Saturday, 25 May 2013

మీకో నగ్న సత్యం చెప్పనా..?



అల్ఫ్స్ పర్వతాల అంచుల్లో
లార్జ్ స్కేల్ షూటవుట్
ఫ్లెష్‌ ఆర్కిటెక్చర్‌
బాడీ ఆఫ్ ఇన్‌స్టాలేషన్
ఎస్కిమోల నరాల్లో ఉక్కపోత
ఏయ్‌.. నీపేరు
స్పెన్సర్‌ ట్యూనిక్‌ కదా!
 ---------------------------
న్యూడిజం అంటే...
నువ్వనుకున్నది కాదు తమ్మీ!?
Please use it sensibly!
బాడీ స్కల్‌ప్చర్‌లో
సోషల్ కాన్షియస్‌
మెక్సికో వీధుల్లో
నథింగ్ టు సీక్రెట్
కొన్ని కొలరాడోలు  
ఇంకొన్ని కిలిమంజారోలు  
ఇన్నర్‌ ఫ్రేగ్రెన్స్ వీచికలో
సింగిల్ లైన్‌ యవ్వన గీతం
ఇన్‌బిల్ట్‌ మెమొరీలో
పక్కకు జారిన పైటకొంగు
మౌంటెయిన్‌ మీద షిఫాన్‌ పరికిణి
కేన్స్ ఫెస్టివల్‌లో క్రష్డ్‌ ఫ్యాబ్రిక్‌
నయాగరా కింద బికినీ బాత్
లోటస్సరస్సు వొడ్డున
న్యూడ్ పిక్స్ గ్యాలరీ
వింటావా?
ద ఎటెర్నల్ నేక్‌డ్‌ ట్రూథ్‌
-----------------
మైండు దొబ్బిందా !
మూతికి మూడు కుట్లేసుకో
లేకుంటే,
నడ్డిమీద ముద్దెర్లేసి
పిరమిడ్‌ మధ్యలో నిలబెడతారు
అప్పుడు పాడుకుందువుగానీ-
నల్లాచీర నల్లారైక
నాలుగ్గొంటగా తానమా అని!!


Monday, 20 May 2013

ఇదండీ మన ఫ్యాషన్‌ !!


                            తమ్మీ నీకో నాగరికథ చెప్పనా
అనగనగా కొన్ని తుమ్మెద రెక్కలు
వాటి మీద లైట్ టచ్ ఆఫ్ క్లియర్ మస్కారా
నిరుడు కురిసిన బాసలేవని అడక్కు

రిప్ప్ డ్ జీన్స్ విత్ లేస్
చిరుగుల్లోంచి హైవోల్టేజీ గ్లామర్
జాలువారాల్సిన కుచ్చిళ్ల మీద
ప్రింటెడ్ జీన్స్ మొలిచింది

తమ్మీ దిసీజ్ స్లీవ్ లెస్ సీజన్
అనామికకు ఏమి తెలుసురా
కాళ్ల గజ్జెల గమ్మతి

చాక్లెట్ ఫేషియల్
వాటే డెలీషియస్ సీక్రెట్
బ్రాండ్ న్యూ ప్లేవర్
లాక్మే సెలూన్ బేసిన్‌లో
తెమడలు తెమడలు

పచ్చిపసుపు- శెనగ పిండి
యాక్ థూ:

హేర్ డ్యామేజీ కంట్రోల్ ఆల్ట్ డిలీట్!
రసం ఆఫ్ కుంకుడుకాయ షట్ డౌన్!!
రైస్ మేక్స్ యు ఫ్యాట్
ఫూడ్ హాబిట్ మీద ఫెమీనా కొత్త డెఫినిషన్
ఈటింగ్ కాన్సెప్ట్ మాడ్రేటెడ్
ముఫ్ఫిన్ తిని మూతి తుడుచుకోవడమే

శని ఆదివారాలు
మసక మసక చీకట్లు
అల్టిమేట్ ఎంటర్ టైన్
సలసల కాగుతున్న శరీరం
మధుపాత్రలో మెరుగైన సమాజం
కొట్టండిరా ఒరేయ్
గ్లాసులు పగిలేటట్లు బాదండిరా!!
 

Wednesday, 15 May 2013

ఇంకెందుకు రోజాపూలు



  
                                   
గుండే నిజమే
కత్తీ నిజమే
నెత్తురూ నిజమే
అయినా ఈ హత్యాకాండని
ప్రేమేనంటావా తమ్ముడూ..
తూనీగ తూనీగ పాటలోకి
లాటిన్‌ పదాలెలా దూరాయి
సుతిమెత్తని ఆమె కరచాలనం
ఊర్వశీ బార్‌ గిలాసలోకి
ఐసు ముక్కలా జారిందేమిటి?
చంద్రుడిలో ఉండే కుందేలు
ఎందుకిలా మట్టి దిబ్బలో పొర్లాడుతోంది!
లోకులు పలు కాకులు తమ్ముడూ
కేకుల్లా పొడుచుకు తిన్నారు!
ఆ నికృష్ఠుడొకడు..
జీవ పరిణామక్రమాన్ని తెలుసుకోమని
తీసుకెళ్లి రుష్యాశ్రమంలో
వదిలేసి వెళ్లాడు
దూరాన కొండమీద
ఉండుండీ మెరుపు  
అర్జునా ఫల్గుణా!!
ఎవడి దారిన వాడు వెళ్లిపోయాడు
ఇంకెందుకీ రోజాపూలు
ఆమె పొడవాటి జడపాయలు
ఎప్పుడో విడిపోయాయి
ఇప్పుడు చెప్పు తమ్ముడూ
దీన్నీ ప్రేమేనంటారా?
                                                      

Tuesday, 14 May 2013

//నా మరణవార్త //


కంటి కొసన నిప్పు రాజుకుంది
మంటల్లో కొన్ని స్వప్నాలు 
రెండు గ్లిజరిన్ చుక్కలుంటే 
ఒంపవా..
నా మరణవార్త నేనే చెప్పుకుని 
దుఃఖిస్తాను
స్వరపేటికలో 
నెత్తుటిపూల పాట 
నింపుకుంటాను
మృత్యోర్మా అమృతంగమయా!
నీ ఉంగరాల జుట్టుమీద
నాకింకా పిచ్చి పోలేదే..
మరిచిపోయావా..
హిమాయత్‌నగర్
స్ట్రీట్ నెంబర్ 5
పిక్ ఎన్ మూవ్ దగ్గర
వెనక్కి వెనక్కి తిరిగిన చూసిన
దృశ్యాలనేకనేకాలు
అప్పుడు నీ కళ్లలో పూసిన
డిసెంబర్ పూలు
ఇంకా పొరలు పొరలుగా 
నా గుండెలో నవ్వుతునే ఉన్నాయి
వెళ్లేవాళ్లు ఎంత నిర్దయగా పోతారో కదా
మంగళసూత్రాలు కళ్లకద్దుకుని
అందుకే:
మోహావేశ 
ప్రేమాక్రోశ 
దృక్కుల్లోంచి
బయటపడని పద్యాన్ని 
దోసెడు కాయితాలేసి 
తగలబెట్టాను
సమాధికింద 
బుట్టదాఖలైన 
ప్రేమలేఖలు
కొంచెం పక్కకి జరగవా
ముక్కు చీదుకుంటాను..