Tuesday, 9 July 2013

// వజ్రఖడ్గం//

గబ్బిలాల మీద పెన్ టార్చ్
లక్ష అగ్నిగోళాల పరావర్తనం
సర్క్యూట్లో పడి చచ్చింది గొర్రె
స్లమ్ ఏరియా కాకులు
మెన్షన్ హౌజ్ మీద లాండెడ్
పీకండిరా ఈకలు
లాగండిరా తోకలు
అనుపమ్‌ ఖేర్‌గాడు  
మటాష్ కొడుకు
చెవులకు చెప్పులు
తగిలించుకోండిక-
ఒకడి డ్రీంలో
వేరొకడి డిమాండ్:
మోడువారిన నేక్డ్ ట్రీ కి
పత్రదానం చేస్తే
వలువలు జార్చిన ఆకాశాన్ని
స్వప్నించమంటారేంట్రా

రక్తప్రసరణే లేని
చిమ్మచీకటి
మారుమూల
రసవిహీన
కృతహాస
మృతహాస
నిర్వేద లోయల
స్వీయ ఛాయ లేవీలేని
గొంతుకలంలో
మిస్సైళ్లు నింపితే
బ్రహ్మాండం బద్ధలైంది బాబయా
-
ఇప్పుడా
అస్తకవి కోసం
ప్రాగ్దిశ వేణువు ఊదండి
వ్యవస్థ నిండా దుఃఖమే ఉంటే
ఇంకా షెహనాయ్
శ్రుతి చేసుకోవడాలెందుకు
అతడు రాత్రిళ్లు
ఖర్చుచేసిన క్షణాలను
గడియారంలోకి ఎక్కించండి
వజ్రఖడ్గంరా కవిత!


హలో.. దిసీజ్ మై విజిటింగ్ కార్డ్‌!


కొత్త పాస్‌వర్డ్
కొత్త డిక్షన్‌
వస్తువు చిత్రణలో 
స్పానిష్‌ పెయిటింగ్‌ 
అక్షాంశ రేఖాంశాల చట్రంలోంచి 
బయటపడ్డ సాల్వెడార్‌ శిల్పం
నడకల చుట్టూ ఆధీన రేఖలు మాయం
అయినా
జెండాలెత్తిన జెండర్లంతా
డిసెక్షన్‌ బాక్సులతో తయార్‌
ఆ సెక్షన్‌ వాళ్లంతా
సామూహిక దుఃఖితులేనంటావా
అయితే కానీ,
అర్ధ జాగృత విహంగులంతా
నిష్ఠూరపు సంస్మరణ సభలుపెట్టి
గుంపులు గుంపులుగా రోదించనీ
ఉర్రూతలూగించే
ప్రత్యామ్నాయ పరవళ్లను ఆపకు
పాండురోగుల కోసం
ప్రాచీన వాక్యాలెందుకు
పిడికిలి సడలితే
రాత్రిని ఏలుకోవడం కష్టం
సర్రయలిజం అంటేనే పచ్చి నిజమ్
అధివాస్తవికతలో జరా మరణ జమ్
కత్తిదూస్తే సిరాచుక్కలో
సునామీ చెలరేగాలి
హలో ..
దిసీజ్ మై విజిటింగ్ కార్డ్‌!