీయ కారణాల వల్ల జాప్యం జరిగింది. ఎట్టకేలకు కాకతీయ ఉత్సవాల పుణ్యమాని గ్రేటర్ ప్రకటన చేశారు. అయితే సీఎం అలా ప్రకటించాడో లేదో ఇలా వరంగల్ పేరును ఓరుగల్లుగా మారుస్తామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య భారీ భారీ డైలాగులు చెప్పాడు. కాకతీయులు రాజ్యం ఏలినప్పుడు వరంగల్ పేరు ఓరుగల్లుగా ఉండేది కాబట్టి ఇప్పుడూ అదే పేరు పెడతారట. ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా మంత్రులంతా చేయాల్సిందంతా చేస్తారట. మద్రాస్ పేరు చెన్నయ్ గా, బొంబాయి పేరు ముంబయిగా మారింది కాబట్టి వరంగల్ పేరును ఓరుగల్లుగా మారుస్తామనేది ఘనత వహించిన పొన్నాల గారి దిక్కుమాలిన లాజిక్!  అయితే ఇక్కడ అర్ధం కాని విషయం ఏంటంటే.. వరంగల్ పేరు మార్చమని ఎవరూ డిమాండ్‌ చేయలేదు. అందుకోసం సంతకాల సేకరణా జరగలేదు. అసలు ఆ ఉద్దేశమే ఎవరికీ లేదు. ఎవరూ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లనూలేదు. మరి ఉన్నట్టుండి మంత్రులకు వరంగల్ పేరు మార్చాలన్న ఐడియా ఎందుకొచ్చిందో తెలియదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయలంటే ఇవే.  

వరంగల్ పేరు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. ఇప్పుడు పేరు మార్చాల్సిన అవసరమేంటి? వాస్తవానికి వరంగల్ కు ఓరుగల్లుకు పెద్ద తేడా కూడా ఏమీ లేదు. దేశంలోని వేరే నగరాల  పేరు మార్పుకు వరంగల్ కు ముడిపెట్టడం కూడా హేతుబద్దంగా లేదు. తమిళనాడు చెన్నయ్ అయింది కాబట్టి , బొంబాయి ముంబయ్ అయింది కాబట్టి, కలకత్తా కోల్ కతాగా మారింది కావున వరంగల్‌ని ఓరుగల్లు చేస్తామంటున్నారు. ఇంతకంటే దరిద్రపుగొట్టు వాదన మరోటి లేదు. అలా చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నటే ఉంటుంది.  కడపకు వైఎస్‌ పేరు, నెల్లూరుకు పొట్టి శ్రీరాములు పేరు, హైదరాబాద్‌లో ఓ ప్రాంతానికి రంగారెడ్డి పేరు పెట్టాం కాబట్టే వరంగల్ కు ఓరుగల్లు పెడతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట పనికిమాలింది. దేశంలోని వేర్వేరు నగరాల పేరు మార్పు, మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల పేర్ల విషయంతో వరంగల్ కు ముడిపెట్టడం అంతకంటే భావ దారిద్ర్యం మరోటి లేదు. పేరు మార్పు వల్ల ఒరిగేదేమీ ఉండదు. పేరు మార్చినంత మాత్రాన దశాదిశ ఏమైనా మారుతుందా ?

వాస్తవానికి వరంగల్ పేరు వెనక చాలా చరిత్రే ఉంది. ప్రస్తతం వరంగల్ కోట ఉన్న ప్రాంతంలో పెద్ద శిల ఉండేది. దాన్ని అంతా ఏకశిల అని పిలిచే వారు. అందుకే ఆ నగరానికి ఏకశిల అనే పేరు వచ్చింది. వరంగల్ కోటలో శిల్పాలు, కాకతీయ కీర్తి తోరణం చెక్కడానికి వచ్చిన వారంతా తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారు. వారు తమ భాషలో ఏకశిలా నరగాన్ని ఓరుగల్లు అని పిలిచేవారు. ఓరు అంటే ఒకటి, గల్లు అంటే శిల. అందుకే ఏకశిలను వారు ఓరుగల్లు అని పిలిచారు. అదే పేరును వారు శాసనాల్లో కూడా రాశారు.   అయితే చాలా శాసనాల్లో ఓరుగల్లుకు ముందు ఈ నగరాన్ని ఏకశిలా నగరమని, హనుమకొండ అని పిలిచేవారు. కాకతీయులు హనుమకొండ రాజధానిగా పాలించినప్పుడు నగరం పేరు హనుమకొండ. తర్వాత వరంగల్ కు రాజధానిగా మార్చినప్పుడు దాని పేరు ఏకశిలా నగరం. అంటే చరిత్రలో ఓరుగల్లుకు ఎంత పేరుందో హనుమకొండ, ఏకశిలా నగరాలకు కూడా అంతే పేరుంది. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడి కాలం వరకు ఓరుగల్లుగా స్థిరపడింది. తర్వాత వచ్చిన ఢిల్లీ సుల్తానులు, హైదరాబాద్ నవాబులు ఓరుగల్లును ఓర్గల్  అని పిలిచారు. తర్వాత కాలంలో ఓర్గాల్ అన్నారు. రానురాను వారాంగల్ అయింది. చివరికి వరంగల్ గా స్థిరపడింది. వాడుకలో ఓరుగల్లు కన్నా వరంగల్ అని పలకడం తేలిక కావడం వల్లే పేరు మారింది తప్ప ఎవరో ఉద్దేశపూర్వకంగా మార్చింది కాదు. కాబట్టి వరంగల్ పేరు మార్చాల్సిన అవసరం లేదన్నది చరిత్రకారుల అభిప్రాయం.  

19 comments:

  1. mana telugu peru pettukunte andulo problem emundi.

    //వరంగల్ పేరు మార్చాల్సిన అవసరం లేదన్నది చరిత్రకారుల అభిప్రాయం.//

    మీ అభిప్రాయం అని చెప్పొచ్చు కదా .
    మన తెలుగు పేరు పెట్టడానికి, ఎవడో తురకోడు పెట్టినదానికి తేడా ఉంది కదా.నేనైతే ఇదొక్కటే కాదు, ఆ తురకొల్లు మార్చిన అన్ని పేర్లు తిరిగి మన పేరుతొ పెట్టుకోవాలి అని చెప్తాను.

    ReplyDelete
    Replies
    1. మిస్టర్ పిడక గారూ...
      నా అభిప్రాయం కూడా అదే! (మార్చాల్సిన పనిలేదు)
      వరంగల్ అన్న పేరు మీరనుకుంటున్నట్టుగా..
      తురకవాళ్లు పెట్టింది కాదు!!
      ఒక్కసారి టపా మళ్లీ చదవండి!
      వర్గల్ అనే పేరు వాళ్లు(ముస్లింలు) పెడితే
      అది కాలక్రమంలో వరంగల్‌గా మారిపోయింది!
      అది ఉచ్చారణకు కూడా సులువుగా ఉంటుంది.
      అదే పేరు ప్రపంచవ్యాప్తంగా యూనిక్‌గా ఉంది.
      అంతేకానీ..
      పేరు ఎవరు పెట్టారు.. బారసాల ఎవరు చేశారు..
      ఎవరికి క్రెడిట్ చెందుతుందనే విషయలు
      అసందర్భం.. అప్రస్తుతం...!!
      //పేరు మార్చాల్సిన అవసరం ఉందా లేదా అన్నదే పాయింట్//

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  2. మద్రాస్ ని చెన్నై గా, బొంబాయి ని ముంబై గా, Bangalore ని బెంగుళూరు గా , Culcutta ని Kolkatta గా బెజవాడ ని విజయవాడ గా, త్రివేండ్రం ని తిరువనంతపురం గా , బెనారస్ ని వారణాసి గా మార్చడానికి కారణం ఏంటో తెలుసా మీకు ? 'మన ' అనే భావన.
    బానిస సంకెళ్ళు తెంచుకుని బయటకి రావడమే కాదు, అవి మన సంస్కృతీ , సంప్రదాయాల మీద వేసిన గుర్తులుని కూడా మెల్లగా చెరుపుకుంటూ వెళ్ళాలి. ఉచ్చారణ కి బాగుంది అని మన ఊరి పేరు మర్చుకోము కదా.
    మనల్ని పాలించిన వాళ్ల నాలుక కొంచెం మందం కాబట్టి మన ఊరిపేరు మార్చేసారు. కాని మన నాలుకలు బాగానే ఉన్నాయి కదా.

    ఓరుగల్లు అన్న పదం తెలుగు పదం కాదని ఎలా నిర్దారించారు. తెలుగు బాష లో చాల పదాలు సంస్కృతం నుండి వచ్చినవే కదా. తెలుగ ఒక్కటే కాదు, ద్రావిడ భాషలు సంస్కృతం తో ప్రభావితం అయ్యాయని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఒక పేపర్ తీసుకుని, అదే నిజమని నిర్దారించేసి దానిని చరిత్ర కారుల అభిప్రాయం చేసేసిన మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావడం లేదు.
    ఈ లింక్ చుస్తే మీకు తెలుస్తుంది. ఇలా ఒక చర్చ పెట్టకుండా, తెలిసినవి,విన్నవి మన సొంత కవిత్వం జోడించి రాసేయకండి.
    http://kinnerasani.blogspot.de/2009/01/blog-post_14.html

    Note: Please remove word verification.

    ReplyDelete
    Replies
    1. పేరు మారనంత మాత్రాన
      ఇంకా బానిసలుగా ఉన్నామనుకోవడం ఒకింత బానిస భావనే!
      ఉచ్ఛారణ బాగుందని పేర్లు మార్చుకుంటూ పోవద్దని నేనూ అంటున్నాను..
      అయినా ఓరుగల్లు తెలుగు పదమా తమిళ పదమా అన్న చర్చలోకి పోలేదు!
      కాలక్రమంలో అది మారుతున్న తీరుని మాత్రమే ప్రస్తావించాను...
      అయినా పేరు మార్చాలంటే ఒక్క ఓరుగల్లుని మాత్రమే ఎందుకు లెక్కలోకి తీసుకోవాలి?
      అంతకు ముందున్న హనుమకొండను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
      మన నాలుక ఎటు పడితే అటు మళ్లుతుందని
      వరంగల్‌ని ఓర్యుంగ్యల్ అని మార్చలేం కదా!!
      ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే..
      పొన్నాల స్టేట్‌మెంట్ చేసినప్పుడు
      స్పాట్‌లో ఉన్నాను కాబట్టి రాశాను!
      విన్నవో కన్నవో కాదని మనవి...



      Delete
    2. అయ్యా పిడక గారు.. ద్రవిడ భాషల గురించి బాగానే చెప్పారు. ఓరుగల్లును.. జనబాషలో.. ఐమీన్‌.. సాధారణ గ్రామీణులు పలికే విధంగా ట్రై చేసి చూడండి. ఓరుగల్‌.. ఓరుంగల్‌.. గా ఉచ్ఛారణ మారిపోతుంది. ఆ ఓరుంగలే .. మీరనే తురకోడికి పలకడం రాక.. వోర్గాల్‌.. వోరాంగల్‌గా మారింది. చివరికి వాడు వరంగల్‌ దగ్గర ఫిక్సయ్యాడు. ఐతే.. వాడు వరంగల్‌ అన్న ఓరుంగల్‌ అన్న పలకడంలో పెద్ద తేడాలేదు కాబట్టి .. జనాలకు వరంగల్‌ కనెక్టైంది. ఇప్పుడు దాన్ని మార్చి సాధించేది ఏమీ లేదు. అదే పైన టఫా ఉద్దేశ్యం. గమనించండి.

      Delete
    3. HAI PIDAKA GARU

      MIRU CLEAR GA CHADHIVITHE ARDHAM AVUTHUNDHI WARANGAL NIRMANA SAMAYAM LO TAMIL BROTHERS KANNADA BROTHERS KALISI VACHARU VALLALO THELUGU BROTHERS KALISI ORU - GAL OR KAL. IPPUDU BEDHALUNNA APPUDU PAPAM VALLU BASHA ARDHAM CHESUKUNNARU ANDHUKE DHRAVIDA BASHALU ENTHO KONTHA EQUAL ALAGA PALUKAGA RANU RANU MARINDHANI PAINA CHEPPINADHANI SARAMSHAM IKA NUVVU PETTINA BLOG LO KUDA MEANING ADHE KAKPOTHE TAMIL ANNDU IKKADA KANNDA EDHO OKATI. VALLE PETTARU IPPUDU MARCHUKONI EMCHESTAM NUVVANNATU CHALA PERLU MARINAI BUT MA MUSALDHI (GRANDMATHER)MADRAS KADHE CHENNAI ANTE AMMANABUTHULU THITTNDHI CHADHUVU RAKA POINA AME VUDHESYAM UNNA PERU MARCHI INKA CONFUSION CHESTARRAA YEHDAVALU ANDHI ANTE KOTHADHANIKI KOTHA PERU PETTALI KANI VUNNDHANIKI KADHU. KALAKRAMENA KONTHA MANDHI MARINA MADHRASU ANI PALIKE MATALONI MADHURYAM CHENNAI LO LEDHU.CALAKATTHA LO VUNNA POWER KOLKATTA LO LEDHU BOMBAI LO VUNNA BOMBARDING MUMBAI LO LEDHU SORRY FOR TELLING THIS ITS MY OWN EXPERIANCE WITH MY BELOVED GRANDMA OLD OS GOLD DONT MAKE IT ROLD GOLD BY APPLYING NEW COLOR

      Delete
  3. I support ponnala on this name change. I want to change all the names of cities to their previous telugu names.

    ReplyDelete
  4. బాగా చెప్పారు జ్వలిస్తున్న హిమం గారు. వాడుకలో ఉన్న పేరు మార్చడం అంటే పూర్తి గుర్తింపునే ప్రశ్నించినట్లు. తురకలూ, పిడకలూ అని అర్థం లేని వాదనలు చేయకుండా, వాడుకలో ఉన్నదాన్నే ఉపయోగిద్దాం. పొన్నాలకు ఈసారి ఉంది నిప్పుల మీద నడక.

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా చెప్పారు కాయ‌గారూ..
      పొన్నాల‌కు ఈసారి నిప్పుల మీద న‌డ‌కే కాదు
      ఉరికిచ్చుడే....

      Delete
  5. హ హ హ. అది మార్చిన మర్చకపోయిన ఒరిగేది మనకేమి ఉండదు.
    ఇప్పుడు మార్చితే , ఇంకో ఇరవై సంవత్సారాల తరువాత మన ఊరికి ఓరుగల్లు అనే పేరు ఎలా వచ్చింది రా అని పిల్లల్ని అడిగితే కాస్త చరిత్ర చెప్తారు.
    అదే వరంగల్ అనే పేరు ఎలా వచ్చింది రా అంటే..తురకోడు కి పలకడం రాక ఇలా పెట్టాడు అని చెప్తారు.
    వాడెవడో చరిత్ర కాకుండా మన చరిత్ర ని మనం స్మరిన్చుకున్నట్టు ఉంటుంది.
    పేరు మారితే జీవితాలు మారిపోవు.

    ReplyDelete
    Replies
    1. మీ లాజిక్‌కి ఎలా చింతించాలో తెలియక
      నవ్వుతున్నాను పిడక & మన్నం గార్లూ.
      ఇంకో 20 ఏళ్లు కాదుగదా..
      200000000000000 సంత్సరాలైనా
      ఓరుగల్లు చరిత్ర చెరిగిపోదు...
      దాంతోపాటు వరంగల్‌గా ఎందుకు మారిపోయిందో కూడా
      తుడిచిపెట్టుకుపోదు!
      పిల్లలకో, తర్వాత తరానికో తెలియడం కోసం
      ఊళ్లపేర్లను 20ఏళ్లకోసారి మార్చుకుంటూ పోవడం అవివేకం అని
      ఇద్దరికీ మనవి!!!

      Delete
    2. //మన తెలుగు పేరు పెట్టడానికి, ఎవడో తురకోడు పెట్టినదానికి తేడా ఉంది//

      అయ్యా పిడకగారూ... పై కామెంట్‌ చదువుతుంటే
      నాకు కాళోజీ గారి పోయెం ఒకటి గుర్తొచ్చింది...
      -----------------
      వాక్యంలో మూడుపాళ్లు
      ఇంగ్లీషు వాడుకుంటు
      తెలంగాణీయుల మాటలో
      ఉర్దూ పదం దొర్లగానే
      హిహీ అని ఇకిలించెడి
      సమగ్రాంధ్ర వాదులను
      ఏమనవలెనో తోచదు!
      ‘రోడ్డని’ పలికేవారికి
      ‘సడక్‌’ అంటె ఏవగింపు
      ఆఫీసని అఘోరిస్తూ
      కచ్చీరంటే కటువు!
      ‘సీరియలంటె’ తెలుగు
      ‘సిల్సిలా’ అంటె ఉర్దు
      సాల్టు, షుగర్‌, టిఫిన్‌ …తెలుగు
      షక్కర్‌, నాష్ట అంటె కొంప మునుగు!
      ‘టీ’ అంటే తేట తెనుగు
      ‘చా’ అంటే తౌరక్యము!

      బొక్కంటే ఎముక కాదు
      బొక్కంటే పొక్క తెలివి
      బర్రె అంటె నవ్వులాట
      గేదంటే పాలు!
      పెండంటే కొంప మునుగు
      పేడంటేనే ఎరువు!
      రెండున్నర జిల్లాలదె
      దండి భాష తెలుగు!!
      తక్కినోళ్ల నోళ్ల యాస
      తొక్కి నొక్కిపెట్టు తీర్పు
      వహ్వారే సమగ్రాంధ్ర
      వాదుల ఔదార్యమ్ము
      ఎంత చెప్పినా తీరదు
      స్నేహము సౌహార్దమ్ము !!


      Delete
    3. హ హ హ..మీ భుజాలు తడుముకోడం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది.
      నా పై కామెంట్స్ లో ఎక్కడ తెలంగాణా యాసని అపహాస్యం చేయలేదే.
      ఎక్కడ నేను ఉర్దూ లో మాట్లాడుకోవద్దు అని చెప్పలేదు.
      మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పద్యాలూ, పాటలు పాడేస్తున్నారు.
      ఇక్కడ అంత సీన్ లేదు. పేరు మార్చడమా , మార్చకపొవడమా అనేదే చర్చ.
      మిమ్మల్ని ఎవ్వరు అవమానించడం లేదు. ఎవరో అవమానిన్చేస్తున్నారు అని ఆవగింజంత కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
      మీకు నిజాం మీద అంత ప్రేమ ఉంటె ఎవ్వరు కాదనరు.
      కేవలం 12% మంది మాట్లాడే భాష ని 85% మంది మీద రుద్దిన ఆ మహానుభావుడిని స్మరించుకోవడం కూడా మంచిదే.
      కాళోజి గారి కవిత మాత్రం బాగుంది.

      Delete
    4. బాబూ పానకంలో పిడకవో పుడకవో తెలియదు కానీ
      నీ అసందర్భ ప్రేలాపన చూస్తుంటే అరికాలిమంట నెత్తికెక్కుతోంది.
      అసలు నువ్వు నిజాం ప్రస్తావన ఎందుకు తెచ్చావో అర్ధం కాలేదు.
      కానీ ఒక్కటి మాత్రం నాకర్దమైంది ఏంటంటే.. నువ్వు పిచ్చోడివని!
      ఆల్ ద బెస్ట్..

      Delete
  6. పాప్యులర్ అయి ఉన్న "వరంగల్" పేరును మార్చాల్సిన అవసరం లేదు అన్నదే నా అభిప్రాయం కూడా!

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా చెప్పారు మ‌నోహ‌ర్ గారూ..
      ఉన్న పేర్లు ఉండ‌నీయ‌క సొంత పైత్యాలెందో అర్ధం కాదు...

      Delete
  7. I strongly oppose the name change...

    ReplyDelete
  8. పెండల రాయేస్తే మనమీదే పడుతుంది... ఈ పిడక గాడితో వాదనా అంతే..

    ReplyDelete